nife
-
రెచ్చిపోయిన ఉన్మాది, మహిళపై కత్తితో దాడి
తిరువనంతపురం: కేరళలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో మహిళపై దారుణానికి తెగబడ్డాడు. గతంలో కూడా వేధింపులకు పాల్పడిన నిందితుడు సమయం చూసి ఇంట్లోకి చొరబడి మరీ బాధితురాలిని పొట్టన పెట్టుకున్న ఘటన విషాదాన్ని నింపింది. పెద్దమాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీపూర్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం నాలుగేళ్ల క్రితం తిరువనంతపురానికి చెందిన సూర్యగాయత్రిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు నిందితుడు, పెయాడ్కు చెందిన అరుణ్(29).అయితే ఈ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. దీంతో అరుణ్ వేధింపుల పర్వం మొదలైంది. దీనికి తోడు తన స్మార్ట్‌ఫోన్, బంగారు నగలు దొంగిలించాడంటూ నాలుగేళ్ల క్రితమే సూర్యగాయత్రి తల్లి తిరువనంతపురంలోని ఆర్యనాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అప్పట్లో కేసు నమోదు చేయని పోలీసులు అరుణ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేశారు. ఆ తరువాత కొంత కాలానికి సూర్యగాయత్రి మరొక వ్యక్తిని వివాహం చేసుకోగా, అరుణ్ కూడా వివాహం చేసుకున్నాడు. అయితే భర్తతో విబేధాల కారణంగా సూర్య గాయత్రి ఇటీవల పుట్టింటికి తిరిగి వచ్చింది. దీంతో అరుణ్ మళ్లీ ఆమె వెంటపడటం మొదలు పెట్టాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఎటాక్ చేసి కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచాడు. వెంటనే స్పందించిన పొరుగువారు అరుణ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన సూర్యగాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. అరుణ్‌పై అంతకు ముందే క్రిమినల్ కేసులున్న నేపథ్యంలో అతని పెళ్లి ప్రస్తావనను తిరస్కరించామని గాయత్రి తల్లి వల్సల తెలిపారు. అరుణ్ దాడిలో గాయ పడిన వల్సల ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే తనను అవమానించినందుకే ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడని చెప్పారు. -
ప్రియురాలిపై చాకుతో దాడి
తాడేపల్లిగూడెం రూరల్ : ప్రియురాలు మాట్లాడటం లేదనే ఆక్రోశంతో ఆమెపై దాడికి తెగబడిన ఓ ప్రేమోన్మాది తెగబడ్డాడు. ఈ ఘటన తాడేపల్లిగూడెం పట్టణం విమానాశ్రయ రన్‌వే ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బూర్గుంపాడుకు చెందిన 28ఏళ్ల మురికి సంజీవ్‌కుమార్ స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్నాడు. అతను ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంటెక్ చదువుతూ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. సంజీవ్ తన ఇంటికి ఎదురుగా నివాసముంటున్న యువతిని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి ఇంటిలో తెలియడంతో మందలించారు. దీంతో సంజీవ్‌కు ఆమె దూరంగా ఉంటోంది. నాలుగు రోజులుగా ఆమె మాట్లాడకపోవడంతో ఆగ్రహించిన సంజీవ్ చాకు కొని ఆమెను ఎయిర్ డ్రమ్ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశాడు. అనంతరం అదే చాకుతో తన కాలిపైనా గాయం చేసుకున్నాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వీరిని స్థానికులు 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై ఐ.వీర్రాజు ఇద్దరి నుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉన్మాదం..
-
ఉన్మాదం..
♦ డబ్బుల విషయంలో ఘర్షణ ♦ తల్వార్‌తో కుటుంబంపై దాడి ♦ ముగ్గురికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం ♦ గాంధీ ఆస్పత్రికి తరలింపు కామారెడ్డి: కామారెడ్డిపట్టణంలోని బతుకమ్మకుంటకాలనీలో శనివారం రాత్రి చిన్న గొడవలో ఉన్మాదిగా మారిన యువకుడు ఓ కుటుంబంపై తల్వార్‌తో విచక్షణార హితంగా దాడి చేశాడు. కామారెడ్డి డీఎస్పీ ఎ.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం...బతుకమ్మకుంట కాలనీకి చెందిన శేక్‌అలీ,మజార్అలీల మధ్య డబ్బుల విషయంలో శనివారం రాత్రి గొడవ జరిగింది. శేక్‌అలీ బావమరిది మహ్మద్ షరీఫ్(22) అక్కడికి చేరుకుని సముదాయించే ప్రయత్నం చేశాడు. దీంతో కోపంతో మజార్‌అలీ అక్కడే హసన్చావూస్ను తల్వార్ తీసుకురమ్మని పురమాయించాడు. ఇంట్లోకి వెళ్లిన హసన్‌చావూస్ తల్వార్ తీసుకువస్తూనే షరీఫ్‌పై దాడి చేశాడు. ఇంటి ముందర ఉన్న షరీఫ్ తల్లి హుస్సేన్‌బీ(50), వదిన రజియాబేగం(25) అడ్డు వెళ్లారు. షరీఫ్‌పై తల్వార్‌తో దాడి చేసిన హసన్‌చావూస్ హుస్సేన్‌బీ, రజియాబేగంలపై కూడా అదే తల్వార్‌తో దాడి చేశారు. దీంతో షరీఫ్, హుస్సేన్‌బీ, రజియాబేగంలు తీవ్ర గాయాలపాలై రక్తపుమడుగులో పడ్డారు. విషయం తెలిసిన పట్టణ సీఐ శ్రీనివాస్‌రావ్ తన బలగాలతో చేరుకుని క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్ర రక్తస్రావం అవుతుండగా స్థానిక వైద్యులు వెంటనే చికిత్సలు చేసినా పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్సులో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. బతుకమ్మకుంట కాలనీలో గొడవలు జరుగకుండా పట్టణ సీఐ శ్రీనివాస్‌రావ్, ఎస్సై శోభన్ అక్కడే మకాం వేశారు. కాగా హసన్‌చావూస్ తల్వార్ తెచ్చిన వెంటనే విచక్షణారహితంగా దాడి చేయడంతో ముగ్గురికి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగానే ఉంది.