newly wedding couple
-
పెళ్లి పీటలపై పంతులుకి షాకిచ్చిన పెళ్లి జంట..
-
కక్కుర్తి కాదు.. కావాలనే ఆ నవవధువు అలా చేసింది!
సోషల్ మీడియా.. అక్కడి నుంచి మీడియాకు ఎక్కే నవ వధువుల సంగతి తెలియంది కాదు. మంచి, చెడు, సంబురం-విషాదం.. విషయం ఏదైనా నవవధువులనే పేరుకు ఉన్న క్రేజే వేరు. జీవితంలో పెళ్లి అనేది మధురమైన క్షణాలని, ఆ క్షణాలని మధుర క్షణాలుగా ఆస్వాదించాలని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. అలాంటిది ఇక్కడ ఒక కొత్త పెళ్లి కూతురు చేసిన పని ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన కియారా, జోయెల్.. ఇద్దరూ ఈ మధ్యే వివాహంతో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి ఖర్చు అక్షరాల 500 డాలర్లు. అందునా కియారా ధరించిన షెయిన్ వెడ్డింగ్ డ్రెస్సుకు అయిన ఖర్చు చేసింది కేవలం 47 డాలర్లు. సాధారణంగా పెళ్లిని తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనే ఉద్దేశం కొందరికి ఉంటుంది. తద్వారా ఖర్చులు మిగుల్చుకోవడంతో పాటు ‘టాక్ ఆఫ్ ది..’ గా నిలవొచ్చనే ఆశ వాళ్లకు ఉండొచ్చు. కానీ, ఈ జంట మాత్రం మరీ ఇంత తక్కువతో వివాహం చేసుకోవడం వెనుక నవ వధువు ప్రమేయమే పూర్తిగా ఉంది. నవ వధువు కక్కుర్తి.. ఈ విమర్శకు కియారా ఏం సమాధానం చెబుతోందో తెలుసా?.. జీవితంలో పెళ్లి ప్రత్యేకమైన క్షణమే కావొచ్చు. అందుకోసం.. భారీగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావడం ఎందుకు?. స్తోమత లేనప్పుడు విపరీతంగా ఖర్చు పెట్టే ఆలోచన కూడా నాకు లేదు. అందుకే కొన్ని గంటల పాటు వేసుకునే డ్రెస్సును కూడా సింపుల్‌గా కొనేసుకున్నా. అలాగే.. మా రిలేషన్షిప్ గురించి ఏమాత్రం తెలియని వాళ్లను పెళ్లికి ఆహ్వానించడం ఎందుకు? వాళ్లకు విందు భోజనాలు పెట్టడం ఎందుకు?.. ఇంట్లో వాళ్లను, దగ్గరి స్నేహితులను మాత్రమే అతిథులుగా భావించాం అని ముక్కుసూటిగా సమాధానం ఇచ్చింది కియారా. ఇదిలా ఉండగా.. ఏంజ్లెస్ క్రెస్ట్ హైవే వెంట.. ఓ కొండ ప్రాంతంలో వీళ్ల వివాహం జరిగింది. కేవలం 30 నుంచి 40 మధ్య కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మాత్రమే వేడుకకు ఆహ్వానించారు. వాళ్లకు తిండి, డ్రింక్స్ అందించారు. ఈ భోజనాలకు, కుర్చీలకు, పెళ్లి మండపానికే మాత్రమే వాస్తవానికి ఈ జంట ఖర్చు పెట్టింది. టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఇప్పుడీ లో కాస్ట్ పెళ్లి మిలియన్ వ్యూస్ దక్కించుకోవడంతో పాటు వెరైటీ వెరైటీ కామెంట్లకు వేదిక అవుతోంది. View this post on Instagram A post shared by Lovin Malta (@lovinmalta) -
పెళ్లిలో హోమాలు ఎందుకు చేస్తారో తెలుసా?
పాణి గ్రహణమైన తర్వాత, వధూవరులిద్దరూ హోమగుండం చుట్టు ప్రదక్షిణలు చెయ్యాలి. అప్పుడు వరుడు వధువు చేత ఏడడుగులు నడిపిస్తాడు. దీనినే సప్తపది అంటారు. ఆ సమయంలో చదివే మంత్రాలు, వరుడి సంకల్పాన్ని దేవతలకు ఏడు వాక్యాలలో తెలియజేస్తాయి. వధువు మొదటి అడుగు వలన అన్నం, రెండవ అడుగు వలన బలం, మూడవ అడుగు వలన కర్మ, నాల్గవ అడుగు వలన సుఖసంతోషాలు, ఐదవ అడుగువలన పశుసంపద, ఆరవ అడుగు వలన ఋతుసంపద, ఏడవ అడుగు వలన సత్సంతానం కలగాలని వరుడు ప్రార్థిస్తాడు. తర్వాత ఆ వధువు చేత ‘నేను తీర్థం, వ్రతం, ఉద్యాపనం, యజ్ఞం, దానం మొదలైన గృహస్థాశ్రమ ధర్మాలలో మీకు అర్ధ శరీరమై మసలుకుంటాను, హవ్య, కవ్య సమర్పణలో దేవ, పితృపూజలలో, కుటుంబ రక్షణ, పశుపాలనలో, మీ వెన్నంటే ఉంటాను’ అని ప్రతిజ్ఞ చేయిస్తారు. ఆ తర్వాత వధువుతో తన సఖ్యతను తెలియజేసి వధువు సఖ్యతను పొందుతాడు. అలా వారిద్దరి మధ్యన ఏర్పడిన బంధం ఏడు జన్మల వరకు నిలవాలని కోరుకోవడమే సప్తపది. తర్వాత షోడశ హోమాలు అంటే పదహారు ప్రధాన హోమాలను చేసి సోముడు, గంధర్వుడు, అగ్ని, ఇంద్రాది సమస్త దేవతలకు హవిస్సులర్పిస్తారు. తరువాత వధువుచేత, తన భర్తకు దీర్ఘాయుష్షు, తనకు అత్తవారింటితో చక్కటి అనుబంధం, అన్యోన్య దాంపత్యం కలగాలని లాజహోమాన్ని చేయిస్తారు. తదుపరి వధువు నడుముకు కట్టిన యోక్త్రమనే తాడును విడిపిస్తారు. తరువాత, వరుడు, వధువును రథంలో ఎక్కించుకుని, తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ వాహనంలో తీసుకెళ్ళేటప్పుడు చెప్పే మంత్రాలు హైందవ సాంప్రదాయాలలో స్త్రీకి ఇచ్చిన ప్రాముఖ్యతను తప్పకుండా అందరూ గ్రహించి తీరాలి. ఆ మంత్రాలకు అర్థం, ‘ఓ వధూ..! నీవు మా ఇంట ప్రవేశించి మా విరోధులను తరిమి వేయి. నీ భర్తనైన నన్ను మాయింట శాసించు. నాపై ఆధిపత్యం వహించు. సంతానంతో నా వంశాన్ని వృద్ధి చేయి. నీ అత్తమామలకు, ఆడపడుచుకు, బావలకు, మరుదులకు సామ్రాజ్ఞివికా. మా కుటుంబానికి, మా సంపదలకు యజమానురాలివికా. అందరితో కలిసి మెలసి నా ఇంటిని ఆహ్లాదకరంగా చేయి’. వరుడు ఈ ప్రమాణాలు చేయడం ద్వారా వధువుకు అత్తవారి ఇంట సర్వాధిపత్యం ఇవ్వబడుతుంది. తదుపరి, వరుని గృహంలో వధూవరులిద్దరు హోమం చేస్తారు. దీనినే ప్రవేశహోమం అంటారు. ప్రవేశ హోమంలో పదమూడు మంత్రాలతో దేవతలకు హవిస్సులర్పిస్తారు.. వానిలో ‘ఓ ఇంద్రాగ్నులారా..! నా భార్యకు నూరు సంవత్సరాలు భోగభాగ్యాలను కలిగించు, ఓ త్వష్ట ప్రజాపతీ..! మాకు సుఖాలను ప్రసాదించు. హే విశ్వకర్మా..! ఈమెను నాకు భార్యగా నీవే పుట్టించితివి. నావలన సంతానం పొంది నూరేళ్ళు జీవించునట్లు అనుగ్రహించు’ ఇత్యాది మంత్రాల ద్వారా వైదిక దేవతలకు హవిస్సులర్పిస్తూ ఆ దంపతులకు ఆయుర్దాయం, పరస్పరానురాగం, సత్సంతానం, భోగ భాగ్యాలు, ధనధాన్యాలను కోరుకుంటారు. తర్వాత జయాది హోమాలు చేయాలి. తదుపరి స్థాలీపాకహోమం చేసి కనీసం ఇద్దరికి భోజనం ఏర్పాటు చేయాలి. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
ఈ వధూవరులను గుర్తించండి!
లండన్: జలకాలాటలలో ఏమి హాయిలే అలా...అంటూ కరీబియన్ సముద్రంలో భుజాల వరకు నీటి మునిగి చెట్టాపట్టాలేసుకొని ముందుకు సాగిపోతున్నారు ఆ వధూవరులు. స్వచ్ఛమైన నీటి అడుగున ‘స్టింగ్రేస్ (పొడవాటి సన్నటి తోకగల చేపలు)’ గుంపులు గుంపులుగా దూసుకొస్తున్నా లెక్కచేయకా, గగన సీమలో పోటీపడి కమ్ముకొస్తున్న మంచు మబ్బులను చూస్తూ తన్మయత్నంలో తేలిపోతున్న వధూవరుల దృశ్యాన్ని జెన్నీ స్టాక్ అనే ఓ మెరైన్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆ జంట అనుమతితోనే ముచ్చటైన వాళ్ల ఫొటోలు పలు తీశానని, వాళ్లకు ఈ ఫొటోలు అందజేయాలని ఆశిస్తున్నానని, అయితే వారు ఎక్కడున్నారో, వారి చిరునామా ఏమిటో తనకు తెలియదంటూ ఆమె ఇప్పుడు ప్రముఖ సామాజిక వెబ్సైట్ ‘ఫేస్బుక్’ను ఆశ్రయించారు. వాళ్లను గుర్తించిన వెబ్సైట్ యూజర్లు దయచేసి వారి కాంటాక్ట్‌ను తనకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు. ‘స్వచ్చమైన కరీబియన్ సముద్రంలో మెరైన్ లైఫ్‌పై ఫొటోలు తీసేందుకు నేను గత మే నెలలో డొమెనికన్ రిపబ్లిక్కు వెళ్లాను. నీటి మునిగి నేను ఫొటోలు తీస్తుండగా, హఠాత్తుగా నా కెమెరా ముందుకు నవ వధూవరులు వచ్చారు. అప్పటికీ పెళ్లి దుస్తుల్లోనే ఉన్న పెళ్లి కూతురును చూసి ముచ్చటేసింది. ముళ్ల చాకు లాంటి తోకలో విషం గల స్టింగ్రేస్ (ఆపద ఎదురైనప్పుడు మాత్రమే ఆ చేపలు మనుషులపై దాడులు చేస్తాయి)ను కూడా లెక్కచేయకుండా వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిపోవడం మరింత ఆశ్చర్యం వేసింది. అందుకే వారి అనుమతితో వారి ఫొటోలు తీశాను. వారికి నన్ను కాంటాక్టు చేయాల్సిందిగా పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాను. అలల హోరులో వారికి నా మాటలు వినపడకపోవచ్చని ఇప్పుడనిపిస్తోంది. ఆ నవ వధూవరులు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఇంతకాలం నిరీక్షిస్తూ వచ్చాను. కనీసం వారు ఏ దేశస్థులో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ సాయం అర్థిస్తున్నాను. లండన్‌లోని లంకాషైర్‌లో నివసిస్తున్న నేను మెరైన్ ఫొటోగ్రాఫర్‌ను. నా ఫేస్బుక్ పేజీని సులభంగానే గుర్తించవచ్చు’ అంటూ ఆమె సోషల్ వెబ్సైట్ యూజర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం
గుడివాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. సోమవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన జగన్... రోడ్డుమార్గం ద్వారా గుడివాడ చేరుకున్నారు. పెద్దఎరుకుపాడుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత పాలేటి శివసుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి... త్వరలో పెళ్లికాబోతున్న ఆయన కుమార్తె రత్న నిహారికను ఆశీర్వదించారు. ఆ తర్వాత పెడన మండలం కృష్ణాపురం చేరుకుని వైఎస్ఆర్ సీపీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్‌ప్రసాద్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. జగన్ వెంట వైఎస్ఆర్సీపీ నేతలు కొడాలినాని, ఉప్పులేటి కల్పన, పేర్నినాని, ఉదయభాను, గౌతమ్‌రెడ్డి, తలశిల రఘురామ్ ఉన్నారు.