new things
-
ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా?
ప్రతీరోజు ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటున్నాం. వింత ప్రదేశాలు, వింత చేష్టలు, ఆశ్యర్యపరిచే నిజాలు, అద్భుతాలు.. ఇలా ఎన్నోవాటి గురించి ఎంతోకొంత అవగాహనకు వస్తూనే ఉన్నాయి. మరి ఈ కొత్త పదాలు, వింత వింతల గురించి ఎప్పుడైనా విన్నారా! లేదా? మరేంటో తెలుసుకుందామా..!! అవే ఇవి.. పే త్రూ ది నోస్.. సాధారణంగా చెల్లించేదాని కంటే ఎక్కువగా చెల్లించే సమయంలో వాడే మాట...పే త్రూ ది నోస్. ఉదా: వీ హ్యాడ్ టూ పే త్రూ ది నోస్ ఫర్ అవర్ రూమ్ బికాజ్ ఇట్ వాజ్ ఏ లాంగ్ వీకెండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ వర్ బుక్డ్. గోయింగ్ గ్రేట్ గన్స్.. ఒక రంగంలో, పనిలో విజయ వంతంగా దూసుకువెళ్లే సందర్భంలో వాడే మాట... గోయింగ్ గ్రేట్ గన్స్. ఉదా: ది ఫర్మ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ గోయింగ్ గ్రేట్ గన్స్ విత్ హిజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. అవును.. ఇది నిజమే! ఆడ నెమలిని పీహెన్ అని పిలుస్తారు. అగ్గిపుల్లల కంటే ముందుగానే లైటర్‌ను తయారుచేశారు. కరెంట్ మూడ్ ఆధారంగా పాటలను ప్లే చేసే హెడ్ఫోన్లను న్యూరబుల్ కంపెనీ తయారు చేసింది. ఇవి చదవండి: అతిపెద్ద పాము ఉనికి వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
మెటాకు భారత మార్కెట్ కీలకం
కోల్‌కతా: భారత మార్కెట్ మెటా ప్లాట్‌ఫామ్స్‌కు కీలకమైనదిగా ఉంటోందని కంపెనీ తెలిపింది. గ్రూప్‌లో భాగమైన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీచర్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు వేదికగా మారిందని పేర్కొంది. అలాగే లక్షల కొద్దీ క్రియేటర్లు, అసంఖ్యాక బ్రాండ్లు తమ సృజనాత్మకను ప్రదర్శించడానికి, ఆడియెన్స్‌కు మరింత చేరువ కావడానికి మెటా ద్వారా మంచి అవకాశాలు లభిస్తున్నాయని ఫేస్బుక్ ఇండియా (మెటా) డైరెక్టర్ మనీష్ చోప్రా తెలిపారు. ‘వివిధ కోణాల్లో మా ప్లాట్‌ఫామ్‌లకు భారత్ చాలా కీలక మార్కెట్. పలు కొత్త ఉత్పత్తులు, ఫీచర్లను పరీక్షించి తెలుసుకునేందుకు ప్రధాన మార్కెట్‌గా ఉంటోంది‘ అని మెటా వార్షిక ’క్రియేటర్ డే’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రెండేళ్ల క్రితం ఆవిష్కరించిన ’రీల్స్’ (పొట్టి ఫార్మాట్ వీడియోలు) భారత్‌లో గణనీయంగా ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ఒక అధ్యయన నివేదిక ప్రకారం దాదాపు 20 కోట్ల మంది ప్రజలు రోజుకు 45 నిమిషాల పాటు రీల్స్‌పై వెచ్చిస్తున్నారని, ఇది 60 కోట్లకు చేరుకోగలదని చోప్రా తెలిపారు. టీ20 వరల్డ్ కప్ క్రికెట్ హైలైట్స్‌ను చూపేందుకు ఇటీవలే ఐసీసీతో కూడా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మెటా ప్లాట్‌ఫ్లామ్స్ ద్వారా నకిలీ ప్రొఫైల్స్, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు తీసుకుంటూనే ఉన్నామని ఆయన వివరించారు. -
తొలి అడుగే ధీమాగా
‘‘ఇంతియని చింతించవలదు... ఘనములెన్నియో చేసి చూపింతుము’’ అన్న ఓ కవి వాక్కులను వారు నిజం చేశారు. పాలనలో తొలి అడుగే అయినా ధీమాగా వేశారు. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే, అటు ఆఫీసు పనులను చక్కబెట్టారు. తమ మీద నమ్మకముంచి అందలమెక్కించిన జనం సమస్యల పరిష్కారంలోనూ ముందుంటున్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి దాదాపు ఆరు నెలలు అవుతోంది. తొలిసారిగా ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను అధిరోహించిన పలువురు మహిళా నేతలు ఈ ఆరు నెలల అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వేలమైళ్ల ప్రయాణమైనా తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఆ మొదటి అడుగు కాస్త తడబడినా.. ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకోగలిగితే ఇక ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు వచ్చినా ఎదురుండదు. అందులోనూ ఆడవాళ్లు ఒక్కసారి తమ మనసును లగ్నం చేస్తే ఏపనినైనా విజయవంతం చేసేదాకా వదలరు. ఆరునెలల కిందటి దాకా వంటింటికే పరిమితమై.. ఇంటి బాధ్యతలను పంచుకున్నారు వీరంతా. కనీసం పక్క ఊరు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇక మండలాఫీసు, జిల్లా పరిషత్తు అంటే.. అవేంటి, ఎక్కడుంటాయి అనేవారు. కానీ ఇప్పుడు.. ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా గెలుపొందారు. తమ మండలంలో ఏ ఊరిలో ఏ సమస్య ఉంది.. దాని పరిష్కారానికి ఏం చేయాలి.. ఏ అధికారి ఏం పనిచేస్తాడు.. ఇలా అన్ని విషయాలపై పట్టు సాధించారు. ఆడవాళ్లు తలచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నారు. తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎంపీపీలు, జడ్పీటీసీలుగా దాదాపు ఆరునెలల పదవీకాలం పూర్తిచేసుకున్న పలువురు మహిళా ప్రజాప్రతినిధుల ‘వాయిస్’ ఇది... ప్రజాసమస్యలపై అవగాహన నాగిరెడ్డిపేట : ఎంపీపీ పదవి చేపట్టి ఆరునెలలవుతోంది. ఇప్పటిదాకా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహనవచ్చింది. ప్రజాప్రతినిధుల, అధికారుల విధులు, బాధ్యతలు తెలుసుకున్నాను. అంతకుముందు ఇంటికే పరిమితమైన నాకు కొత్తలో కొంత కష్టమైంది. రిజర్వేషన్ కారణంగా ఎంపీపీనైన నాకు ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి సహకరిస్తున్నారు. మండలంలో పలు సమస్యల పరిష్కారానిక ప్రతిపాదనలు చేశాం. నిధుల వస్తే అభివృద్ధి పనులను చేపడతాను. -ఊశమ్మ, ఎంపీపీ, నాగిరెడ్డిపేట కొత్త విషయాలు తెలుసుకోవడం.. సదాశివనగర్ : మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త విషయాలను నేర్చుకున్నా. రాజకీయ అనుభవం కూడా వచ్చింది. ప్రజలు, అధికారులతో పరిచయాలు పెరిగాయి. ప్రతీ కార్యక్రమానికి తనను ఆహ్వానిస్తున్నారు. ప్రజాసమస్యలపై అవగాహన ఏర్పడింది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది ప్రధాన ఉద్దేశం. - బంజ విజయ, ఎంపీపీ, సదాశివనగర్ -
పాఠశాలలు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాలి
తిరుపతి: ‘విద్యార్థులలో సృజనాత్మకత, కొత్త విషయాలపై జి జ్ఞాస పెరగాలి. వారిలో దేశ భక్తిని, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించాలి. ఇది ప్రాథమిక విద్య స్థాయి నుంచి అమలు జరగాలి. ఆ సదుద్దేశంతోనే సంకల్పం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం’ అని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. ఆదివారం సా యంత్రం మహతి ఆడిటోరియంలో జిల్లా సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన సంకల్పం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కా ర మహోత్సవంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ పాఠశాల కాంప్లెక్స్‌లు సమగ్ర విజ్ఞాన నిలయాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఫలితాలు ప్రధానం కాద ని ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేసి విద్యార్థులతో స్నేహం గా మెలగి వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దితే ఫలితాలు వాటంతట అవే వస్తాయన్నారు. ఉపాధ్యాయుల మధ్య నాలె డ్జ్ షేరింగ్ ఉండాలన్నారు. పాఠశాలలో ఇలాంటి సమగ్రత ఏర్పడినపుడు విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతుందన్నారు. అనంతరం వివిధ మండలాలకు చెంది పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయులకు ఆయన ఉత్తమ ఉపాధ్యాయ ప్రశంసా పత్రాలను అందచేశారు. స్ఫూర్తి నింపింది సంకల్పం కార్యక్రమం తమలో స్ఫూర్తి నింపిందని పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ప్రసంగించిన పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసే సంప్రదాయానికి తోడుగా ఉపాధ్యాయుల పనితీరును అధ్యయనం చేసి ప్రశంసాపత్రాలు అందచేసే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ సిద్ధార్థ జైన్‌ను వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అభిలషించారు. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్షా అభియాన్ పథకాల ప్రగతిని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మి, డీవైఈవోలు శామ్యూల్, శేఖర్ పాల్గొన్నారు. జవహర్ బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆందరినీ ఆకట్టుకున్నాయి. కుర్చీలు చాలక ఇబ్బందులు సంకల్పం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం కార్యక్రమానికి హాజరైన పలువురు కుర్చీలు లేక ఇబ్బంది పడ్డారు. ఉ త్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు ఎంపికైన 1500 మందికి జిల్లా విద్యాశాఖ ఆహ్వానం పంపింది. అయితే కోరకనే వచ్చిన అవార్డును అందుకోవడానికి ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా తరలిరావడంతో మహతిలో కుర్చీలు చాలక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది కార్యక్రమం పూర్తయే వరకు నిల్చొనే ఉండాల్సి వచ్చింది. -
జ్ఞాపకాన్ని పెంచే గేమ్స్
సర్వే అరవైఏళ్లు దాటాయంటే చాలు...అల్జీమర్స్వ్యాధి బారినపడే అవకాశాలు అందరిలో కాకపోయినా కొందరిలో తప్పడంలేదు. మరుపు వచ్చాక ఒంటరిగా ఉంటే గనక ఆ మరుపే మిమ్మల్ని చంపేస్తుందంటున్నారు జెరూసలేమ్కి చెందిన అల్జీమర్స్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్వారు. వీలైనంతవరకూ కొత్తవారితో స్నేహాలు చేస్తూ... కొత్త విషయాలు తెలుసుకుంటూ నలుగురితో గడుపుతుంటే ఆ జబ్బు ప్రభావం తగ్గుతుందంటున్నారు. దీంతోపాటు వారు కొత్తగా కనుగొన్న కంప్యూటర్ గేమ్స్ అల్జీమర్స్ బాధితులకు కొంత ఉపశమనం ఇవ్వడంలో విజయం సాధించిందని కూడా చెబుతున్నారు. వారు స్థాపించిన అల్జీమర్స్ డే కేర్ సెంటర్లో చేరిన వృద్ధులపై చేసిన ప్రయోగంలో ఈ విషయం వెల్లడదయిందని చెప్పారు. మరుపునకు మెల్లగా దూరమవుతూ మామూలు పరిస్థితికి వచ్చిన వృద్ధులు చాలామంది ఉన్నారక్కడ. ఇంతకీ ఆ సెంటర్లో చేస్తున్న వైద్య రహస్యమేమిటంటే... ఆ సెంటర్లో చేరిన వృద్ధులు రోజు పొద్దుటే చక్కగా ముస్తాబై ఒక పెన్ను, పుస్తకం తీసుకుని వెళతారు. వెళ్లగానే తోటివారితో కాసేపు సరదాగా గడిపి, కొత్తగా చేరినవారిని పరిచయం చేసుకుని తర్వాత ఎవరి కంప్యూటర్ ముందు వారు కూర్చుంటారు. ప్రత్యేకంగా అల్జీమర్స్ బాధితుల కోసం తయారుచేసిన గేమ్ అప్పటికే స్క్రీన్‌పై రెడీ ఉంటుంది. దాన్ని ఆడుతూ కాలక్షేపం చేయాలి అంతే! మధ్యాహ్నం భోజనం తర్వాత మరికొద్దిసేపు కంప్యూటర్లో గేమ్స్ ఆడతారు. మెదడుకి పనిచెప్పే ఈ గేమ్స్ మరుపుని దూరం చేయడంలో బాగా ఉపయోగపడతాయంటున్నారు అక్కడి వైద్యులు.