పోలీసులకు కొత్త వాహనాలు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు జిల్లా పోలీసుశాఖకు ప్రభుత్వం పలు కొత్త వాహనాలను కేటాయించింది. గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాహనాలకు పూజలు చేసి అధికారులకు కేటాయిస్తూ ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వాహనాల్లో ఫోర్డ్ ఎకో-3, స్కార్పియో-1, మినీ బస్సు-1, జీపు-1, బొలేరో-1, మోటారు సైకిళ్లు 10 ఉన్నాయి. ఈ పూజా కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు. అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న రెండు స్నిపర్, ఒక ట్రాకర్ కుక్కలను సైతం ఎస్పీ పరిశీలించారు.