ఐసిస్ హిట్‌లిస్టులో జడ్జీలు, ఆర్ఎస్ఎస్ నాయకులు
ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో జరిగిన భారీ ఉగ్రదాడి మాదిరిగా భారత్‌లోనూ అటాక్‌కు ప్లాన్ చేస్తున్న ఓ ఆరుగురు ఐఎస్ఐఎస్ అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో మతనాయకులందరూ సమావేశమైనప్పుడు వాహనాన్ని పేల్చి దాడి చేసేందుకు వారు పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. కాగ గతవారమే ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న కేరళ తిరునల్వేలిలో ఓ న్యాయవిద్యార్థిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. అతన్ని అదుపులోకి తీసుకున్న కొన్ని రోజుల్లోనే మరో ఆరుగురిని కేరళ పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఏడుగురు కలిసి కేరళలో దాడికి ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడైంది. నైస్ తరహాలో దాడి మాత్రమే కాక వారి హిట్ లిస్టులో ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ప్రముఖ హేతువాది, ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నట్టు తెలిసింది. విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కేరళ పోలీసు డైరెక్టర్ జనరల్ లోక్‌నాథ్ బెహెరా తెలిపారు.
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు, ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుపుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడుగురు వయసు 24 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుందని చెప్పారు. కేరళ నుంచి 21 మంది కనపడకుండా పోయిన కేసును విచారిస్తున్న సమయంలో దర్యాప్తు సంస్థకు వీరు పట్టుబడ్డారు. మొదట ఓ న్యాయ స్టూడెంట్, అనంతరం ఈ ఆరుగురు వ్యక్తులు కన్నూర్ జిల్లా, కోళికోడ్ ప్రాంతాలల్లో పోలీసులకు చిక్కారు. వీరిని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్గానిస్తాన్,అనంతరం సిరియా ఇతర దేశాలకు ఐఎస్ఐఎస్ సరఫరా చేస్తున్నట్టు వెల్లడవుతోంది. ఎన్ఐఏ టీమ్స్‌తో పాటు కేరళ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడి ప్లాన్ బయటికి వెల్లడికావడంతో కేరళ గవర్నమెంట్‌ను, ఆ ఇద్దరు హైకోర్టు జడ్జిలను, కొంతమంది రాజకీయ నాయకులను ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు అలర్ట్ చేశాయి.