new dgp
-
ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం
-
ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమాకం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ చేయనుండగా, ఈ క్రమంలో హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
Telangana: డీజీపీ కుర్చీ ఎవరికి?.. రేసులో ఆ ముగ్గురు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ బాస్ పోస్టు ఎవరికి దక్కుతుందన్న దానిపై పోలీసు శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త డీజీపీ రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై పోలీసు వర్గాలు అంచనాలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం సీనియారిటీ ప్రకారం.. రాష్ట్ర పోలీసుశాఖలో ఐపీఎస్ 1989 బ్యాచ్‌కు చెందిన ఉమేష్ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్ సింగ్, అంజనీకుమార్, రవిగుప్తా డీజీ (డైరెక్టర్ జనరల్) ర్యాంకులో.. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్ ఇద్దరూ అదనపు డీజీపీ హోదాలో ఉన్నారు. రేసులో ఎవరెవరు? అందరిలోకి సీనియర్ అయిన ఉమేష్ షరాఫ్ 2023 జూన్‌లో రిటైర్ కానున్నారు. దీనితో ఆయనకు డీజీపీగా అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత 1990 బ్యాచ్‌కు చెందిన గోవింద్ సింగ్ (ప్రస్తుత సీఐడీ చీఫ్) ఈ ఏడాది నవంబర్లోనే పదవీ విరమణ చేయనున్నారు. ఇదే బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్ (ఏసీబీ డీజీ), రవి గుప్తా (హోంశాఖ ముఖ్య కార్యదర్శి) ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్నారు. వీరు డీజీపీ పోస్టు రేసులో ఉంటారు. ఇక గోవింద్ సింగ్ పదవీ విరమణతో ఖాళీ అయ్యే డీజీ ర్యాంకు పోస్టులోకి రాజీవ్ రతన్ పదోన్నతి పొందుతారు. ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా.. ప్రభుత్వం ఎక్స్ కేడర్ కోటా కింద మరో డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించేందుకు అవకాశం ఉంది. అంటే సీవీ ఆనంద్‌కు కూడా డీజీ ర్యాంకు పదోన్నతి రావొచ్చని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన అంజనీకుమార్, రవిగుప్తాలతోపాటు రాజీవ్ రతన్, సీవీ ఆనంద్ కూడా డీజీపీ రేసులో ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకుని అదనపు డీజీపీ హోదాలో ఉన్న వారి పేరునూ డీజీపీ పోస్టు కోసం పరిశీలించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన అదనపు డీజీపీ జితేందర్ పేరూ నియామక ప్యానల్ జాబితాలోకి వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. చదవండి: (Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే!) డిసెంబర్ రెండో వారంలో.. రాష్ట్ర జీఏడీ విభాగం డీజీపీ నియామకానికి సంబంధించి ప్యానల్ లిస్ట్‌ను డిసెంబర్ రెండో వారంలో యూపీఎస్సీకి పంపనుంది. ఈ జాబితాలో ఉమేష్ షరాఫ్, రవిగుప్తా, అంజనీకుమార్, రాజీవ్ రతన్, సీవీ ఆనంద్, జితేందర్ పేర్లను పంపే అవకాశం ఉంది. 2023 జూన్‌లో రిటైర్ కానున్న ఉమేష్ షరాఫ్ పేరును పరిగణనలోకి తీసుకోకున్నా డీజీ హోదా అధికారి కాబట్టి పంపడం తప్పనిసరని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం పంపే జాబితా నుంచి ముగ్గురి పేర్లను యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ తిరిగి సూచిస్తుంది. అందులో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకునే అవకాశం ఉంటుంది. నియామకాల్లో కీలకం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటి డీజీపీగా అనురాగ్ శర్మ 2017 నవంబర్ వరకు సేవలు అందించారు. తర్వాత రెండో డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆయన పదవిలో ఉంటారు. ఈ ఇద్దరూ కూడా హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేసి డీజీపీగా నియమితులైనవారే కావడం గమనార్హం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ చాలా మంది డీజీపీలు హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన వారే. ప్రస్తుతం రేసులో ఉన్న అంజనీకుమార్ కూడా హైదరాబాద్ సీపీగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కొనసాగుతున్నారు. -
ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి
-
ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, అమరావతి/రాజుపాళెం(వైఎస్సార్ జిల్లా) /పరిగి(అనంతపురం): రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. 1992∙బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. స్వగ్రామంలో సంబరాలు.. వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలంలోని పర్లపాడుకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి.. తండ్రి వెంకటపతిరెడ్డి తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. రాజేంద్రనాథ్‌రెడ్డి సోదరుడు వ్యాపారవేత్తగా రాణిస్తుండగా.. సోదరి కర్నూలు జిల్లా నంద్యాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. రాజేంద్రనాథ్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవారని పర్లపాడు గ్రామస్తులు చెప్పారు. ఆయన మైదుకూరు ప్రభుత్వ పాఠశాల, అనంతపురంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల, రాజస్థాన్‌లోని బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1992లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయనకు ప్రభుత్వం డీజీపీ బాధ్యతలు అప్పగించడంతో స్వగ్రామం పర్లపాడులో గ్రామస్తులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. గ్రామంలోని శివాలయంలో ఆయన పేరు మీద పూజలు, అభిషేకాలు నిర్వహించగా.. ఎస్సీ కాలనీలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విద్యాభ్యాసం చేసిన అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లి పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు మురళీధరబాబు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు -
పంజాబ్‌కు కొత్త డీజీపీ
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడానికి కొద్ది గంటల ముందు రాష్ట్రంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఎన్నికల వేళ శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)ని మారుస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వీరేశ్ కుమార్ భవ్రాను పంజాబ్ కొత్త డీజీపీగా నియమిస్తూ శనివారం ఉత్తర్వులొచ్చాయి. కొంతకాలంగా భవ్రా పంజాబ్ హోంగార్డ్స్ డీజీపీగా కొనసాగుతున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అధికారుల ప్యానెల్ నుంచి భవ్రాను చరణ్‌జీత్ సింగ్ చన్నీ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ ఎంపికచేసింది. దీంతో భవ్రాను డీజీపీగా పంజాబ్ గవర్నర్ నియమించారు. బాధ్యతలు చేపట్టాక భవ్రా కనీసం రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. గత మూడు నెలలకాలంలో పంజాబ్‌కు కొత్త డీజీపీ రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం యూపీఎస్సీ పంపిన షార్ట్‌లిస్ట్‌లోని ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంచుకోవాలి. కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దిన్కర్ గుప్తా డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. అమరీందర్ తప్పు కున్నాక చన్నీ సీఎం అయ్యారు. గత సెప్టెంబర్‌లో 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ ప్రీత్ సింగ్ సహోతాను డీజీపీగా చన్నీ ఎంచుకున్నారు. అయితే సహోతా నియామకాన్ని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా వ్యతిరేకించారు. సిద్ధూ ఒత్తిడికి తలొగ్గిన చన్నీ సర్కార్.. సహోతాను తప్పించింది. రెగ్యులర్ డీజీపీ నియామకం జరిగే లోపు బాధ్యతలు నిర్వహించేందుకు 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయను చన్నీ ప్రభుత్వం డీజీపీ పీఠంపై కూర్చోబెట్టింది. -
జమ్ము-కాశ్మీర్ డీజీపీగా తెలుగుతేజం
-
బెంగాల్ డీజీపీగా రాజశేఖరరెడ్డి
పశ్చిమబెంగాల్ రాష్ట్ర నూతన డీజీపీగా 1982 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జీఎంపీ రాజశేఖరరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1976బ్యాచ్‌కు చెందిన నపరాజిత్ ముఖర్జీ పదవీ విరమణ చేయడంతో ఆయన నుంచి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ రాజశేఖరరెడ్డి అదే రాష్ట్రంలో ఇంటెలిజెన్స బ్రాంచ్ డీజీగా పని చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు మరికొందరు సైతం డీజీపీ పదవికి పోటీ పడగా, మమతా బెనర్జీ సర్కారు రాజశేఖరరెడ్డిని ఎంపిక చేయడం విశేషం. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇటీవల డార్జిలింగ్ ప్రాంతంలో ఆందోళనలు తలెత్తిన సమయంలో రాజశేఖరరెడ్డి పోషించిన పాత్ర పట్ల మమతా సర్కారు సంతృప్తి చెందడం వల్లే ఆయనను డీజీపీ పదవి వరించినట్లు పోలీసు శాఖ వర్గాల సమాచారం.