వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సుధీర్‌కుమార్ | Agricultural University new Registrar sudhirkumar | Sakshi
Sakshi News home page

వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌గా సుధీర్‌కుమార్

Published Sat, Aug 6 2016 2:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Agricultural University new Registrar sudhirkumar

 హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు బోధన, బోధనేతర సిబ్బంది ఆయన్ను అభినందించారు. అనంతరం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఎంపీసీ స్ట్రీమ్ బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల రైతు కోటా కౌన్సెలింగ్‌లో ఆయన పాల్గొన్నారు.

త్వరలో అగ్రి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు:వీసీ
వర్సిటీలో టీహబ్ తరహాలో టి-అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ప్రవీణ్‌రావు తెలిపారు. దీనివల్ల వ్యవసాయ విద్యార్థులకు వ్యాపార రంగంలో మెళకువలు అందుతాయని అన్నారు. అనంతరం వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రవీణ్‌రావును పలువురు విద్యార్థులు శుక్రవారం సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement