నర్సీపట్నం కౌన్సిల్ సమావేశంలో రగడ
విశాఖ: విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో రగడ చోటుచేసుకుంది. నీల్కమల్ కుర్చీల కొటేషన్లో ఒక్కో కుర్చీకి 600 రూపాయల చొప్పున పేర్కొనడంపై వైఎస్ఆర్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో టీడీపీ వర్గీయులు వైఎస్ఆర్సీపీ వర్గీయులతో ఘర్షణకు దిగారు.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ మెంబర్ అప్పలనాయుడుపై టీడీపీ వర్గీయులు దాడికి యత్నించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.