సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దే.. ఐటీ టెస్టర్
అప్‌కమింగ్ కెరీర్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో నూతన ఉద్యోగావకాశాలు యువత తలుపు తడుతున్నాయి. వాటిలో ఒకటి ఐటీ టెస్టింట్. సాఫ్ట్వేర్లలోని లోపాలను పసిగట్టి, వాటిని సరిచేయడమే ఐటీ టెస్టింగ్. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ రంగాన్ని ఎంచుకోవచ్చు. స్కిల్స్ పెంచుకుంటూ కష్టపడి పనిచేస్తే ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. దేశ విదేశాల్లో మంచి అవకాశాలు, భారీ వేతనాలు అందుకొనేందుకు వీలు కల్పిస్తున్న నయా కెరీర్.. ఐటీ టెస్టింగ్.
నైపుణ్యం పెంచుకుంటే అధిక ఆదాయం
కంపెనీలు తమ కార్యకలాపాల కోసం కంప్యూటర్లలో ఎన్నో రకాల సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తుంటాయి. అవి సక్రమంగా పనిచేసినంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాఫ్ట్వేర్లలో లోపాలు తలెత్తితే మాత్రం భారీ నష్టం జరుగుతుంది. ప్రధానంగా స్టాక్ ఎక్ఛేంజ్‌లు, బ్యాంకులు, విమానయాన సంస్థల్లో సాఫ్ట్వేర్లు సజావుగా పనిచేసేలా చూసేందుకు ఐటీ టెస్టర్లను నియమిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల్లో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. ఈ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనాలు ఉన్నా పరిజ్ఞానం, అనుభవం పెంచుకుంటే అధిక ఆదాయం ఆర్జించడానికి వీలుంటుంది.
ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్
ఐటీ టెస్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలంటే.. దీనికి సంబంధించిన టెక్నాలజీ, టూల్స్‌పై నాలెడ్జ్ పెంచుకోవాలి. దీంతోపాటు లాజికల్ అనాలిసిస్, డిడక్షన్, అబ్జర్వేషన్, రీజనింగ్, ప్లానింగ్, టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ అండ్ రిపోర్టింగ్, ప్రజంటేషన్ స్కిల్స్‌ను అలవర్చుకోవాలి. ఫంక్షనల్ డొమైన్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి. సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కూడా అవసరం.
కొత్త కొత్త సాఫ్ట్వేర్లు తెరపైకి వస్తుండడంతో వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మనదేశంలో స్కిల్డ్ ఐటీ టెస్టర్లకు భారీ డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ అవసరాలకు తగినంత మంది టెస్టర్లు అందుబాటులో లేరని అంటున్నారు. ఐటీ టెస్టింగ్ రంగం వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొంటున్నారు. ఔత్సాహికులు ఇందులోకి నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చని సూచిస్తున్నారు.
అర్హతలు: ఐటీ టెస్టింగ్‌లో స్పెషలైజ్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వీటిలో చేరొచ్చు. ఐటీ టెస్టింగ్‌పై శిక్షణ పొందిన బీఎస్సీ, బీఈ, బీసీఏ విద్యార్థులను కంపెనీలు ఎక్కువగా నియమించుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ అభ్యర్థులు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి.
్డ
వేతనాలు: ట్రైనీ నుంచి డెరైక్టర్ వరకు వివిధ హోదాల్లో పనిచేసే ఐటీ టెస్టర్లకు వేర్వేరు వేతనాలు ఉంటాయి. టెస్ట్ ఇంజనీర్‌కు నెలకు రూ.8 వేల నుంచి రూ.13 వేలు, సీనియర్ టెస్ట్ ఇంజనీర్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు, టెస్ట్ లీడర్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేలు, టెస్ట్ ఆర్కిటెక్ట్‌కు రూ.50 వేల నుంచి రూ.75 వేలు, టెస్ట్ మేనేజర్‌కు రూ.75 వేల నుంచి రూ.లక్షన్నర, హెడ్ టెస్టింగ్‌కు రూ.లక్షన్నర నుంచి రూ.రెండున్నర లక్షల వేతనం అందుతుంది.
ఐటీ టెస్టింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
క్యూఏఐ గ్లోబల్ ఇన్స్టిట్యూట్
వెబ్సైట్: www.qaiglobalinstitute.com
ఎడిస్టా టెస్టింగ్ ఇన్స్టిట్యూట్-బెంగళూరు
వెబ్సైట్: www.edistatesting.com
అమిటీ సాఫ్ట్-చెన్నై
వెబ్సైట్: www.amitysoft.com
సాఫ్ట్వేర్ క్వాలిటీ ఇంజనీరింగ్
వెబ్సైట్: www.sqe.com
ఎన్నో రంగాల్లో అవకాశాలు
శ్రీరాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ రంగం మరింత విస్తరించనుంది. దేశ, విదేశాల్లోనూ మంచి కెరీర్ ఉన్న కోర్సు ఐటీ టెస్టింగ్. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఫైనాన్స్ రంగాలతోపాటు ఐటీలోనూ ఐటీ టెస్టింగ్ నిపుణుల పాత్ర ఎంతో కీలకం. ఇది కెరీర్ పరంగా ఉన్నత స్థానానికి చేరేందుకు స్కోప్ ఉన్న కోర్సు. అయితే ప్రభుత్వ రంగంతో పోల్చితే ప్రైవేట్ రంగంలోనే అవకాశాలు అధికం. ఉద్యోగ అవకాశాలతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేందుకు వీలుంది. ఆసక్తి ఉంటే స్నేహితులు, సహచరులతో కలిసి కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చ్ణు
- ఆర్.లక్ష్మణ్‌నాయక్, క్యాంపస్ ప్లేస్మెంట్ ఇన్‌ఛార్జి, ఆర్.జి.యు.కె.టి. వైఎస్సార్ కడప జిల్లా
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్‌లో హిస్టరీ ఆప్షనల్‌కు ఎలా ప్రిపేర్ కావాలో తెలియజేయండి?
- ఎస్.మేఘన సాయిశ్రీ, మలక్‌పేట
సివిల్స్ మెయిన్సలో 250 మార్కుల చొప్పున రెండు పేపర్లుగా హిస్టరీ ఆప్షనల్ ఉంది. అందులో పేపర్-1లో కీలకంగా చెప్పుకోవాల్సింది మ్యాప్ పాయింటింగ్. దీనికి 50 మార్కులు కేటాయించారు. గతంలో ప్రదేశాల పేర్లు ఇచ్చి వాటిని మ్యాప్‌లో గుర్తించమనేవారు. అంతేకాకుండా మూడు నుంచి నాలుగు వాక్యాల వివరణ రాయాల్సి ఉండేది. ఈసారి పాయింట్లను గుర్తించిన మ్యాప్ ఇచ్చి, ఆ పాయింట్లో ఉండే ప్రాంతాన్ని కనుగొని, దానిపై వివరణ రాయమని అడిగారు. అయితే క్లూగా అది ఏ రకమైన ప్రాంతం అనే అంశాన్ని తెలిపారు. మ్యాప్‌పై, ఆయా ప్రదేశాలపై పూర్తి అవగాహన ఉంటేనే సులువుగా వీటికి సమాధానం రాయొచ్చు. మిగిలిన ప్రశ్నల విషయానికొస్తే గత ఆప్షనల్ ప్రశ్నలకు, ఇప్పుడిచ్చిన ప్రశ్నలకు పెద్ద వ్యత్యాసం లేదు. ప్రశ్నలన్నీ అధికంగా రాజకీయేతర అంశాల నుంచి అడిగారు.
అయితే ఏ ప్రశ్నకు రెడీమేడ్ సమాధానం లభించదు. ప్రశ్న సరళిని బట్టి అభ్యర్థి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రశ్నకనుగుణంగా మార్చి సమాధానం రాయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధ్యయనం సమయంలోనే ఆయా అంశాలపై ప్రశ్నలు ఏవిధంగా అడిగే అవకాశముంటుందో కొంత మేరకు ఊహించాలి. దానికనుగుణంగా పరిపూర్ణంగా సిద్ధమైతే ప్రశ్నలు ఎలా వచ్చినా అప్పటికప్పుడే సమాధానాన్ని రాయొచ్చు. గతేడాది కంటే ప్రశ్నల సంఖ్య పెరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడానికి అభ్యర్థులకు సమయం సరిపోలేదు. బాగా సాధన చేసినవారే సమాధానాలు రాయగలిగారు. కాబట్టి అభ్యర్థులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకొంటేనే విజయం సాధ్యం.
ఇన్పుట్స్: యాకూబ్‌బాష,
సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ
స్కాలర్షిప్స్, జాబ్స్ అలర్ట్స
నేషనల్ స్కూల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్
లోర్ ఇండియన్ ఫౌండేషన్ టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న నేషనల్ స్కూల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తులు కోరుతోంది. టీసీఎస్ రూపొందించిన ద లెర్నింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎల్ఏటీ) పరీక్ష ద్వారా ప్రతిభావంతులను ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌తో పాటు గవర్నెన్స కౌన్సిల్ నుంచి కెరీర్ గెడైన్స్‌ను పొందే అవకాశం లభిస్తుంది. ఐఐటీ, ఐఐఎం, ఐఎస్బీ, ఎంసీఐ, యూజీసీ లాంటి సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు గవర్నెస్ కౌన్సిల్లో ఉంటారు. పూర్తి వివరాలకు www.lorefoundation.org వెబ్‌సైట్‌ను సదర్శించొచ్చు.
ఏరోనాటికల్ డెవలప్మెంట్
ఏజెన్సీ (ఏడీఏ)
బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్టెనోగ్రాఫర్
అర్హతలు: ఏదైనా డిగ్రీ, జూనియర్ లెవల్ ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి లేదా సెక్రటేరియల్/ కమర్షియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమా, కంప్యూట ర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా.
చివరి తేది: ఆగస్టు 19
వెబ్సైట్: www.ada.gov.in.
జనరల్ నాలెడ్‌జ
భారత రాజ్యాంగ ఆధారాలు
ఆధారం {Vహించిన అంశాలు
భారత ప్రభుత్వ చట్టం-1935 కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికార విభజన, ద్విసభా విధానం,
రాష్ర్టపతికి, రాష్ర్ట గవర్నర్లకు విచక్షణాధికారాలు
బ్రిటన్ రాజ్యాంగం క్యాబినెట్ తరహా పార్లమెంటరీ విధానం, సమన్యాయ పాలన,
ఏక పౌరసత్వం, స్పీకర్ హోదా, విధులు
అమెరికా రాజ్యాంగం {పాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయవ్యవస్థ, ఉపరాష్ర్టపతి ఎన్నిక,
న్యాయ సమీక్ష, రాష్ర్టపతి తొలగింపు
ఐర్లాండ్ రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు, రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం,
రాష్ర్టపతి ఎన్నిక
కెనడా రాజ్యాంగం సమాఖ్య విధానం, బలమైన కేంద్ర ప్రభుత్వం, కేంద్రానికి అవశిష్టాధికారాలు
వైమర్ (జర్మనీ) రాజ్యాంగం అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలు
భారతదేశ చరిత్రలో ప్రముఖ యుద్ధాలు
యుద్ధం జరిగిన సం॥ వివరాలు
మొదటి మరాఠా యుద్ధం 1775-82 {బిటిషర్లకు, మరాఠాలకు మధ్య
రెండో మరాఠా యుద్ధం 1803-05 {బిటిషర్లకు, మరాఠాలకు మధ్య
మూడో మరాఠా యుద్ధం 1817-18 మరాఠాల తిరుగుబాటు
మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం 1845-46 సిక్కుల తిరుగుబాటు
రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం 1848-49 పంజాబ్‌ను ఆక్రమించిన బ్రిటిష్ పాలకులు
అంబూర్ యుద్ధం 1749 ముజఫర్ జంగ్, చందాసాహెబ్, ఫ్రెంచి గవర్నర్ డూప్లే కలిసి కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్‌ను చంపారు
వాందివాశి యుద్ధం 1760 {బిటిష్ సేనాని సర్ ఐర్ క్రూట్.. ఫ్రెంచి వారైన జనరల్ బుస్సీ,కౌంట్-డి-లాలీని ఓడించాడు
నల్లమందు యుద్ధం 1856-1860 చైనీయులకు, బ్రిటిషర్లకు మధ్య జరిగింది.