లండన్ వాసులను వణికిస్తున్న గాలి కాలుష్యం
లండన్: వాయు కాలుష్యంతో లండన్ వాసులు ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. గాలి కాలుష్యానికి ఏటా లండన్ లో దాదాపు 9,500 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.. వాయు కాలుష్యంతో సంభవిస్తున్న మరణాలు గతం కంటే రెండితలు పెరగడం లండన్ వాసులను కలవరపెడుతోంది.
గాలి కాలుష్యంతో లండన్ లో ఏడాదికి 4, 267 మంది చనిపోతున్నారని 2008లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గాలిలో ఎక్కువగా ఉంటున్న పీఎం2.5ఎస్, నెట్రోజన్ డయాక్సైడ్ పరమాణువులు కారణంగానే అకాల మరణాలు సంభవిస్తున్నాయని కింగ్స్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డీజిల్ కార్లు, ట్రక్కులు, బస్సులు విడుదల చేసే పొగలో అధికంగా ఉండే నెట్రోజన్ డయాక్సైడ్... ఊపిరితిత్తులు, పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.