
సాక్షి, హైదరాబాద్: దేశంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయట.. అవి పెరిగాయంటే అర్థం.. వాయు కాలుష్యం కూడా బాగా పెరిగినట్లే.. ఎందుకంటే.. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి బంధం ఫెవికాల్ అంత గట్టిది. మన నగరం పరిస్థితీ ఇంతే.. ఈ కాలుష్యం వల్ల ఆస్తమా, సైనస్, బ్రాంకెటీస్ వంటి వ్యాధులతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పరిమితికి మించిన కాలుష్యం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలు ఇలాంటి కారణాలు అనేకం. అసలు కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) ప్రమాణాల ప్రకారం పరిమితి ఎంత ఉండాలి.. నగరంలో వాయు కాలుష్యం ఎంత ఉంది అన్నది తెలియాలా.. ఓసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి..