బీజింగ్: చైనాలోని ఓ పేలుడు పదార్ధాల తయారీ ఫ్యాక్టరీలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీంతో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు షడాంగ్ ప్రావిన్స్లోని టియాన్ బావో కెమికల్ ఇండస్ట్రీలో తాజాగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు దాటికి మొత్తం 401 వర్క్ షాపులు ధ్వంసమయ్యాయి. గుర్తుపట్టలేనంత చిద్రంగా చనిపోయి తొమ్మిదిమంది మృతదేహాలు పడిఉన్నాయి.
వారంతా 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసువారే. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించడం కోసం ముందు డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పేలుడు ఎంత తీవ్రతతో సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల చైనాలో ఎక్కువగా పేలుడు పదార్ధాల ఫ్యాక్టరీలో, రసాయనిక కర్మాగారాల్లో భారీ ఎత్తున పేలుళ్లు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆగస్టులో రెండు భారీ పేలుళ్లు సంభవించి దాదాపు 180 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
బాంబుల ఫ్యాక్టరీలో పేలుళ్లు..
Published Wed, Oct 21 2015 8:07 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM
Advertisement