రంగా విగ్రహాలు మీరు తీసుకెళ్లండి
వ్యవసాయ వర్సిటీకి తెలంగాణ లేఖ
సాక్షి, అమరావతి: హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా విగ్రహాలను తీసు కెళ్లాల్సిందిగా ఏపీ వ్యవసాయ వర్సిటీకి ప్రొఫెసర్ జయ శంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లేఖ రాసింది. దీంతో గుంటూరులోని వ్యవ సాయ వర్సిటీ అధికారులు ఆ విగ్రహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడిగా ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఒకటి, పరిపాలనా భవనం వద్ద మరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వాటిని తరలించనున్నారు.