New Caledonia
-
భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటూ, న్యూ కలెడోనియా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో అస్ట్రేలియాకు తూర్పువైపున్న దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ కలెడోనియాకు చెందిన లాయాలిటీ దీవులకు ఆగ్నేయంవైపున 155 కిమీటర్ల దూరంలో 10 కిమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి 1000 కిలోమీటర్ల పరిధిలో సునామీ ప్రభావం ఉండొచ్చని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
స్వాతంత్య్రం వద్దన్న న్యూ కెలడోనియా
-
మాకు స్వాతంత్య్రం వద్దు!
నౌమీ: పసిఫిక్ సముద్రంలోని న్యూ కెలడోనియా దీవుల వాసులు ఫ్రాన్స్ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన రెఫరెండంలో మొత్తం 2.69 లక్షల జనాభాలో అర్హులైన 1.75 లక్షల మంది పాల్గొన్నారు. మొత్తం ఓటింగ్‌లో 70 శాతం లెక్కింపు పూర్తి కాగా అందులో 59.5 శాతం మంది స్వాతంత్య్రం వద్దు, ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ ఫలితాలు 1853లో ఫ్రాన్స్ వలస ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ సెటిలైన శ్వేత జాతీయులు, స్థానిక కనాక్ ప్రజల మధ్య వైషమ్యాలను మరింత పెంచే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1998లో రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో 70 మంది చనిపోయారు. ఆ తర్వాతే న్యూ కెలడోనియాకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు, రెఫరెండం నిర్వహించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం స్వాతంత్య్రం కావాలా వద్దా అనే విషయంపై 2022లో మరోసారి రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దాదాపు 18వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలోని ఈ సుందరమైన దీవులు ఫ్రాన్స్‌కు వ్యూహాత్మకంగా కీలకమైనవి. ప్రపంచంలోని నికెల్ నిల్వల్లో 25 శాతం ఇక్కడే ఉన్నాయి. నికెల్‌ను ముఖ్యమైన ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీలో వినియోగిస్తుంటారు. -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
నౌమియా : న్యూ కెలడోనియా తూర్పు తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ మేరకు అమెరికన్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటన విడుదల చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్టేలుపై 7.0గా నమోదైనట్లు తెలిపింది. దేశంపై సునామీ దాడి జరిగే అవకాశం ఉందని పసిఫిక సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. సునామీ వల్ల 300 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం జరగుతుందని హెచ్చరించింది. న్యూ కెలడోనియాలో తూర్పు తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ రాజధాని నౌమియా ఉంది. సోమవారం ఉదయం భూకంపం సంభవించే ముందు న్యూ కెలడోనియాలో ఆదివారం అర్థరాత్రి పలుమార్లు భూమి కంపించినట్లు రిపోర్టులు వచ్చాయి.