Nine died
-
కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్...
బాగ్దాద్: ఇరాక్ ఆర్మీ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన బాగ్దాద్ దక్షిణ ప్రాంతంలో మంగళవారం సంభవించిందని అధికారులు వెల్లడించారు. బ్రిగేడియర్ జనరల్ యహ్య రసూల్ తెలిపిన వివరాల ప్రకారం... సోవియట్ యూనియన్ తయారుచేసిన హెలికాఫ్టర్ ఎమ్ఐ-17 సాంకేతిక లోపాలు తలెత్తిన కారణంగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇందులో వెళ్తోన్న ఇద్దరు ఆర్మీ అధికారులు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఇరాక్ దక్షిణాన ఉన్న బస్రా నుంచి కట్ పట్టణానికి ఆయుధాలతో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. గతంలో బాగ్దాద్ తూర్పు ప్రాంతంలో 2014 అక్టోబర్ లో బెల్ 407 హెలికాఫ్టర్ లో వెళ్తుండగా మిలిటెంట్లు కుప్పకూల్చడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు కన్నుమూశారు. అదే ప్రాంతంలో కేవలం ఐదు రోజుల తర్వాత జరిగిన మరో హెలికాఫ్టర్ దుర్ఘటన జరిగిన విషయం తెలిసిందే. 2010 జూలైలో సంభవించిన తుఫాన్ కారణంగా ఎమ్ఐ-17 రకానికి చెందిన ఓ హెలికాఫ్టర్ క్రాష్ అవడంతో ఐదుగురు సిబ్బంది చనిపోయారు. -
బాంబుల ఫ్యాక్టరీలో పేలుళ్లు..
బీజింగ్: చైనాలోని ఓ పేలుడు పదార్ధాల తయారీ ఫ్యాక్టరీలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు షడాంగ్ ప్రావిన్స్‌లోని టియాన్ బావో కెమికల్ ఇండస్ట్రీలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు దాటికి మొత్తం 401 వర్క్ షాపులు ధ్వంసమయ్యాయి. గుర్తుపట్టలేనంత చిద్రంగా చనిపోయి తొమ్మిదిమంది మృతదేహాలు పడిఉన్నాయి. వారంతా 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారే. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించడం కోసం ముందు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పేలుడు ఎంత తీవ్రతతో సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల చైనాలో ఎక్కువగా పేలుడు పదార్ధాల ఫ్యాక్టరీలో, రసాయనిక కర్మాగారాల్లో భారీ ఎత్తున పేలుళ్లు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆగస్టులో రెండు భారీ పేలుళ్లు సంభవించి దాదాపు 180 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది మృతి
-
భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు బుధవారం అర్థరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా... పలువురు గాయపడ్డారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.