new police commissioner
-
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
హైదరాబాద్ సీపీ కోసం నలుగురి పేర్లు
-
ఫస్ట్ ఉమన్.. క్లిష్ట పరిస్థితుల్లో గట్టి పోలిస్ ఆఫీసర్
‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనేది మన తెలుగు సినిమా డైలాగైతే కావచ్చుగానీ హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు వెళితే ‘సిటీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు’ అనే రియల్ డైలాగ్ లోకల్ లాంగ్వేజ్‌లో అప్పట్లో తరచు వినిపించేది. సిటీ పరిస్థితి క్లిష్టస్థితిలో పడడానికి శాంతిభద్రతల నుంచి ట్రాఫిక్ అస్తవ్యస్తతల వరకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్టసమయంలో గుర్‌గ్రామ్ తొలి మహిళా పోలిస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు కళారామచంద్రన్. రెవారి, ఫతేహబాద్, పంచ్‌కుల జిల్లాల సూపరిండెంట్ ఆఫ్ పోలిస్‌గా పనిచేసినా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినా, మేఘాలయాలోని ఈశాన్య ప్రాంత పోలిస్ అకాడమీ హెడ్‌గా పనిచేసినా... కళా రామచంద్రన్ తనదైన ప్రత్యేకతను సృష్టించుకున్నారు. నిఖార్సయిన పోలిస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు.గుర్‌గ్రామ్‌లో చూడచక్కని రోడ్లు ఉన్నాయి. కానీ ఏంలాభం? ‘వేగమే మా నైజం’ అన్నట్లుగా దూసుకుపోతుంటాయి వాహనాలు. దీనివల్ల యాక్సిడెంట్లు, మరణాలు. మరోవైపు డ్రంకెన్ డ్రైవింగ్. ఇంకోవైపు స్ట్రీట్క్రైమ్స్. సైబర్‌క్రైమ్, ఈవ్‌టీజింగ్ లాంటి సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నిష్క్రియాపరత్వం మీద వేడివేడి విమర్శ లు కూడా వచ్చాయి.అలాంటి క్లిష్ట సమయంలో బాధ్యత లు తీసుకున్న కళారామచంద్రన్ ‘నగరాన్ని ఏ మేరకు భద్రంగా ఉంచగలరు?’ అనే సందేహాలు రాకపోవడానికి కారణం ఆమెకు ఉన్న వృత్తి నిబద్ధత, మంచిపేరు. ‘క్షేత్రస్థాయి నుంచి పోలిసు పర్యవేక్షణను బలోపేతం చేసే కార్యాచరణకు శ్రీకారం చుట్టాం’ అంటున్నారు కళా రామ చంద్రన్. రకరకాల ప్రాంతాలలో పనిచేసిన అనుభవంతో పాటు, భర్త ఇచ్చిన సూచనలు కూడా గుర్గ్రామ్ని ‘సేఫర్ అండ్ బెటర్’ సిటీగా మార్చడానికి ఉపయోగపడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కళారామచంద్రన్ భర్త నవదీప్‌సింగ్ సీనియర్ ఐపీయస్ అధికారి. గుర్‌గ్రామ్ పోలిస్ కమిషనర్‌గా పనిచేశారు. -
'లంచంతో నా శాడిస్టు భర్తకు క్లీన్ చిట్ ఇచ్చారు'
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త పోలీసు బాస్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆయన బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 'మీ డిపార్ట్ మెంట్ అధికారులు లంఛం తీసుకొని వేధింపులకు పాల్పడుతున్న తన భర్తను వదిలేశారంటూ' ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. సోమవారం ఢిల్లీ కొత్త పోలీసు కమిషనర్ గా బస్సీ స్థానంలో అలోక్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన అలా తీసుకున్నారో లేదో ఓ మహిళ తన ఒడిలో రెండు నెలల చంటి బిడ్డను తీసుకొని పోలీసు బాస్ కార్యాలయం వద్దకు వచ్చి కూర్చుంది. అక్కడే కుప్పలుగా మీడియా ప్రతినిధులు ఉన్నారు. తన అత్తమామలు, భర్త కలిసి తన బిడ్డను తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె రోధించడం ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ కు చెందిన అరిఫా అనే మహిళ పోలీసు కమిషనర్ బాధ్యతలు తీసుకునే సమయంలో గేటు వద్దకు వచ్చింది. పోలీసు అధికారులు.. తనను వేధిస్తున్న భర్త వద్ద లంఛం తీసుకొని అతడికి క్లీన్ చిట్ ఇచ్చారని, ఈ విషయం పోలీసు కమిషనర్ కు చెప్తానని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పింది. అయితే, లోపలికి అనుమతించకపోవడంతో మీడియాను ఆశ్రయించి అన్ని వివరాలు తెలిపింది. కమిషనర్ బిజీ కార్యక్రమాల వల్ల ఆమె ఆయనతో సమస్య చెప్పుకోలేకపోయింది. -
కొత్త కొత్వాల్ మహేందర్‌రెడ్డి
జూన్ 2న బాధ్యతలు స్వీకరించే అవకాశం 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాజధానికి కొత్త పోలీస్ కమిషనర్‌గా ఎం.మహేందర్‌రెడ్డి పేరు ఖరారైంది. జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటలకే మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేందర్‌రెడ్డిని కొత్వాల్‌గా నియమించే అంశంలో ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడికి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఆయన నియామకానికి మార్గం సుగమమైనట్లు తెలిసింది. ప్రస్తుత నగర పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఎంపిక కావడంతో ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను కాపాడే సమర్ధవంతులైన ఐపీఎస్ అధికారి ఎవరనే విషయంలో పలుమార్లు ఉన్నతస్థాయిలో అధికారులు తర్జనభర్జన పడ్డారు. అయితే చివరకు మహేందర్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే ఎం.రవీందర్ బంద్‌కు మద్దతు తెలిపారు. బంద్‌లో తామూ పాల్గొంటున్నట్లు తెలంగాణా విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బంద్‌కు మద్దతు.. అఫ్జల్‌గంజ్: తెలంగాణ బంద్‌కు సంపూర్ణమద్దతునిస్తున్నట్లు తెలంగాణ మజ్దూర్యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్.బి.రెడ్డి, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎస్ నాగరాజు, తెలంగాణ వ్విశ్వవిద్యాలయాల ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులు గురువారం యథాతథంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులసూచన మేరకు ఆయా రూట్లలో బస్సులు నడుపుతామని గ్రేటర్ జోన్ ఈడీ కోటేశ్వరరావు స్పష్టం చేశారు. జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి. నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లు షెడ్యూలు ప్రకారమే నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రజాసంబంధాల అధికారి సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.