nitisa
-
మంఝికి నేడు ఉద్వాసన!
పార్టీ ఎల్పీ భేటీలో నితీశ్‌కు పగ్గాలు! 20న తాను ఎల్పీ భేటీని నిర్వహిస్తానని మంఝి వెల్లడి ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు పట్నా: జేడీయూ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మంఝికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే పార్టీ శాసనసభాపక్ష(ఎల్పీ) భేటీలో సీఎం పగ్గాలను సీనియర్ నేత నితీశ్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. నితీశ్, మంఝి వర్గాల మధ్య ఆధిపత్య పోరు శుక్రవారం తీవ్రమైంది. పార్టీ చీప్ శరద్ యాదవ్ శనివారం ఏర్పాటు చేసిన ఎల్పీ సమావేశం అనధికారికమని మంఝి ఆరోపించారు. అసెంబ్లీలో పార్టీ నేత హోదాలో తాను ఈ నెల 20న తన నివాసంలో ఎల్పీ భేటీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఆదివారం నిర్వహించనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు మంఝి శనివారం ఢిల్లీ వెళ్లనుండడంతో ఆ రోజు జరిగే ఎల్పీ భేటీకి గైర్హాజరు కానున్నారు. కాగా, శనివారం జరిగే అత్యవసర ఎల్పీ సమావేశానికి రావాలని మంఝి, నితీశ్ సహా 111 మంది ఎమ్మెల్యేలు, 41 మంది ఎమ్మెల్సీలకు శుక్రవారం నోటీసులు అందాయి. జేడీయూ రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్షుడికి ఎల్పీ భేటీని ఏర్పాటు చేసే అధికారం ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. ‘సాయంత్రం 4 గంటల తర్వాత మంఝి జేడీయూ ఎల్పీ నేతగా ఉండర’ని అన్నారు. మంఝి వెళ్లనున్న ‘నీతి’ భేటీ గురించి విలేకర్లు ప్రస్తావించగా.. ఆయన సీఎం కానప్పుడు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. . పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు, కార్యకలాపాలకు పాల్పడుతున్న మంఝి, పార్టీ పెద్దలు మందలించినా మారలేదని, ఆయనను పదవి నుంచి తప్పించడం అవశ్యంగా మారిందని అన్నారు. 2010 ఎన్నికల్లో ప్రజలు నితీశ్‌కే పట్టం కట్టారని, మంఝి పదవి తాత్కాలికమేనని అన్నారు. ముంఝి ముంచేస్తున్న పార్టీ పడవను నితీశ్ కాపాడతారని పేర్కొన్నారు. నితీశ్‌కు తిరిగి సీఎం పదవి అప్పగించే యత్నానికి శరద్ యాదవ్‌తోపాటు ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలు లాలూ, ములాయంల మద్దతు ఉందన్నారు. కాగా, త్యాగి యమదూత అని, ఆయనకు పిచ్చిపట్టిందని మంఝి ఆరోపించారు. నితీశ్ భీష్ముడి వంటి వారని, తను పేద ప్రజల సంక్షేమం గురించి మాట్లాడకుండా నితీశ్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాగా, మంఝి శనివారం అనూహ్యంగా అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేయొచ్చని జేడీయూ భయపడుతోంది. అందుకే మంఝి ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఆయన చేసే సిఫారసులను పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతూ శరద్ యాదవ్ గవర్నర్‌ను ఓ లేఖలో కోరినట్లు సమాచారం. కాగా నితీశ్‌కు సన్నిహితులైన మంత్రులు రాజీవ్‌రంజన్, పీకే సాహీలు ప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని, వారిని కేబినెట్ తొలగించాలని మంఝి శుక్రవారం రాత్రి గవర్నర్‌కు సిఫారసు చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ఘర్షణలు నితీశ్, మంఝి మద్దతుదారులు శుక్రవారం పట్నాలోని జేడీయూ కార్యాలయం వద్ద ఘర్షణలకు దిగారు. దళిత కార్యకర్తలు నితీశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, నితీశ్ మద్దతుదారులపై దాడి చేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర మంత్రులు బ్రిషేన్, నితీశ్ మిశ్రా తదితరులు సీఎం ఇంటికెళ్లి మద్దతు ప్రకటించారు. నితీశ్ నివాసం కూడా జేడీయూ దళిత సంఘం భేటీతో సందడిగా కనిపించింది. ఒత్తిళ్లకు తలొగ్గి సీఎం పదవి నుంచి తప్పుకోవద్దని మంఝికి కేంద్రమంత్రి పాశ్వాన్ సూచించారు. -
ఇంకా ఆస్పత్రిలోనే...
కళ్లు తెరవని వరుణ్‌గౌడ్... నెమ్మదిగా తేరుకుంటున్న ప్రశాంత్... శతవిధాలుగా ప్రయత్నిస్తున్న వైద్యులు సాక్షి, సిటీబ్యూరో: మూసాయిపేట ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌గౌడ్(7) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గత పది రోజులుగా ఆ చిన్నారి కళ్లు కూడా తెరువలేదు. ప్రశాంత్(6) పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శరత్(6), నితిషా(7)లు నెమ్మదిగా కోలుకుంటున్నారు. మూసాయిపేట్ రైల్వేక్రాసింగ్ ఘటనలో 18 మంది మృతి చెందగా, 20 మంది క్షతగాత్రులు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. వీరిలో వైష్ణవి, తరుణ్‌లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మృతి చెందగా, 14 మంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. మిగిలిన నలుగురినీ ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఆస్పత్రికి చెందిన 40 మంది వైద్య నిపుణులు, 100 మంది పారా మెడికల్ స్టాఫ్ అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య స్పష్టం చేశారు. పది రోజులుగా అదే స్థితి... వెంకటాయపల్లికి చెందిన మల్లేష్, లత దంపతులకు రుచిత గౌడ్(8), వరుణ్ గౌడ్(7), శృతి గౌడ్(6) ముగ్గురు పిల్లలు. వీరందరినీ కాకతీయ టెక్నో స్కూల్లో చదివిస్తున్నారు. ఘటన జరిగిన రోజు శృతి అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన రుచితగౌడ్, వరుణ్‌గౌడ్‌లను యశోద ఆస్పత్రికి తరలించారు. రుచిత పూర్తిగా కోలుకోవడంతో గురువారం వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. కుమారుడు వరుణ్‌గౌడ్ పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉంది. మెదడు దెబ్బతింది. కుడి కాలర్ ఎముక విరిగింది. ఛాతి ఎముకలు విరిగి ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో ఒత్తిడికి అవి దెబ్బతిన్నాయి. ఎడమ మోకాలి కార్టిలేజ్‌పై చర్మం అంతా ఊడిపోయింది. ఐదు రో జుల క్రితం ఆయనకు ప్లాస్లిక్ సర్జరీ చేశారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడు. ఇప్పటి వరకు కళ్లు కూడా తెరువలేదు. శరీరంలో ఎలాంటి కదలిక లేదు. తరచూ ఫిట్స్ వస్తున్నాయి. గత పది రోజుల నుంచి మృత్యువుతో పోరాడుతున్నాడు. పూర్తిగా మందులే వినియోగిస్తున్నారు. మరో మూడు రోజులు గడిస్తే కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మిగతా పిల్లల్లాగే తన కుమారుడు వరుణ్‌గౌడ్ కూడా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అతని తల్లిదండ్రులు కనిపించిన దేవుడినల్లా ప్రార్థిస్తున్నారు. కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడనే తీపి కబురు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ మెదడు చుట్టూ నీరు... వెంకటాయపల్లికి చెందిన స్వామి, నర్సమ్మ దంపతుల రెండో కుమారుడు ప్రశాంత్(6) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వరణ్‌గౌడ్‌తో పోలిస్తే ఇతని పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. పుర్రె ఎముక విరిగి మెదడుకు ఆనుకుంది. తలపై చర్మం ఊడిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తొడ భాగంలోని కొంత చర్మాన్ని తీసి తలపై అమర్చారు. మెదడు చుట్టూ నీరు చేరుతుండటంతో మూడు రోజుల క్రితం సర్జరీ చేసి, నీటిని బయటికి తీసేశారు. ముఖంపై గాయాలు ఇంకా మాన లేదు. ఎడమ చేయి విరగడంతో శస్త్రచికిత్స చేసి కట్టుకట్టారు. నాలుగు రోజుల క్రితం వెంటిలేటర్ తొలగించారు. సహజ పద్ధతిలో ఆక్సిజన్ అందిస్తున్నారు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు ఫిట్స్ రావడంతో వైద్యుల పరిశీలనలో ఉంచారు. మరోసారి ఫిట్స్ వస్తే...మళ్లీ వెంటిలేటర్ అమర్చాల్సి ఉంటుందని ఆ చిన్నారికి శస్త్రచికిత్స చేసిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ బి.జె.రాజేశ్ తెలిపారు.