Nissan India Operations
-
హోండా, నిస్సాన్ విలీనం
టోక్యో: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు హోండా, నిస్సాన్ విలీనం కానున్నట్లు ప్రకటించాయి. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. నిస్సాన్‌కు వాటాలున్న మిత్సుబిషి మోటార్స్ కూడా తన వ్యాపారాన్ని విలీనం చేసే చర్చల్లో భాగమయ్యేందుకు అంగీకరించినట్లు కంపెనీలు వెల్లడించాయి. ఈ డీల్‌తో విలీన సంస్థ.. అమ్మకాలపరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఫ్రాన్స్‌కు చెందిన రెనోతో భాగస్వామ్యం, అలాగే మిత్సుబిషి మోటార్స్ కార్ప్‌లతో కలిసి హోండా, నిస్సాన్ కూటమి.. జపాన్‌కే చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటర్ కార్ప్, జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్లతో పోటీ పడనుంది. విలీనం అమల్లోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో కస్టమర్లకు చేరువయ్యేందుకు తోడ్పడగలదని నిస్సాన్ సీఈవో మకొటొ యుషిడా తెలిపారు. ఇటీవలే హోండా, నిస్సాన్ విలీన వార్తలు రావడం తెలిసిందే. ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా శిలాజ ఇంధనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, స్వయంచాలిత టెక్నాలజీల వైపు మళ్లుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.50 బిలియన్ డాలర్ల దిగ్గజం..: మూడు కంపెనీల కలయికతో 50 బిలియన్ డాలర్ల పైగా మార్కెట్ విలువ గల దిగ్గజ సంస్థ ఏర్పాటవుతుంది. వీటి వార్షిక వాహనాల ఉత్పత్తి పరిమాణం 80 లక్షలు ఉంటుంది. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షలు, మిత్సుబిషి మోటర్స్ దాదాపు 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేశాయి. అయితే ఈ మూడూ కలిసినా కూడా ఉత్పత్తిపరంగా టయోటానే అగ్రగామిగా కొనసాగనుంది. 2023లో టయోటా మొత్తం 1.15 కోట్ల వాహనాల తయారీతో టాప్‌లో ఉంది. ఫోక్స్‌వ్యాగన్ సుమారు 89 లక్షల వాహనాల ఉత్పత్తితో రెండో స్థానంలో నిల్చింది. ప్రస్తుతం దాదాపు 68 లక్షల వాహనాలతో (కియా, జెనెసిస్ బ్రాండ్లతో కలిసి) దక్షిణ కొరియా సంస్థ హ్యుందాయ్ మూడో స్థానంలో ఉంది. ప్రయోజనాలేమిటంటే.. ఒకవైపు వాహన కంపెనీలు శిలాజ ఇంధనాల వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లేందుకు తంటాలు పడుతుండగా మరోవైపు చైనా కంపెనీలు కొత్త టెక్నాలజీల విషయంలో దూసుకెళ్తుండటం పరిశ్రమను కుదిపేస్తోంది. చైనాకు చెందిన బీవైడీ, గ్రేట్ వాల్, నియో వంటి చౌక ప్రత్యామ్నాయ ఎలక్ట్రిక్ వాహనాలు.. జపాన్, అమెరికన్ కార్ల కంపెనీల మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటుచేసుకుంటున్నట్లు పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఆరి్థక సమస్యలు, తగ్గుతున్న లాభదాయకతతో నిస్సాన్ సతమతమవుతోంది. చైనాలో అమ్మకాల బలహీన తతో హోండా లాభాలపైనా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో విలీనం చోటు చేసుకుంటోంది. 2023లో జరిగిన అమ్మకాల పరంగా టాప్ 10 అతిపెద్ద వాహన తయారీదారుల జాబితాటయోటా - 10.3 మిలియన్ వాహనాలువోక్స్ వ్యాగన్ గ్రూప్ - 9.2 మిలియన్ వాహనాలుహ్యుందాయ్ మోటార్ గ్రూప్ - 7.3 మిలియన్ వాహనాలుస్టెలాంటిస్ - 6.4 మిలియన్ వాహనాలుజనరల్ మోటార్స్ - 6.2 మిలియన్ వాహనాలుఫోర్డ్ మోటార్ కంపెనీ - 4.4 మిలియన్ వాహనాలుహోండా - 4.2 మిలియన్ వాహనాలునిస్సాన్ - 3.4 మిలియన్ వాహనాలు(నోట్: విలీన ప్రక్రియ పూర్తైతే హోండా, నిస్సాన్ కలిపి అమ్మకాల్లో టాప్ 3 కంపెనీ అవతరించినట్లువుతుంది.)బీఎండబ్ల్యూ గ్రూప్ - 2.6 మిలియన్ వాహనాలుమెర్సిడెస్ బెంజ్ - 2.5 మిలియన్ వాహనాలు -
దీపావళికల్లా డాట్సన్ గో ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ నిస్సాన్ మోటార్ భారత మార్కెట్లో తన బ్రాండ్‌ను సుస్థిరపరచాలని కృతనిశ్చయంతో ఉంది. నంబర్లు(మార్కెట్ వాటా) ముఖ్యం కాదని కంపెనీ స్పష్టం చేస్తోంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ విస్తృతం చేయడం ద్వారా కస్టమర్ల మది దోచుకుంటామని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ కెనిచిరో యోమురా చెబుతున్నారు. మోటార్ రేసింగ్ ప్రతిభను గుర్తించడానికి నిస్సాన్ ప్లే స్టేషన్ జీటీ అకాడమీ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. నిస్సాన్ కొత్త మోడళ్లు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. ఇంటర్వ్యూ విశేషాలు.. ఇటీవల ప్రవేశపెట్టిన నిస్సాన్ డాట్సన్ గో మోడల్‌కు స్పందన ఎలా ఉంది? నెల రోజుల క్రితమే భారత్‌లో డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ విడుదల చేశాం. స్పందన అనూహ్యంగా ఉంది. ప్యాసింజర్ కార్ల మార్కెట్లో తొలిసారిగా కారు కొనేవారు 40 శాతం మంది ఉంటారు. వీరికి ఈ మోడల్ కచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే రూ.3.12 లక్షల (ఎక్స్‌షోరూం) ధర నుంచి ఇది లభించడమే. అంతేకాదు మైలేజీ లీటరుకు 20.63 ఇస్తుంది. ఇప్పటికే 3,500 కార్లను విక్రయించాం. మార్కెట్ వాటా పెరిగేందుకు డాట్సన్ దోహదం చేస్తుంది కూడా. సంస్థ అమ్మకాల్లో డాట్సన్ వాటా 2016కల్లా 50 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాం. కొత్త మోడళ్లు ఏమేం తేబోతున్నారు? దేశంలో బి సెగ్మెంట్(చిన్న కార్లు), కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(సీఎస్యూవీ) విభాగానికి మంచి డిమాండ్ ఉంది. మా ఫోకస్ కూడా వీటిపై పెట్టాం. మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) డాట్సన్ గో ప్లస్ మోడల్‌ను దీపావళి నాటికి భారత మార్కెట్లోకి తేనున్నాం. డాట్సన్ ప్లాట్‌ఫాంపై మూడో మోడల్ 2015లో రానుంది. కాన్సెప్ట్ మోడల్ అయిన డాట్సన్ రెడీ గో రావడానికి రెండేళ్లకుపైగా సమయం తీసుకుంటుంది. మార్కెట్ అవకాశాలనుబట్టి క్రాస్ ఓవర్ ఎస్యూవీ ‘మురానో’ ప్రవేశపెడతాం. జూలైకల్లా కొత్త సన్నీ సెడాన్, డిసెంబర్‌లోగా రీడిజైన్ చేసిన ఎవాలియా రాబోతున్నాయి. భారత్‌లో నిస్సాన్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? మార్కెట్లో వృద్ధి ఆశిస్తున్నారా? 2012-13లో దేశీయంగా 36,975 కార్లను విక్రయించాం. గత ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి ఈ సంఖ్య 38,217కు చేరింది. ప్రస్తుతం మా వాటా 2 శాతం లోపే. 2017కల్లా 10 శాతానికి చేరుకోవాలని భావించినప్పటికీ లక్ష్యానికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ఇక 2013-14లో 1.2 లక్షల కార్లను ఎగుమతి చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఒక లక్షకుపైగా ఉండొచ్చు. రెనాల్ట్, నిస్సాన్ భాగస్వామ్యంలోని చెన్నై ప్లాంటులో సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 4 లక్షల నుంచి 4.8 లక్షల కార్లకు ఈ ఏడాదే పెంచుతున్నాం. భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ వృద్ధి బాటన పయ నిస్తుంది. ఈ సంవత్సరం పరిశ్రమ 5 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. బ్రాండెడ్ యూజ్డ్ కార్ల మార్కెట్లోకి వచ్చే ఆలోచన ఉందా? భారత్ వంటి దేశాల్లో సెకండ్ హ్యాండ్ కార్లకూ గిరాకీ ఎక్కువ. కొత్తగా అమ్ముడవుతున్న కార్లతో పోలిస్తే సగం వాటా వీటిదే. భవిష్యత్తులో ఈ విభాగంలోకి రానున్నాం. డీలర్లకు మంచి ప్రయోజనం కలుగుతుంది. మాస్టర్ ఫ్రాంచైజీ అయిన హోవర్ ఆటోమోటివ్‌తో పంపిణీ ఒప్పందం రద్దు అయింది. మేమే నేరుగా డీలర్లతో లావాదేవీలు నెరుపుతున్నాం. మాస్టర్ ఫ్రాంచైజీకి చెల్లిస్తున్న మొత్తాన్ని ఇక నుంచి ప్రకటనలకు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు వెచ్చిస్తాం. కస్టమర్ల తీరు ఎలా ఉంది? తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లున్న కారును కస్టమర్లు కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఉంది. భారతీయ కస్టమర్లు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. కారు చక్కగా అందంగా ఉండాలంటారు. మైలేజీ ఎక్కువగా రావాలంటారు. కారు లోపల ఎక్కువ స్థలం ఉండాలని చూస్తారు. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ నిస్సాన్‌కు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం డీలర్ల సంఖ్య 130 ఉంది. మార్చికల్లా 200లకు పెంచుతాం.