కారును ఢీకొట్టిన బస్సు: నలుగురి మృతి
జైపూర్: రాజస్థాన్లోని చురు జిల్లాలో సదుల్పుర్ ప్రాంతంలో గురువారం రోడ్డుప్రమాదం జరిగింది. కారును ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎస్పీ నితీశ్ ఆర్య పేర్కొన్నారు. రాజ్ఘర్ ప్రాంతంలోని కిషన్పురలో స్కూల్కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు చెప్పారు.
మృతులు షేర్ సింగ్ (35), రాజ్కరణ్ (45), మహేంద్ర కుమార్ (51), సుశీల్ శర్మ (42) లుగా గుర్తించినట్టు ఆడిషినల్ ఎస్పీ వెల్లడించారు. కాగా, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.