బెంగాల్‌ డీజీపీగా రాజశేఖరరెడ్డి | GM Prabhu Rajasekhar Reddy appointed new DGP of west bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ డీజీపీగా రాజశేఖరరెడ్డి

Published Tue, Oct 1 2013 11:32 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

GM Prabhu Rajasekhar Reddy appointed new DGP of west bengal

పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర నూతన డీజీపీగా 1982 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి జీఎంపీ రాజశేఖరరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1976బ్యాచ్‌కు చెందిన నపరాజిత్‌ ముఖర్జీ పదవీ విరమణ చేయడంతో ఆయన నుంచి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ రాజశేఖరరెడ్డి అదే రాష్ట్రంలో ఇంటెలిజెన్‌‌స బ్రాంచ్‌ డీజీగా పని చేశారు.



సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు మరికొందరు సైతం డీజీపీ పదవికి పోటీ పడగా, మమతా బెనర్జీ సర్కారు రాజశేఖరరెడ్డిని ఎంపిక చేయడం విశేషం. గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్రం కోసం ఇటీవల డార్జిలింగ్‌ ప్రాంతంలో ఆందోళనలు తలెత్తిన సమయంలో రాజశేఖరరెడ్డి పోషించిన పాత్ర పట్ల మమతా సర్కారు సంతృప్తి చెందడం వల్లే ఆయనను డీజీపీ పదవి వరించినట్లు పోలీసు శాఖ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement