సినీ నటుడు శరత్ కుమార్ కు సత్కారం
రాజకీయ వేత్తగా మారిన దక్షిణాది నటుడు శరత్ కుమార్ ను న్యూజెర్సీ రాష్ట్ర శాసనసభ ఘనంగా సత్కరించింది. రాజకీయాల్లో ప్రవేశించి..తన నియోజకవర్గానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా సత్కరించినట్టు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ చివుకులు ఉపేంద్ర తెలిపారు. సెంట్రల్ అసెంబ్లీ హాల్ జరిగిన ఓ కార్యక్రమంలో స్పీకర్ షీలా ఓలివర్ సంతకం చేసిన జ్ఞాపికను శరత్ కుమార్ కు ఉపేంద్ర అందచేశారు.
తన నియోజకవర్గానికి విశేష సేవలు అందిస్తున్న శరత్ కుమార్... సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మూడవసారి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. గతంలో శరత్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.
న్యూజెర్సీ పర్యటనలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డగ్లస్ హెచ్ ఫిషర్, చివుకుల ఉపేంద్ర, జయంతి విలయానూర్, వ్యవసాయ శాఖ నిపుణుడు అల్ ఫ్రెడ్ ముర్రేలతో సమావేశమయ్యారు. న్యూజెర్సీలోని అధునిక వ్యవసాయ పద్దతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.