New India Insurance Company
-
ప్రపంచవ్యాప్త కవరేజీతో న్యూఇండియా హెల్త్‌ప్లాన్
ముంబై: న్యూ ఇండియా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తొలిసారిగా ప్రపంచవ్యాప్త కవరేజీతో కూడిన గ్లోబల్ మెడిక్లెయిమ్ పాలసీని మంగళవారం ఆవిష్కరించింది. కేన్సర్, అవయవ మార్పిడి, బోన్‌మారో ఇలా ఆరు రకాల క్రిటికల్ ఇల్నెస్లకు 0.5 మిలియన్ డాలర్ల నుంచి 20 మిలియన్ డాలర్ల వరకు ఈ పాలసీలో కవరేజీ పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 100 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నట్టు న్యూఇండియా జనరల్ ఇన్సూరెన్స్ చైర్మన్, ఎండీ జి.శ్రీనివాసన్ మీడియాకు తెలిపారు. 18–75 సంవత్సరాల మధ్యనున్న వారు ఎటువంటి ముందుస్తు షరతులు లేకుండా ఆరు రకాల క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజీ పొందొచ్చు. ఎన్ని రకాల క్రిటికల్ ఇల్నెస్ కవరేజీలను ఎంచుకున్నారు, వయసు తదితర అంశాలపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి ఒక దానికి కవరేజీ ఎంచుకుంటే ప్రీమియం రూ.5,672. ఆరు రకాల క్రిటికల్ ఇల్నెస్లకు కవరేజీ కోరుకుంటే ప్రీమియం రూ.12,716. అదే 75 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఒక దానికి కవరేజీ కోసం ప్రీమియం రూ.2,05,696 కాగా, క్రిటికల్ ఇల్నెస్ కవర్‌తో కలిపితే వార్షిక ప్రీమియం రూ.4,95,899 అవుతుంది. -
ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరిహారం
ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ. 10 లక్షల పరి హారం చెల్లించాలని మోటారు వాహనాల క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎంఏసీటీ) గురువారం న్యూఇండియా బీమా సంస్థను ఆదేశించింది. దక్షిణ ఢిల్లీలో నివసించే 19 ఏళ్ల సోను అనే యువకుడు 2008లో ఓ బస్సు ఎక్కాడు. అయితే డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడుపుతూ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో అందులోనుంచి కింద పడ్డాడు. దీనిపై అప్పట్లో ఎంఏసీటీలో ఫిర్యాదు దాఖలైంది. దీనిని పరిశీలించిన ఎంఏసీటీ...సోను వాదన బలంగా ఉందని, పోలీసుల విచారణ దీనిని బలపరుస్తోందని ట్రిబ్యునల్ పేర్కొంది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఏ ఒక్క ఆధారమూ లేదంది. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన కారణంగానే అతడు తీవ్రంగా గాయపడ్డాడనే విషయం తేలిందని ఎంఏసీటీ ప్రిసైడింగ్ అధికారి అజయ్కుమార్జైన్ పేర్కొన్నారు. వైద్యనివేదిక ఆధారంగా పరిహారం ఇవ్వాలని ఆదేశించిన ఎంఏసీటీ.... సోను ఈ ప్రమాదంలో 51 శాతంమేర గాయపడ్డాడని పేర్కొంది. తాత్కాలిక అంగవైకల్యానికి లోనయ్యాడంది. అయితే దానర్థం అతను శాశ్వత అంగవైకల్యానికి గురికాలేదని కాదంది. సోను దాదాపు ఆరు సంవత్సరాలపాటు వైద్యచికిత్స పొందుతూనే ఉన్నాడంది. ఈ నేపథ్యంలో అతడు శాశ్వత వైకల్యానికి గురయ్యే ప్రమాదమూ లేకపోలేదంది. ఈ కారణంగా అతడు తన దైనందిన కార్యకలాపాలను చేసుకోలేకపోతున్నాడంది. కాగా 2008, డిసెంబర్ 15వ తేదీన సోను బస్సులో ఇంటికి బయల్దేరాడు. బస్సు దిగుతున్న సమయంలో అకస్మాత్తుగా వేగం పెంచడంతో అందులోనుంచి కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీపంలోని ఎయిమ్స్‌కు తరలించారు. మరోవైపు సోను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే బస్సు నుంచి కిందపడిపోయాడంటూ డ్రైవర్ చేసిన వాదనను ఎంఏసీటీ కొట్టిపారేసింది.