గూగుల్‌కు పోటీగా ఫేస్బుక్ డూడుల్....
గూగుల్ డూడుల్ తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రపంచంలో జరిగే ప్రతి ప్రత్యేక సందర్భాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ గూగుల్ తన డూడుల్ ను అబ్బురపరుస్తూ ఉంటోంది. అయితే గూగుల్‌కు పోటీగా ఇప్పుడు కొత్త డూడుల్ ప్రొగ్రామ్‌ను సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా తీసుకొస్తోంది. అచ్చం గూగుల్ మాదిరిగానే నెటిజన్లలో అవగాహన కల్పించడానికి ఫేస్బుక్ ఈ ప్రొగ్రామ్ ఎంచుకుంది. తాము మార్కెటింగ్ ప్రొగ్రామ్‌ను లాంచ్ చేస్తున్నామని, ఆ ఈవెంట్‌కు ప్రజలు తమ అభిప్రాయాలు అందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈవెంట్స్‌ను తమతో పంచుకోవాలని ఫేస్బుక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గ్యారీ బ్రిగ్స్ చెప్పారు.
ఆ ప్రత్యేక సందర్భాన్ని, ఈవెంట్‌ను ఫేస్బుక్ తన న్యూస్‌ఫీడ్‌లో కూడా అందించనుంది. గూగుల్ డూడుల్ మాదిరిగా ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ తాత్కాలికంగా తన ఇంటర్ఫేస్ను ఫేస్బుక్ మార్చనుంది. సెలవులను, ఈవెంట్లను స్నేహితులతో పంచుకోవడానికి ఈ మెసేజ్ ఎంతో ఉపయోగపడనుంది. ప్రజల ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన సాంస్కృతిక క్షణాలు తెలుసుకోవడం కోసం ఈ ప్రొగ్రామ్ ఎంతో సహాయపడనుందని ఫేస్బుక్ తెలిపింది. చరిత్రాత్మకమైన సందర్భాలను సెలబ్రేట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ముందుకు తీసుకురానున్నట్టు పేర్కొంది.