నగరం ఉక్కిరిబిక్కిరి
శీతల గాలులకు తోడైన కాలుష్య ఉద్గారాలు
పంజా విసురుతున్న నైట్రోజన్ ఆక్సైడ్
వాతావరణంలో అనూహ్యంగా పెరుగుదల
తీవ్రమైన దగ్గు, ఆస్తమాతో నగరవాసుల సతమతం
అల్లాడుతున్న వృద్ధులు, చిన్నారులు, గ ర్భిణులు
ఘనపుమీటరు గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ 40 మైక్రో గ్రాములకు మించొద్దు
నగరంలో చాలాచోట్ల 100 మైక్రో గ్రాములపైనే..
సాక్షి, హైదరాబాద్: నగరవాసికి ‘చలి’ కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది! శీతల గాలుల్లో తేమ, నైట్రోజన్ ఆకై ్సడ్ మోతాదు పెరగడం.. దానికి కాలుష్య ఉద్గారాలు జతకావడంతో జనం దగ్గు, ఆస్తమా సమస్యలతో బాధపడుతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు 40 మైక్రో గ్రాములు మించొద్దు. కానీ పంజగుట్ట, అమీర్‌పేట్, అబిడ్‌స, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో 100 మైక్రో గ్రాములను మించుతోంది. ఆరోగ్యంపై తీవ్ర దుష్పభ్రావం చూపుతోంది.
అనూహ్య మార్పులు: భాగ్యనగరం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నారుు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమించడం, ఈశాన్య రుతుపవనాలు సమీపిస్తుండడంతో ఈశాన్య, ఉత్తర భారతదేశం నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగరంలో సోమవారం 17.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 48 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ 52 శాతానికి పడిపోవడంతో చలిగాలులు వణికిస్తున్నారుు. ఈ గాలులతో వాతావరణంలోని నైట్రోజన్ ఆక్సైడ్ కలసిపోతుండడంతో నగరవాసులు బ్రాంకై టిస్, ఆస్తమా, ఊపిరితిత్తుల పొరలు దెబ్బతినడం వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు. 2012 అక్టోబర్ 12న నగరంలో 17.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు అదే స్థారుులో(17.2) నమోదవుతుండడం గమనార్హం.
రోజుకు 40 టన్నులు!
రోజు సగటున వాతావరణంలో సుమారు 40 టన్నుల మేర నైట్రోజన్ ఆకై ్సడ్ కలుస్తున్నట్లు పీసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, కాలంచెల్లిన వాహనాలు వెదజల్లుతున్న పొగలో నైట్రోజన్ ఆకై ్సడ్ అధిక మోతాదులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉద్గారాలు శీతల గాలులతో కలవడంతో ఊపిరాడని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు. నగరంలో రోడ్లపైకి వస్తున్న సుమారు 46 లక్షల వాహనాల్లో 15 లక్షల వరకు పదిహేనేళ్లకు పైబడినవే. కాలంచెల్లిన ఈ వాహనాలను రోడ్డెక్కకుండా చేయడంలో ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు విఫలమవుతుండడంతో పరిస్థితి విషమిస్తోంది.
నైట్రోజన్ ఆక్సైడ్‌తో అనర్థాలివే
► ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఇబ్బందు లు పడుతున్నారు ఠి ఊపిరితిత్తుల పొరలు దెబ్బతింటున్నారుు ఠి వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తోంది. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తున్నా రుు. ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు
► ఆస్తమా కేసులు పెరుగుతున్నారుు
► జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు
► మొక్కల్లోనూ పెరుగుదల లోపిస్తోంది
అక్టోబర్‌లో గత ఐదేళ్లుగా నగరంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు
సంవత్సరం తేదీ కనిష్ట ఉష్ణోగ్రత (సె.డి)
2015 8 19.3
2014 30 16.8
2013 19 19.8
2012 12 17.2
2011 23 19.6
ఆల్‌టైమ్ రికార్డు: అక్టోబర్ 26, 1968: 11.7