రామగుండం ఎన్టీపీసీలో కొత్త యూనిట్లు
23, 27న శంకుస్థాపన
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన 8, 9 యూనిట్ల పనులకు ఈ నెల 23, 27 తేదీల్లో శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీపీసీ పరిధిలోని పాత పీ.కే.రామయ్య కాలనీలో యూనిట్లకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేశారు.
శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరువుతారని అనుకున్నప్పటికీ ఆయన రాకపై అనుమానాలు ఉన్నాయి. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఎన్టీపీసీ సీఅండ్ఎండీ అరూప్‌రాయ్‌చౌదరిలు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్టీపీసీ టౌన్‌షిప్‌ను తీర్చిదిద్దుతున్నారు.