Niranjanreddi
-
నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని, నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాల్సిన అవసరముందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంత పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ, గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. నదులకు 5 కి.మీ. దూరం నుంచి రైతుల పొలాలలో నీడనిచ్చే చెట్లు, ఉద్యాన పంటలు వంటివి వేయాలన్నారు. వాగులకు రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా పచ్చదనాన్ని పెంచాలన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాల భూమిలో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫారెస్ట్ బయో డైవర్సిటీ సంచాలకులు జయప్రసాద్, శాస్త్రవేత్త డీఆర్ఎస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర పనుల్లో అవినీతి
నిరంజన్‌పై చిన్నారెడ్డి ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పుష్కరఘాట్ పనుల్లో రూ.4 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి ఆరోపించారు. నిరంజన్‌రెడ్డి అధికార పార్టీని, నామినేటెడ్ పదవిని ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఇక్కడ చిన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వనపర్తిలోని కృష్ణవేణి షుగ ర్ ఫ్యాక్టరీలో తనకు వాటాలు ఉన్నాయని నిరూపిస్తే వాటిని నిరంజన్‌రెడ్డికి రాసిస్తాన ని ప్రకటించారు. తాను పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఏనాడు సమర్థించలేదన్నారు. గతంలో తన పేరుతో ఒక పత్రికలో వచ్చి న వ్యాసం తాను రాసింది కాదని, దానిపై తన సంతకం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పురుద్ఘాటించారు. దళితుడిని సీఎం చేస్తానని, ఆ విధంగా చేయకపోతే తల నరుక్కుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ చేసి మాట తప్పారని అందరూ అలాగే ఉంటారని అనుకోవడం తప్పని అన్నారు.