పెద్ద నోట్ల రద్దు దెబ్బ నుంచి ‘కోలుకున్న’ పరిశ్రమ: నికాయ్
పెద్ద నోట్ల రద్దు తరువాత తీవ్ర ప్రతికూల ప్రభావానికి గురయిన పారిశ్రామిక రంగం తిరిగి కోలుకుందని నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. తయారీ రంగ క్రియాశీలతను వివరించే ఈ సూచీ డిసెంబర్లో 49.6 శాతంగా ఉంటే, జనవరిలో 50.4 శాతం వృద్ధికి మారింది.
సూచీ 50 శాతం దిగువున ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా భావించడం జరుగుతుంది. ఆర్డర్లు, ఉత్పత్తి పెరిగిన ధోరణి కనబడుతుండడంతో, వృద్ధి ధోరణి కొనసాగే వీలుందని నెలవారీ సూచీ సూచించింది. అయితే ఎగుమతి ఆర్డర్లు మాత్రం తగ్గుతున్నట్లు సూచీ తెలిపింది.