వారెవ్వా ! అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త స్కార్పియో ఎన్
మహీంద్రా ఆటోమొబైల్స్ గ్రూపు దశాదిశను మార్చేసిన స్కార్పియో ఇప్పుడు కొత్త రూపులో మన ముందుకు వచ్చేసింది. ఇండియాలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ యూసేజ్‌కి కొత్త అర్థం చెప్పిన స్కార్పియో ఇప్పుటి ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్డేట్ అయ్యింది. స్కార్పియో ఎన్ సిరీస్‌కి సంబంధించిన విశేషాలను మహీంద్రా గ్రూపు ప్రకటించింది.
సరికొత్త స్కార్పియో ఎన్ సిరీస్ మొత్తం ఐదు వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లను జెడ్ 2, జెడ్ 4, జెడ్ 6, జెడ్ 8, జెడ్ 8 లగ్జరీలుగా మహీంద్రా పేర్కొంది. కొత్త స్కార్పియో మోడల్ మార్కెట్లోకి వస్తుండటంతో ఇప్పటి వరకు ఉన్న మోడల్‌ను ఇకపై స్కార్పియో క్లాసిక్‌గా వ్యవహరించనున్నారు.
ఫస్ట్ ఇన్ ఇండియా
ఇండియన్ ఎస్యూవీ మార్కెట్ సెగ్మెంట్లో ఉన్న మహీంద్రా థార్, టాటా సఫారీ, ఎంజీ హెక్టార్లకు పోటీగా మహీంద్రా ఎన్ సిరీస్ స్కార్పియోను మార్కెట్లోకి తెస్తోంది. బాడీ ఆన్ ఫ్రేమ్‌లో విభాగంలో దేశంలో ఇదే మొదటి వాహనంగా భావిస్తున్నారు.
కీలక ఫీచర్లు
- 4,662 మిల్లీ మీటర్ల పొడవు , 1917 మిల్లీ మీటర్ల వెడల్పు , 1870 మిల్లీ మీటర్ల ఎత్తు
- మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్
- 4 క్రాస్ 4 వీల్ డ్రైవ్
- 8 స్క్రీన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోంటైన్మెంట్, 3డీ సౌండ్ సిస్టమ్
- బిల్ట్ ఇన్ అలెక్సా, వైర్లెస్ ఛార్జర్
- ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్
- 6 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ అలెర్ట్ సిస్టమ్
ధర ఎంతంటే
స్కార్పియో ఎన్ సిరీస్ కనీస ధర రూ.11.99 లక్షలు ఉండగా గరిష్ట ధర రూ.19.49 లక్షలుగా ఉంది. ఈ కారు అడ్వాన్స్ బుకింగ్ జులై 30 నుంచి మొదలు కానుంది.
A legend will be reborn tomorrow… (1/2) pic.twitter.com/H8OU9FUoAU
— anand mahindra (@anandmahindra) June 26, 2022
చదవండి: మారుతి ఆల్టో: స్పార్క్ లుక్, రెట్రో డిజైన్, ధర ఎంతంటే?