new Registrar
-
శాతవాహన రిజిస్ట్రార్ ఎవరో..?
శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహనయూనివర్సిటీకి కొత్త రిజిస్ట్రార్ ఎవరు వస్తారనే చర్చ యూనివర్సిటీతోపాటు పరిధిలోని వివిధ కళాశాలల్లో ప్రారంభమైంది. ఈనెల 31తో ప్రస్తుతం పనిచేస్తున్న రిజిస్ట్రార్ ఎం.కోమల్‌డ్డి ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత ఎవరు వస్తారనే అంశంపై అందరి దృష్టి నెలకొంది. నాలుగేళ్లుగా ఇన్చార్జి పాలనలో కొనసాగుతున్న యూనివర్సిటీకి కీలకంగా రిజిస్ట్రార్ స్థానమే బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇన్చార్జి వీసీలు ఇక్కడ పెద్దగా సమయం కేటాయించకపోవడంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం.. సమస్యలొస్తే పరిష్కరించడానికి రిజిస్ట్రార్ అందుబాటులో ఉండి పర్యవేక్షించారు. అలాంటి రిజిస్ట్రార్ పోస్టు ఇప్పుడు ఖాళీ అయితే ఎలా..? అనేది అందరి ఆలోచన. నాలుగేళ్లుగా యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించకుండానే ప్రభుత్వం నెట్టుకొస్తున్న ఈ తరుణంలో రెగ్యులర్ రిజిస్ట్రార్ నియామకం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరోవైపు పోస్టు ఖాళీ అయిన వెంటనే రిజిస్ట్రార్ పోస్టును భర్తీ చేయాలని విద్యారంగనిపుణులు, విద్యార్థి సంఘాలు నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నలుగురు శాతవాహన యూనివర్సిటీకి కోమల్‌రెడ్డితోపాటు ఇప్పటివరకు నలుగరు బాధ్యతలు చేపట్టారు. వర్సిటీ ప్రారంభమయ్యాక మొద టి రిజిస్ట్రార్‌గా ఏ.వినాయక్‌రెడ్డి (28 ఆగస్టు 2008 నుంచి 27 ఆగస్టు 2009 వరకు), ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ (31 ఆగస్టు 2009 నుంచి 27మే 2012), ప్రొఫెసర్ బి.భద్రయ్య (28 మే 2012 నుంచి 27 మే 2014) తర్వాత 28 మే 2014 నుంచి ఎం.కోమల్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెలాఖరున విరమణ పొందనుండడంతో పోస్టు ఖాళీ కానుంది. యూనివర్సిటీలో కీలకమైనస్థానం ఖాళీ అవుతుండడంతో తర్వాత ఎవరు వస్తారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. యూనివర్సిటీలో నుండే వస్తారా..? వర్సిటీలో ఇద్దరు ప్రొఫెసర్లున్నారు. వీరిలో ఒకరు కోమల్‌రెడ్డి, ఇంకొకరు గతంలో ఎగ్జామినేషన్ కంట్రోలర్‌గా పనిచేసిన టి.భరత్. అనుభవం ప్రకారం చూస్తే వర్సిటీలో మొదటి అవకాశం ఇతనికే ఉంటుందన్న చర్చ వర్సిటీవర్గాల్లో జరుగుతోంది. వివిధ యూనివర్సిటీ ల రిజిస్ట్రార్ల నియామకాలు పరిశీలిస్తే ఎవరినైనా పోస్టు వరించవచ్చని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. తుదకు రిజిస్ట్రార్ ఎవరనేది నిర్ణయించేది వీసీ చేతులో ఉంటుంది. ఇద్దరూ ఒకేసారి వచ్చే అవకాశం ప్రస్తుతం యూనివర్సిటీకి ఇన్చార్జి వీసీగా టి.చిరంజీవులు కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమించాలనే ఆలోచనతో ఉంది. దీనికోసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ముగిసింది. ఎంపిక చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశం ఈనెల 10న ఉండగా.. అనుకోకుండా వాయిదాపడింది. త్వరలోనే వీసీ నియామకం కూడా చేపట్టే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఉన్నతాధికారవర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రార్‌ను నియమించాలంటే వీసీ నిర్ణయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వీసీతోపాటు రిజిస్ట్రార్‌ను కొత్తవారినే నియమించే అవకాశాలూ ఉన్నట్లు విద్యారంగ నిపుణుల్లో చర్చ సాగుతోంది. మొదట వీసీని నియమించి.. ఆ తర్వాత రిజిస్ట్రార్‌ను నియమిస్తారా..? ప్రస్తుతం ఖాళీ అవనున్న రిజిస్ట్రార్ కుర్చీ భర్తీ చేసి ఆ తర్వాత వీసీని నియమిస్తారా..? అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందోనని విద్యారంగ నిపుణులు ఎదురుచూస్తున్నారు. -
అంబేడ్కర్ వర్సిటీకి కొత్త రిజిస్ట్రార్
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం కొత్త రిజిస్ట్రార్‌గా ఏయూ ఇంజినీరింగ్ కెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం జరిగిన బీఆర్‌ఏయూ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ప్రొఫెసర్ తులసీరావు పదవీకాల ఏప్రిల్ ఒకటితో ముగియనుంది. ఈయన రెండేళ్లుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. టెర్మ్ పెంచుకునే అవకాశమున్నా... వైస్ చాన్సలర్ సిఫారసుతో పాటు పాలక మండలి, ఉన్నత విద్యా మండలి అనుమతితో ఏటా పదవీ కాలన్నీ పెంచుకునే సౌలభ్యం ఉంది. 1991 విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం ఏటా రెన్యువల్ చేస్తూ ఆరేళ్ల వరకు కొనసాగించవచ్చు. ఇదే వర్సిటీలో ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్ ఆరేళ్లు దాటి పనిచేశారు. టెర్మ్‌లు పెంచడం, అన్టిల్ ఫర్దర్ ఆర్డర్ (తాత్కాలిక ఉత్తర్వులు)తో సుదీర్ఘంగా విశ్వవిద్యాలయంలో పనిచేశారు. 2009 సెప్టెంబర్ 16 నుంచి 2016 మార్చి 31 వరకు ఆయన కొనసాగారు. 2016 మార్చి 31న తులసీరావు నియమించగా ఏప్రిల్1న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు వర్సిటీలో ముగ్గురు రెగ్యులర్ రిజిస్ట్రార్లు పనిచేశారు. నాలుగో రిజిస్ట్రార్‌గా ఏయూ సీనియర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్(హెచ్ఓడీ) కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. వర్సిటీలో మొదటి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ జి.జ్ఞానమణి 2008 ఆగస్టు 25 నుంచి 2009 ఆగస్టు 25 వరకు కొనసాగారు. వీసీ ఎస్వీ సుధాకర్‌తో పొసగకపోవటంతో ఏడాదికే పరిమితం చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అనంతరం 2009 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలం ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫె సర్ బిడ్డిక అడ్డయ్య కొనసాగారు. 2017 డిసెంబర్ 8న బాధ్యతలు స్వీకరించిన వీసీ కూన రామ్‌జీ రిజిస్ట్రార్ మార్పునకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పాలక మండలి సభ్యులు విభేదించడంతో టెర్మ్ కోసం ఎదురు చూశారు. మరోవైపు వీసీ ప్యానల్లో రామ్‌జీ, తులసీరావు పేర్లు చివరి వరకు కొనసాగాయి. తులసీరావు స్థానిక ప్రొఫెసర్. రామ్‌జీ కంటే సీనియర్. మరోవైపు జిల్లా నుంచి రిజిస్ట్రార్‌గా పనిచేసింది ప్రొఫెసర్ తులసీరావు ఒక్కరే కావడం గమనార్హం. మిగిలిన వారంతా ఏయూకు చెందిన వారే. ఏయూ వీసీగా నాగేశ్వరరావు కొనసాగి న సమయంలో రిజిస్ట్రార్‌గా తులసీరావు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత వీసీ తనకు అనుకూలమైన పాలనా సౌలభ్యం కోసం పలు మార్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తనకు అనుకూలమైన వ్యక్తిని రిజిస్ట్రార్‌గా తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 1న బాధ్యతల స్వీకరణ.. ఏప్రిల్ 1 నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నాలుగో రెగ్యులర్ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కె.రఘుబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన వీసీ రామ్‌జీకి సన్నిహితుడు. మరోవైపు స్థానిక ప్రొఫెసర్లు సైతం రిజిస్ట్రార్ పదవిని ఆశించినా వీసీ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఇద్దరూ ఏయూ వారే... అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.రాంజే ఏయూ మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యులు కాగా, రఘుబాబు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఆచార్యులు. వీరిద్దరికీ శ్రీకాకుళంతో అనుబంధం కలిగి ఉండటం విశేషం. వర్సిటీలో పలు కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు. రఘుబాబు గతంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా ఏడాదికాలం పనిచేశారు. తాజాగా అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. రెండు విశ్వవిద్యాలయాలకు రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఘనత రఘుబాబుకు దక్కుతుంది. ఈయన ప్రస్తుతం ఏయూ గెస్ట్‌హౌస్‌ల డీన్‌గా వ్యవహరిస్తున్నారు. రూ. 91 కోట్లతో బడ్జెట్ ఆమోదం... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో రూ.91 కోట్లతో బడ్జెట్ ఆమోదించారు. ప్రధానంగా వర్సిటీ బడ్జెట్, రిజస్ట్రార్ మార్పుపైనే సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదిత్యానాథ్, ఉన్నత విద్యా మండలి అధికారులు, వర్శిటీ అధికారులు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, రెక్టార్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, బరాటం లక్ష్మణరావు, పొన్నాల జయరాం, కె.బాబూరావు, కె.వి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి నిర్ణయాలివే.. ♦ వర్సిటీకి రూ. 91.70 కోట్లు నిధులు కేటాయించాలని తీర్మానం. ♦ రూ.60 కోట్లు పనులను కేంద్ర ప్రజా పనుల ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించాలని నిర్ణయం. ♦ రిజిస్ట్రార్‌గా ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ కొరుపోలు రఘుబాబు నియామకం. ♦ ప్రస్తుత రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావును ఆర్ట్సు కళాశాల ప్రిన్సిపాల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ల బాధ్యతలు అప్పగింత. ♦ అకడిమిక్ అఫైర్స్ డీన్‌గా ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య నియామకం. ♦ డాక్టర్ యు.కావ్యజ్యోత్స్నకు మహిళా వసతి గృహం చీఫ్ వార్డెన్, రీ వేల్యుయేషన్ డీన్‌గా బాధ్యతలు అప్పగింత. ♦ డాక్టర్ కె.స్వప్నవాహినికి బయోటెక్నాలజీ హెచ్ఓడీగా, పేపర్ సెట్టింగ్స్ డీన్‌గా, పీజీ ప్రవేశాల సెట్ సహాయ కన్వీనర్లగా నియామకం. ♦ కామర్స్ విభాగం బలోపేతానికి రూ.13 లక్షల కేటాయింపు. ♦ నిపుణులు, ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకోవాలని తీర్మానం. -
వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సుధీర్‌కుమార్
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు బోధన, బోధనేతర సిబ్బంది ఆయన్ను అభినందించారు. అనంతరం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఎంపీసీ స్ట్రీమ్ బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల రైతు కోటా కౌన్సెలింగ్‌లో ఆయన పాల్గొన్నారు. త్వరలో అగ్రి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు:వీసీ వర్సిటీలో టీహబ్ తరహాలో టి-అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ప్రవీణ్‌రావు తెలిపారు. దీనివల్ల వ్యవసాయ విద్యార్థులకు వ్యాపార రంగంలో మెళకువలు అందుతాయని అన్నారు. అనంతరం వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రవీణ్‌రావును పలువురు విద్యార్థులు శుక్రవారం సన్మానించారు. -
కొత్త రిజిస్ట్రార్‌కు పెనుసవాళ్లు
రెండేళ్లుగా అస్తవ్యస్త పాలన అనుభవం లేని కొత్త రిజిస్ట్రార్ వర్సిటీకి నిధుల వరద పారనుందా? యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీనూతన రిజి స్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్త దేవరాజులునాయుడు ఎదుట అనేక సవాళ్లు ఉన్నారుు. బాధ్యతలు స్వీకరించిన నూతన రిజిస్ట్రార్‌పై యూనివర్సిటీలోని అన్ని వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. అస్తవ్యస్త పాలన ఎస్వీయూలో ఇప్పటివరకు పనిచేసిన అధికారుల హయాంలో పాలన అస్తవ్యస్తంగా తయారైంది. సంవత్సరకాలంగా వర్సిటీలో లెక్కలేనన్ని ఆందోళనలు, ఉద్యమాలు జరిగాయి. గత విద్యా సంవత్సరమంతా బంద్‌లతోనే సరి పోయింది. ఒక వైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతుంటే, మరోవైపు అంతకు మించిన ఉద్యమాలు క్యాంపస్‌లో నడిచాయి. 2013-14 విద్యా సంవత్సర ఆరంభంలోనే మహిళా హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలన్న అంశంపై మొదలైన ఆందోళనలు ఏడాది పొడవునా కొనసాగాయి. విభాగాల విలీనంతో ఈ ఆందోళనలు ఎక్కువయ్యాయి. అనంతరం అధ్యాపక పోస్టుల భర్తీ అంశంలో చోటు చేసుకున్న వివాదాలు, అధికారులపై వచ్చిన ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చంద్రబాబునాయుడే గవర్నర్‌కు లేఖ రాశారు. అనుభవ లేమి ఎస్వీయూ నూతన రిజిస్ట్రార్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దేవరాజులుకు ఎలాంటి పరిపాలన అనుభవమూ లేదు. కనీసం విభాగాధిపతిగా కూడా పనిచేయలేదు. ఈయనకు క్యాంపస్‌లో పెద్దగా ప్రజాసంబంధాలు లేవు. విద్యార్థులతో, సంఘాలను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎదుర్కొన్న సందర్భాలు లేవు. కేవలం సామాజిక బలం, ప్రభుత్వ ఆశీస్సులు ఉన్నాయి. నిధుల వరద పారిస్తారా? ఎస్వీయూ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. వర్సిటీని నడపాలంటే ఏడాదికి సుమారు 300 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం రూ.100 కోట్లు మాత్రమే గత ఏడాది ఇచ్చింది. ఈ ఏడాదికి రూ.265 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఈ ఆర్థిక లోటును వర్సిటీయే సొంతంగా సమకూర్చుకోవాల్సిందే. కొత్త రిజిస్ట్రార్ ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు తెస్తారో వేచి చూడాలి. వేతనాలు పెరిగేనా? ఎస్వీ యూనివర్సిటీలో ఎన్ఎంఆర్ ఉద్యోగులు, ఫుడ్‌బేసిక్ వర్కర్లు, అకడమిక్ కన్సల్టెంట్లు, అరకొర వేతనాలతో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో కొత్త అధికారులు రావడంతో తమ వేతనాలు పెరుగుతాయని, తమకు మంచి జరుగుతుందని ఆశతో ఉన్నారు. రిజిస్ట్రార్ వారి ఆశలను ఏ మేరకు తీర్చగలరో వేచిచూడాలి. కోర్టు కేసులు ఎస్వీయూకు సంబంధించి అనేక కోర్టు కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికోసం తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రార్ ఒక వైపు పాలన, మరో వైపు కోర్టు వ్యవహారాలు చక్క పెట్టాల్సి ఉంది. ఈ సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.