వాయుకాలుష్యంతో చిన్నారులకు ముప్పు
పరిపరి శోధన
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాయుకాలుష్యం వల్ల ఉబ్బసం సహా పలు శ్వాసకోశ వ్యాధులు వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, వాయుకాలుష్యం కారణంగా చిన్నారులకు మరింత ముప్పు ఉందని లండన్‌లోని క్వీన్ మేరీ కాలేజ్ పరిశోధకులు హెచ్చరిస్తు న్నారు.
వాయుకాలుష్యానికి కారణమవుతున్న నైట్రోజన్ డయాక్సైడ్, ధూళి కణాలు, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వంటి వాటి వల్ల చిన్నారులకు ఉబ్బసం వంటి ఇబ్బందులు తలెత్తడం మాత్రమే కాకుండా, మెదడు కణాలు దెబ్బతిని వారి అధ్యయన సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.