newly
-
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
సగం కాలిన శవంతో రోడ్డుపై ఆందోళన
బీహార్‌లోని మోతిహరిలో ఒక నవవివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే అత్తింటివారు తమ అమ్మాయిని హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను హ్యత చేసి, మృతదేహానికి రహస్యంగా దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా, తమకు గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో, తాము పెంటనే ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. గ్రామానికి వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు చితిపై మండుతున్న మృతదేహాన్ని బయటకు తీసి రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ కుమార్తె చేతులు, కాళ్లు కట్టేసి, ఆమె గొంతునొక్కి చంపేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థాలానికి చేరుకుని, మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు. పోలీసులు మృతురాలిని సుగౌలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీపుర్ గోపాల్‌పుర్ నివాసి పారస్ వర్మ కుమార్తె ఫూల్‌పరి దేవి(20)గా గుర్తించారు. మృతురాలి తండ్రి గతంలోనే మరణించాడు. దీంతో తల్లి కూలీనాలీ చేస్తూ కుమార్తెను చదివించింది. మృతురాలి తల్లి రామ్‌వతి మాట్లాడుతూ తన కుమార్తెకు టోలా గ్రామానికి చెందిన సుభుశ్ శర్మ కుమారుడు నితేష్ కుమార్‌తో ఈ ఏడాది మార్చ 8న వివాహం చేశానని తెలిపారు. పెళ్లయిన తరువాత నుంచి అత్తింటివారు తమ కుమార్తెను వరకట్న వేధింపులకు గురిచేశారన్నారు. ఐదు లక్షల రూపాయలతో పాటు ఒక బైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె తెలిపింది. పెళ్లయిన నాటి నుంచి తమ కుమార్తెను వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో తొలి సామూహిక గణేశ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతకుముందు ఏం జరిగింది? -
సరికొత్త కలెక్షన్‌తో మీ పెదాలకు మరింత అందం
-
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ!
‘గ్రేటర్’లో ఉన్నా రూరల్ జిల్లాలోనే గీసుకొండ! మూడు డివిజన్లు, 17 పంచాయతీలూ రూరల్ జిల్లాలోకి.. అభ్యంతరం చెబుతున్న స్థానికులు గీసుకొండ : కొత్తగా ఏర్పాటు కానున్న వరంగల్ రూరల్ జిల్లాలోకి గీసుకొండ మండలం రాబోతోంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉండగా.. ఈ ప్రాంతం నగరాన్ని ఆనుకుని ఉండి, కొంత మేర గ్రేటర్ వరంగల్‌లో భాగమైనా జిల్లాల పునర్విభజనలో భాగంగా మొత్తం మండలాన్ని వరంగల్ రూరల్ జిల్లాలో చేర్చనున్నారు. ఈమేరకు కలెక్టర్ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి పంపించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పొందుపరినట్లు తెలుస్తోంది. గతంలో 25 గ్రామపంచాయతీలతో గీసుకొండ మండలం ఉండగా.. ఎనిమిది గ్రామపంచాయతీలను గ్రేటర్ వరంగల్ 2013 ఆగస్టు 1న విలీనం చేశారు. దీంతో మండలంలోని రెడ్డిపాలెం, మొగిలిచర్ల, పోతరాజుపల్లి, గొర్రెకుంట, కీర్తీనగర్, ధర్మారం, జాన్‌పాక, గరీబ్‌నగర్, స్తంభంపెల్లి, వసంతాపూర్, దూపకుంట ప్రాంతాలు నగరంలోకి చేరగా వీటిని 2, 3, 4వ డివిజన్లుగా ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన 17 గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు మండలానికి ఎంపీపీ, జెడ్పీటీసీ ఉన్నారు. తాజాగా జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో నగరంలో విలీనమైన ప్రాంతం వరంగల్ జిల్లాలో, మిగతాది రూరల్ జిల్లాలో కొనసాగుతుందని అంతా భావించారు. కానీ మండలం మొత్తం వరంగల్ రూరల్ జిల్లా కిందికి వెళ్లనున్నట్లు ప్రతిపాదనల్లో పొందుపర్చడంతో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. వరంగల్ జిల్లాలోనే మండలాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. కాగా, సంగెం మండలం నుంచి గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన బొల్లికుంట, గాడెపల్లి గ్రామాలు ప్రస్తుతం 4వ డివిజన్లో ఉన్నాయి. ఈ రెండు గ్రామాలతో పాటు సంగెం మండలం మొత్తం కూడా వరంగల్ రూరల్ జిల్లాలోకి వెళ్లనుంది. -
పెళ్లైన వారానికే మృతి
-
ఎన్నికై ఏం లాభం?
యాచారం, న్యూస్‌లైన్: బాధ్యతలు చేపట్టిన సంతోషం సర్పంచ్‌లకు మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని ఉత్సాహంగా అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమైతే... పంచాయతీ కార్యదర్శులు సహకరించడం లేదని వాపోతున్నారు. ఎన్నికై నెలరోజులు దాటినా పంచాయతీ రికార్డులు అందకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సర్పంచ్‌లతో పాటు కార్యదర్శులకూ జాయింట్ చెక్‌పవర్ కల్పించింది. దీంతో కార్యదర్శులు తమను చిన్నచూపు చూస్తున్నారని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డులు ఇవ్వడంలో కార్యదర్శులు జాప్యం చేస్తున్నారని, మరీ పట్టుబడితే అవసరమైన సమాచారం ఇస్తామని చెబుతున్నారని సర్పంచ్‌లు అంటున్నారు. పంచాయతీల వ్యయం, ఆదాయం, మిగులు నిధుల గురించి తెలియక.. ఏ పనీ చేపట్టలేక ఉత్సవ విగ్రహాల్లా మారాల్సి వస్తోందని వాపోతున్నారు. యాచారం మండలంలోని 20 గ్రామాల సర్పంచ్‌లు ఆగస్టు 2న బాధ్యతలు చేపట్టారు. వీరికి బాధ్యతలు, అధికారాలు, హక్కుల గురించి తెలియజేసిన అధికారులు... రికార్డులు అందజేయించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించారు. నిధులు ఎన్ని ఉన్నాయో తెలియక, ఉన్నా జాయింట్ చెక్‌పవర్‌తో వాటిని డ్రా చేసుకునే సొంత అధికారం లేక సర్పంచ్‌లు గింజుకుంటున్నారు. గ్రామాల్లో జోరుగా జరుగుతున్న బోనాల ఉత్సవాల కోసం పలువురు సర్పంచ్‌లు సొంత డబ్బులు వెచ్చించి వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. అలాగే పంచాయతీ కార్మికులకు జీతాలు, తాగునీటి పైపులైన్ల మరమ్మతులకు కూడా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలా మండలంలోని 20 గ్రామాల్లో సర్పంచ్‌లు రూ.20 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తాం.... రికార్డులు అప్పజెప్పడం లేదని సర్పంచ్‌లు ఓవైపు ఆందోళన చెందుతుంటే... పంచాయతీ కార్యదర్శులు మాత్రం పాలనా వ్యవహారాలు చూసేది తామేనని, పైగా జాయింట్ చెక్‌పవర్ కూడా ఉందనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పంచాయతీ వ్యవహారాలకు సంబంధించి ఖర్చుల వివరాలను ఆడిట్ చేయించలేదని, రికార్డులను ఇస్తే తమకు ఇబ్బందులవుతాయని... ఆడిట్ చేయించిన తర్వాతే ఇస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు తిప్పుకుంటున్నారని సర్పంచ్‌లు పేర్కొంటున్నారు. కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు సర్పంచ్‌గా పదవీ బాధ్యతలు తీసుకొని నెలరోజులు దాటినా రికార్డులు ఇవ్వకపోవడమంటే మమ్మల్ని అవమానపర్చడమే. నాకు రికార్డులు కాదు కదా కనీసం కార్యాలయ తాళంచెవి కూడా ఇవ్వలేదు. పంచాయతీలో ఎన్ని నిధులున్నాయో తెలియడం లేదు. సొంత ఖర్చులతో వీధి లైట్లు బిగిస్తున్నా. - రామానుజమ్మ, సర్పంచ్. తమ్మలోనిగూడ రికార్డులు వెంటనే అందజేసేలా చూస్తా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీల రికార్డులు సర్పంచ్‌లకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటా. సర్పంచ్ల ఆదేశాల మేరకే కార్యదర్శులు పనిచేయాల్సి ఉంటుంది. వెంటనే బదిలీపై వెళ్లిన కార్యదర్శులను పిలిపించి మాట్లాడుతా. రికార్డులను సర్పంచ్‌లకు అందజేయాలని ఆదేశిస్తా. - శంకర్‌నాయక్, ఈఓఆర్డీ, యాచారం