nitrogen dioxide
-
నగరం ఉక్కిరిబిక్కిరి
శీతల గాలులకు తోడైన కాలుష్య ఉద్గారాలు పంజా విసురుతున్న నైట్రోజన్ ఆక్సైడ్ వాతావరణంలో అనూహ్యంగా పెరుగుదల తీవ్రమైన దగ్గు, ఆస్తమాతో నగరవాసుల సతమతం అల్లాడుతున్న వృద్ధులు, చిన్నారులు, గ ర్భిణులు ఘనపుమీటరు గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ 40 మైక్రో గ్రాములకు మించొద్దు నగరంలో చాలాచోట్ల 100 మైక్రో గ్రాములపైనే.. సాక్షి, హైదరాబాద్: నగరవాసికి ‘చలి’ కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది! శీతల గాలుల్లో తేమ, నైట్రోజన్ ఆకై ్సడ్ మోతాదు పెరగడం.. దానికి కాలుష్య ఉద్గారాలు జతకావడంతో జనం దగ్గు, ఆస్తమా సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు 40 మైక్రో గ్రాములు మించొద్దు. కానీ పంజగుట్ట, అమీర్‌పేట్, అబిడ్స, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో 100 మైక్రో గ్రాములను మించుతోంది. ఆరోగ్యంపై తీవ్ర దుష్పభ్రావం చూపుతోంది. అనూహ్య మార్పులు: భాగ్యనగరం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నారుు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమించడం, ఈశాన్య రుతుపవనాలు సమీపిస్తుండడంతో ఈశాన్య, ఉత్తర భారతదేశం నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగరంలో సోమవారం 17.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 48 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 52 శాతానికి పడిపోవడంతో చలిగాలులు వణికిస్తున్నారుు. ఈ గాలులతో వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్ కలసిపోతుండడంతో నగరవాసులు బ్రాంకై టిస్, ఆస్తమా, ఊపిరితిత్తుల పొరలు దెబ్బతినడం వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు. 2012 అక్టోబర్ 12న నగరంలో 17.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అదే స్థారుులో(17.2) నమోదవుతుండడం గమనార్హం. రోజుకు 40 టన్నులు! రోజు సగటున వాతావరణంలో సుమారు 40 టన్నుల మేర నైట్రోజన్ ఆకై ్సడ్ కలుస్తున్నట్లు పీసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, కాలంచెల్లిన వాహనాలు వెదజల్లుతున్న పొగలో నైట్రోజన్ ఆకై ్సడ్ అధిక మోతాదులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉద్గారాలు శీతల గాలులతో కలవడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. నగరంలో రోడ్లపైకి వస్తున్న సుమారు 46 లక్షల వాహనాల్లో 15 లక్షల వరకు పదిహేనేళ్లకు పైబడినవే. కాలంచెల్లిన ఈ వాహనాలను రోడ్డెక్కకుండా చేయడంలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు విఫలమవుతుండడంతో పరిస్థితి విషమిస్తోంది. నైట్రోజన్ ఆక్సైడ్తో అనర్థాలివే ► ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఇబ్బందు లు పడుతున్నారు ఠి ఊపిరితిత్తుల పొరలు దెబ్బతింటున్నారుు ఠి వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తోంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తున్నా రుు. ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు ► ఆస్తమా కేసులు పెరుగుతున్నారుు ► జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు ► మొక్కల్లోనూ పెరుగుదల లోపిస్తోంది అక్టోబర్‌లో గత ఐదేళ్లుగా నగరంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు సంవత్సరం తేదీ కనిష్ట ఉష్ణోగ్రత (సె.డి) 2015 8 19.3 2014 30 16.8 2013 19 19.8 2012 12 17.2 2011 23 19.6 ఆల్‌టైమ్ రికార్డు: అక్టోబర్ 26, 1968: 11.7 -
లండన్ వాసులను వణికిస్తున్న గాలి కాలుష్యం
లండన్: వాయు కాలుష్యంతో లండన్ వాసులు ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. గాలి కాలుష్యానికి ఏటా లండన్ లో దాదాపు 9,500 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.. వాయు కాలుష్యంతో సంభవిస్తున్న మరణాలు గతం కంటే రెండితలు పెరగడం లండన్ వాసులను కలవరపెడుతోంది. గాలి కాలుష్యంతో లండన్ లో ఏడాదికి 4, 267 మంది చనిపోతున్నారని 2008లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గాలిలో ఎక్కువగా ఉంటున్న పీఎం2.5ఎస్, నెట్రోజన్ డయాక్సైడ్ పరమాణువులు కారణంగానే అకాల మరణాలు సంభవిస్తున్నాయని కింగ్స్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డీజిల్ కార్లు, ట్రక్కులు, బస్సులు విడుదల చేసే పొగలో అధికంగా ఉండే నెట్రోజన్ డయాక్సైడ్... ఊపిరితిత్తులు, పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. -
జూబ్లీహిల్స్, చార్మినార్‌లలో అమ్మోనియా అధికంగా నమోదు
సనత్‌నగర్, న్యూస్‌లైన్: నగర కాలుష్యంలో ‘అమ్మోనియా’ చేరడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డై ఆక్సైడ్స్, పీఎం 10 అత్యధిక మోతాదులో నమోదవుతూ వస్తుండగా... ఇప్పుడు అమ్మోనియా మోతాదు మించడం ఆందోళన కలిగిస్తోంది. మనిషి జీవక్రియకు కొంత మోతాదులో అమ్మోనియా అవసరమే. కానీ మోతాదు మించితే మానవ ఆరోగ్యం, మొక్కల ఎదుగుదలపై తీవ్ర దుష్ర్పభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వాతావరణంలో అమ్మోనియా మోతాదు వార్షిక సరాసరి క్యూబిక్ మీటర్‌కు 100 మైక్రోగ్రాములు (100 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు)గా ఉండాలి. కానీ నగరంలో అంతకుమించిన స్థాయిలో అమ్మోనియా వెలువడుతుందని, ఇది ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుంద ని పీసీబీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గత ఏడాది వార్షిక సరాసరిని పరిశీలిస్తే జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 123 మైక్రోగ్రాము/క్యూబిక్ మీటరు గా నమోదు కావడం విశేషం. ఆ తరువాత స్థానాల్లో చార్మినార్ 120, ఉప్పల్ 118గా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జూపార్కు, జీడిమెట్ల ప్రాంతాల్లో సైతం నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ స్థాయిలో అమ్మోనియా విడుదలైనట్లు పీసీబీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పెరుగుదలకు కారణాలివే... అమ్మోనియా ఉద్గారాలు పారిశ్రామికవాడల నుంచి అధికంగా విడుదలవుతున్నట్లు పీసీబీ గణాంకాలు తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, ప్లాస్టిక్, పేలుడు పదార్థాలు, వస్త్రాలు, కెమికల్, రంగులు తయారీ పరిశ్రమల్లో విచ్చలవిడిగా అమ్మోనియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఆయా ఉత్పత్తులు ఉత్పత్తి చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో అమ్మోనియా వాయువులు గాలిలోకి విడుదలవుతుంటాయి. ఒక్కోసారి అధిక వేడికి అమ్మోనియా కంటైనర్లు పేలిపోతుంటాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతంలో నివసించేవారి ఆరోగ్యంపై పెనుప్రభావం పడుతోంది. పాతకాలం నాటి రిఫ్రిజిరేటర్లు, ఐస్ తయారీ కేంద్రాలు, డ్రైక్లీనర్స్ ద్వారా అమ్మోనియా వెలువడుతుందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయా చోట్ల కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అమ్మోనియా ప్రమాణాలు పెరుగుతున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలే కారణం పరిశ్రమల ద్వారా అమ్మోనియా ఎక్కువగా విడుదలయ్యే అ వకాశం ఉంది. ఇది జనావాసాల్లో సైతం ఎక్కువగా ఉంటుం దంటే డ్రైక్లీనింగ్ల వాడకం అధికంగా ఉండడమో లేక సమీప పరిశ్రమల నుంచి విడుదలైన అమ్మోనియా ఆయా ప్రాంతాలకు వ్యాపించడమో జరగాలి. దీన్ని ఎక్కువ మోతాదులో పీలిస్తే శ్వాస తీసుకోవడం భారంగా ఉంటుంది. ఆక్సిజన్ సైతం సరైన మోతాదులో అందదు. - వీరన్న, పీసీబీ సైంటిస్ట్ ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అమ్మోనియా ఎక్కువగా పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో అమ్మోనియా శాతం ఎక్కువగా ఉంటే కళ్లు, గొంతు, చర్మం మంటలు వస్తాయి. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. - డాక్టర్ పద్మజ, అమీర్‌పేట్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారిణి మోతాదు మించితే దుష్ర్పభావాలెన్నో... నిర్దేశిత ప్రమాణాలకు మించి అదనంగా ఒక గ్రాము/క్యూబిక్ మీటరు విడుదలైనా ఇబ్బందే అధిక మోతాదులో అమ్మోనియాను పీలిస్తే శ్వాస భారమవుతుంది. చర్మం, కళ్లు మంటలు పుడతాయి. ముక్కు, గొంతు సమస్యలు ఉత్పన్నమవుతాయి. దేహంలోని మాంసకృత్తులను విచ్ఛిన్నం చేస్తాయి. అమ్మోనియా హైడ్రాక్సైడ్ మానవ శరీరంలోని కణజాలాన్ని నాశనం చేస్తుంది.అమ్మోనియాను ఎక్కువగా పీలిస్తే కడుపు మంట కూడా ఉంటుంది. మొక్కల ఎదుగుదలపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఇది గాలి కంటే బరువైంది. ఏ ప్రాంతంలోనైనా దీని ప్రభావం ఎక్కువసేపు ఉంటుంది. బరువుగా ఉంటున్నందున ఊపిరితిత్తులపై భారం అధికంగా ఉంటుంది. ఈ వాసన పీల్చిన వారిలో చిరాకు ఎక్కువగా ఉంటుంది.