New parliament
-
అది రాష్ట్రపతిని అవమానించడమే: ఖర్గే
ఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి కేంద్రం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. సినీ తారలను ఆహ్వానించిన బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రపతిని విస్మరించడం ఆ హోదాను.. ఆ హోదాలో ఉన్న ఆమెను అవమానించినట్లేనని మండిపడ్డారు. శనివారం రాజస్థాన్ జైపూర్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఓ కార్యక్రమంలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘భారత రాజ్యాంగాన్ని అనుసరించి.. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తిని ఇలా అవమానించడం దారుణం. పార్లమెంట్ ప్రారంభం అయితే రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. సినీ తారలను ఆహ్వానిస్తారా. ఇది రాష్ట్రపతిని అవమానించడమే. కాంగ్రెస్‌లో అన్ని కమ్యూనిటీలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ, బీజేపీ ఎవరినీ దగ్గరకు రానివ్వదు’’ అని ఖర్గే అన్నారు. అంతేకాదు.. గతంలో రామ్ నాథ్ కోవింద్‌ను సైతం పార్లమెంట్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి బీజేపీ ఆహ్వానించలేదనే విషయాన్ని ఖర్గే ప్రస్తావించారు. అది అంటరానితనమే అవుతుందన్నారు. ఒకవేళ అంటరాని వాడిగా భావించే వ్యక్తితో శంకుస్థాపన జరిపించినా.. సహజనంగానే వాళ్లు గంగాజలంతో శుద్ధి కార్యక్రమం నిర్వహించేవాళ్లేమో అని ఖర్గే బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశం బీజేపీ ప్రభుత్వానికి లేనేలేదని ఖర్గే అన్నారు. కేవలం ఇండియా కూటమికి భయపడే రిజర్వేషన్ అంశం.. అదీ ఎన్నికల ముందర బీజేపీ తెచ్చిందని విమర్శించారాయన. -
Udayanidhi Stalin: సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని విమర్శించారు. రాష్ట్రపతి గిరిజన మహిళ, వితంతువు కావడం వల్లే ఆహ్వనించలేదని ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వేళ బాలీవుడ్ హీరోయిన్స్‌ను పార్లమెంట్‌కు ఆహ్వానించారన్న ఉధనియనిధి స్టాలిన్.. సనాతన ధర్మం అంటే ఇదేనా అని బీజేపీని ప్రశ్నించారు. కాగా ఇటీవల సైతం సనాతన ధర్మంపై మంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ.. దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అన్నారు తమిళనాడు మంత్రి. ఈ మాటలపై బీజేపీ సహా హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ సైతం సనాతన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్శాన్ని నిర్మూలించడమే ఇండియా కూటమి లక్ష్యమని అన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సామాజిక వివక్షపై తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఉదయనిధి స్టాలిన్.. దాన్ని నిర్మూలించాలంటే సనాతన ధర్మాన్ని నాశనం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. సనాతన ధర్మం వల్లే అంటరానితనం వచ్చిందని.. ఈ రెండు కవల పిల్లలు అని అన్నారు. సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని.. అప్పుడే సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక వివక్ష పోతుందని తెలిపారు. VIDEO | "Yesterday, some Hindi actors came and visited the new Parliament but our President was not invited. Why? Because Droupadi Murmu is from a tribal community. This is what we call 'Sanatan Dharma'," Tamil Nadu minister @Udhaystalin said at a meeting of DMK Youth Wing in… pic.twitter.com/K4JtYWNyz1— Press Trust of India (@PTI_News) September 20, 2023 -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆరేళ్లు ఆగాల్సిందే!
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు తొలి అడుగుపడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన తొలిరేజే (సోమవారం) మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. . నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు..కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు కావడం విశేషం. బుధవారం రోజు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది, ఏడు గంటలపాటు లోక్‌సభ సభ్యులు చర్చించనున్నారు. సెప్టెంబర్ 21న రాజ్యసభకు బిల్లు వెళ్లనుంది.విధాన నిర్ణయాల్లో మహిళా భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చినఈ బిల్లు ఆమోదానికి ఉభయసభల సభ్యులు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని మోదీ కోరారు. అయితే ఈ బిల్లుకు విపక్ష పార్టీలు కూడా మద్దతివ్వడంతో త్వరలోనే చట్టరూపం దాల్చే సూచనలు కనిపిస్తాన్నాయి. బిల్లు పాసైతే పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లులో కీలక అంశాలు మహిళా బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొంది చట్టంగా మారితే.. లోక్‌సభ, అసెంబ్లీలలో మూడో వంతు సీట్లు మహిళలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఢిల్లీ అసెంబ్లీకీ ఇది వర్తిస్తుంది.ఈ కోటాలోనే మూడో వంతు సీట్లు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కేటాయించారు. అయితే ఈ బిల్లులో ఓబీసీలకు రిజర్వేషన్ లేదు. ఎందుకంటే చట్టసభలకు అలాంటి నిబంధన లేదు. అందుకే దశాబ్ధాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లును సమాజ్‌వాదీపార్టీ, ఆర్జేడీ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతోపాటు ఈ బిల్లు రాజ్యసభ, శాసనమండలికి వర్తించదు. ► అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2029 నాటికి అమల్లోకి రానుంది. నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానుంది. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే ముందుగా జనగణన జరగాలి. జనాభా జనాభా గణనను 2021లో నిర్వహించాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ► తాజా జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తరువాతే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది.. అంటే 2027 తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. 2029 లోక్‌సభ ఎన్నికలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్లు బిల్లు అమల్లో ఉండనుంది. వీలైతే దీనిని పొడిగించే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన ప్రతిసారీ రొటేషన్ ప్రక్రియలో మహిళా రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుంది. ► ఈ బిల్లు 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లును పోలి ఉంటుంది. కానీ అప్పుడు ఆ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో ఆ లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు కథ ముగిసిపోయింది. ఈ కొత్త బిల్లులో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీని తొలగిస్తూ రెండు సవరణలు మాత్రమే చేశారు. అయితే ఈ కొత్త బిల్లు 2010 నాటిది కాదని.. మహిళా రిజర్వేషన్ల కోసం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. -
మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాజ్యసభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనంలో రాజ్యసభ కొలువుదీరింది. ఈ సందర్భంగా తొలుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని అనఅన్నారు. పార్లమెంట్‌పై దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఎన్నో విప్లవాత్మక బిల్లులు తీసుకొచ్చామని తెలిపారు. భారత్ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని.. రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతోందని పేర్కొన్నారు. ఇందుకు కొత్త పార్లమెంట్ సాక్ష్యంగా నిలవబోతోందని తెలిపారు మేకిన్ ఇండియా గేమ్ ఛేంజర్‌గా మారిందన్నారు ప్రధాని మోదీ. 2047లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. కొత్త పార్లమెంట్‌లోనే స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటామని చెప్పారు. మహిళా సాధికారత కోసం కట్టుబడి ఉన్నామన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టామని, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశామని ప్రస్తావించారు. దేశ నిర్మాణంలో మహిళలతే కీలక పాత్ర ఉండబోతుందన్నారు. చదవండి: లోక్‌సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says..." Federal structure presented India's power in front of the world and the world was impressed...during G 20 summit, various meetings took place across different states. Every state with great… pic.twitter.com/IgQoHNldJo — ANI (@ANI) September 19, 2023 ఇదిలా ఉండగా సోమవారం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. 96 ఏండ్ల నాటి పాత పార్లమెంటు భవానికి ఎంపీలు వీడ్కోలు పలికి.. నేడు కొత్త భవనంలో అడుగుపెట్టారు. మంగళవారం నుంచి సభా కార్యకలాపాలు కొత్తపార్లమెంట్ వేదికగా జరుగుతున్నాయి. #WATCH | In the Rajya Sabha of the new Parliament building, PM Narendra Modi says, "...we did not have a majority in the Rajya Sabha but we were confident that the Rajya Sabha would rise above political thinking and take decisions in the interest of the country. Because of your… pic.twitter.com/1uxql7s3u8 — ANI (@ANI) September 19, 2023 ఈ క్రమంలో నేడు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. రేపు లోక్‌సభలో బిల్లుపై చర్చ జరగనుంది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో చర్చకు రానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. -
మీకు రూ.75 కాయిన్ కావాలా అయితే సింపుల్ గా ఇలాచేయండి..!
-
కొత్త పార్లమెంట్ భవనం పై అసాదుద్దీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
నూతన పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించాలి...
-
ప్రస్తుతం ఉన్న పార్లమెంటు ఒక మైలురాయిగా నిలిచింది
-
కొత్త రాజ్యసభ ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులు
న్యూఢిల్లీ: ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన 57 మంది ఎంపీల్లో 55 మంది కోటీశ్వరులు కాగా.. ఇందులో 13 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఎంపీల అఫిడవిట్లో పేర్కొన్న వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. ఎక్కువ ఆస్తులున్న ఎంపీల్లో రూ. 252 కోట్లతో ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ మొదటి స్థానంలో ఉండగా.. కపిల్ సిబల్ (కాంగ్రెస్-రూ.212 కోట్లు), సతీశ్ చంద్ర మిశ్రా (బీఎస్పీ-రూ.193 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బీజేపీ ఎంపీలు అనిల్ మాధవ్ దవే (రూ.60 లక్షల), రామ్ కుమార్ (రూ.86 లక్షలు) చివరి స్థానంలో ఉన్నారు. ఎంపీలందరి ఆస్తుల సగటు రూ. 35.84 కోట్లుగా తేలిందని ఏడీఆర్ పేర్కొంది. అటు, యూపీ నుంచి నలుగురు, బిహార్ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌నుంచి ఒక్కో ఎంపీపై క్రిమినల్ కేసులున్నాయి. -
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం దిశగా అడుగులు