Respiratory diseases
-
అమ్మో.. ప్లాస్టిక్ భూతం!
సాక్షి, అమరావతి: భారత్‌ను ప్లాస్టిక్ భూతం భయపెడు తోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతోంది. నేచర్ జర్నల్‌లో ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయ (ఇంగ్లడ్) బృందం అధ్యయనం ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనాను దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో 2 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 5.21 కోట్ల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ కాకపోవడంతో ఎక్కువ భాగం పర్యావరణంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నట్టు నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు ఐదో వంతు (18 శాతం) భారత్ నుంచే వస్తుండటం గమనార్హం.ఈ క్రమంలోనే చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అక్కడి రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ప్లాస్టిక్ ఉద్గారాల్లో పోటీపడుతున్నాయి. యూకే మాత్రం 4 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 135వ ర్యాంకు పొందింది.ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు (లక్షల టన్నుల్లో)ఆరోగ్యానికి ముప్పుప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకాలకు కారణం అవుతోంది. జనాభా పెరుగుదలకు తోడు ఆదాయ వనరులు పెరగడంతో విలాసాల జీవితం దగ్గరవుతోంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటకొస్తున్నాయి. దీంతో దేశంలో వ్యర్థాల నిర్వహణను చేపట్టడం సవాల్‌గా మారింది. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇక్కడ సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.అయితే, దేశంలో 95 శాతం వ్యర్థాలను సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, విచ్చలవిడిగా తగలబెడుతున్న వ్యర్థాలు, అనధికారికి రీసైక్లింగ్‌లోని వ్యర్థాలను లెక్కించడం లేదని అధ్యయనం పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్లాస్టిక్‌ను బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. 20 దేశాల నుంచే 69 శాతం వ్యర్థాలుప్రపంచంలో 69 శాతం వ్యర్థాలు 20 దేశాల నుంచే వస్తున్నట్టు అధ్యయనం నమోదు చేసింది. ఇందులో 4 తక్కువ ఆదాయ, 9 తక్కువ మధ్య ఆదాయ, 7 ఉన్నత మధ్య ఆదాయ దేశాలున్నాయి. అధికాదాయ దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రపంచంలో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్‌లో దాదాపు 43 శాతం చెత్తగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. అయితే.. అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంటే.. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేస్తున్న వ్యవర్థాలు తక్కువగా ఉండటంతో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో ఉంది. -
నుమోనియా కేసుల వ్యాప్తిపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: చైనాలో ఇటీవల నమోదైన శ్వాససంబంధ అనారోగ్య కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిన్నపిల్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఈ నుమోనియా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన ఆ దేశ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.‘దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో నుమోనియా కేసులు రావడం ఒక్కసారిగా తగ్గిపోయింది’అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చీఫ్ మీ ఫెంగ్ మీడియాకు తెలిపారు. నుమోనియా కేసుల నమోదు ఒక్కసారిగా పడిపోయిందని చైనా వెల్లడించడకంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కొవిడ్ భయాలు ఇంకా తొలగిపోని నేపథ్యంలో చైనాలో శ్వాససంబంధిత అనారోగ్య కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు రావడంతో అన్ని దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. భారత్‌లోనూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో నుమోనియా తరహా శ్వాసకోశ అనారోగ్య కేసుల నమోదు ఒక్కసారిగా పెరుగుతోందని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చైనా తెలిపింది. అయితే కేసుల నమోదుకు కొత్త వైరస్ కారణం కాదని వెల్లడించింది.కేసుల వ్యాప్తి వేగంగా ఉండటానికి కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడమే కారణమని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఇదీచదవండి..దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్ -
తెలంగాణపై ఆర్ఎస్వీ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన రెస్పిరేటరీ సింకీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రులు, ఇతర సాధారణ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ వ్యాధుల్లో ఆర్ఎస్వీ ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు వారా లుగా వైరల్ న్యుమోనియా కేసులు పెరుగుతున్నా యి. జలుబు కాస్తా న్యుమోనియాగా దారితీస్తుంది. దమ్ము కూడా వస్తుంది. 5 ఏళ్లలోపు... 60 ఏళ్లు పైబడిన లేదా దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఇతర వయసువారిపైనా ప్రతాపం చూపిస్తోంది. జ్వరం, జలుబు, కఫంతో కూడిన తీవ్రమైన దగ్గు, నిమ్ము, బలహీనత రెండు వారాల వరకు ఉంటుంది. చిన్న పిల్లల్లో ఐసీయూకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దగ్గు వచ్చిన మొదట్లోనే అప్రమత్తం కావాలని, చిన్నపిల్లలు మూడు నాలుగు రోజుల తర్వాత అది నిమ్ము దశకు చేరుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌వీలో ఏ, బీ అనే రెండు రకాలున్నాయి. ఇప్పటివరకు ఇండియా 587 ఏ రకం వైరస్, 344 బీ రకం వైరస్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. ఏడాదికి సగటున దేశంలో 3.31 కోట్ల చిన్నారులపై వైరస్ పంజా... ప్రతీ ఏడాది భారత్‌లో సగటున 3.31 కోట్ల మంది చిన్నారులు ఆర్ఎస్వీ బారిన పడుతున్నారు. వారిలో 10 శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏడాదికి ఈ వైరస్ వల్ల దేశంలో 59,600 మంది చనిపోతున్నారు. రెండేళ్లు నిండిన ప్రతి చిన్నారి ఒక్కసారైనా ఈ వైరస్ బారినపడతారు. ఈ సంవత్సరం దాని ప్రభావం మరింత పెరిగింది. ఐదు వారాల క్రితం వరకు ఈ వైరస్ పాజిటివిటీ రేటు 5 శాతంలోపుగా ఉంటే, ప్రస్తుతం 10 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్ డ్యాష్‌బోర్డ్ ప్రకారం వైరల్ కేసుల్లో 15 శాతం ఆర్ఎస్వీ కేసులే. -
సుందర దేశంలో విషపుగాలి! బయటకు రావాలంటే జంకుతున్న జనం!
ప్రకృతి రమణీయత ఉట్టిపడే అందమైన దేశం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్‌లాండ్‌ను వాయు కాలుష్యం ముంచెత్తుతోంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోతుండడంతో జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలియజేసే యాప్‌లను జనం ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. యాప్ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకుంటున్నారు. ఎర్ర మార్క్ కనిపిస్తే ఇంట్లో ఉండిపోవాల్సిందే. ఉదయం పూట వ్యాయామం చేయాలన్నా బయటకు వెళ్లలేని పరిస్థితి. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కాలుష్యం బెడద మరింత తీవ్రంగా ఉండడం కలవరం సృష్టిస్తోంది ఎయిర్ పొల్యూషన్ దెబ్బకు టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. ఎందుకీ తీవ్ర కాలుష్యం? థాయ్‌లాండ్‌లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ప్రభుత్వం తరచుగా కాలుష్య హెచ్చరికలు జారీ చేయడం సాధారణమే. అయితే, ఈసారి మాత్రం కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. ఉత్తర థాయ్‌లాండ్‌లో రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తుంటారు. మూడు నెలల పాటు ఈ సీజన్ కొనసాగుతుంది. ఈ సమయంలో తీవ్ర కాలుష్యం ఉత్పన్నమవుతుంది. ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి రేణువులు వెలువడుతాయి. విషపూరిత కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. పంట వ్యర్థాల దహనం కారణంగా రైతులు శ్వాస సంబంధిత వ్యాధుల బారినపడుతున్నట్లు, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని థాయ్‌లాండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ పరిశోధకుడు కనికా థాంపానిష్వోంగ్ చెప్పారు. దేశంలో 2021లో వాయు కాలుష్యం వల్ల 29,000 మంది మరణించారని అంచనా. ఇక రాజధాని బ్యాంకాక్‌లో తీవ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ సమస్య వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. చలికాలం కావడంతో పరిస్థితి భీతావహంగా మారుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించిన దానికంటే థాయ్‌లాండ్ ప్రజలు సగటున నాలుగు రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలను(పీఎం 2.5) పీలుస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాలుష్యం వల్ల దేశంలో ప్రజల జీవిత కాలం సగటున రెండేళ్లు తగ్గినట్లు థాయ్‌లాండ్ ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’అంచనా వేసింది. వేధిస్తున్న నిధుల కొరత మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంపై థాయ్‌లాండ్ సర్కారు దృష్టిపెట్టింది. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, పరిశోధనా కేంద్రాలతో కలిపి పనిచేస్తోంది. కాలుష్య నియంత్రణ కోసం కొత్త కొత్త విధానాలు రూపొందిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల అవి ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ పాలసీల అమలుకు బడ్జెట్లో ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడం పెద్ద అవాంతరంగా మారింది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం ప్రజల హక్కు, ఆ హక్కును కాపాడడంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ గ్రీన్‌పీస్ థాయ్‌లాండ్, ఎన్విరాన్మెంటల్ లా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు గత ఏడాది మార్చి నెలలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ‘క్లీన్ ఎయిర్ బిల్లు’ను ఆమోదించాలంటూ థాయ్‌లాండ్ క్లీన్ ఎయిర్ నెట్వర్క్ అనే మరో సంస్థ పోరాడుతోంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. కాలుష్యానికి కారణమయ్యే వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించవచ్చు. మరోవైపు పంట వ్యర్థాలను దహనం చేయకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. 14.49 లక్షల మంది బాధితులు థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. కాలుష్యం వల్ల దేశంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా 14,49,716 మంది అస్వస్థతకు గురయ్యారు. రాజధాని బ్యాంకాక్‌లో 31,695 మంది అనారోగ్యం బారినపడ్డారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులకు గురయ్యారు. బాధితుల్లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, నిమోనియా, బ్రాంకైటీస్, ఆస్తమా, ఇన్‌ఫ్లూయెంజా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు కనిపించాయి. బ్యాంకాక్‌లో తాజాగా 50కిపైగా ప్రాంతాల్లో పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్‌కు 51 నుంచి 78 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిందని కాలుష్య నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పిన్సాక్ సురాస్వాడీ చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ప్రజలు ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలని థాయ్ ఎయిర్ క్వాలిటీ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రఫాన్ సూచించారు. కాలుష్యం తీవ్రత తగ్గుముఖం పట్టకపోతే ఇళ్ల నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచిస్తామని థాయ్‌లాండ్ మంత్రి అనుపోంగ్ పావోజిండా చెప్పారు. బ్యాంకాక్‌లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యశాలలు ► కాలుష్యం, తద్వారా అనారోగ్య సమస్యలు పెరిగిపోతుండడంతో థాయ్‌లాండ్ ప్రజారోగ్య శాఖ ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేసింది ► కాలుష్యం బారినపడిన వారిలో శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దుర్లు, గుండె సంబంధిత వ్యాధులు తలెత్తున్నాయి. ► బాధితులకు చికిత్స అందించడానికి దేశవ్యాప్తంగా 66 ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ► వాయు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధులు, నివారణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయా లని బ్యాంకాక్‌లోని 22 ప్రధాన ఆసుపత్రులకు వ్యాధుల నియంత్రణ విభాగం సూచించింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
పిల్లల పాలిట శాపంగా మారిన గ్యాస్ స్టవ్‌లు.. బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజారోగ్యం దృష్ట్యా గ్యాస్ స్టవ్‌ల వినియోగంపై బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గ్యాస్ స్టవ్‌ల నుంచి వెలువడే కాలుష్య కారకాలతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని నివేదికలు చెప్తున్న నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం వాటిపై నిషేధానికి సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా 40 శాతానికిపైగా వీటిని వినియోగిస్తున్నారు. మిగతావారు విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. (చదవండి: Video: బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. 5 గంటలు శ్రమించి..) గ్యాస్ స్టవ్‌లు వినియోగించినప్పుడు ప్రమాదకర నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పార్టికల్స్ విడుదలవుతున్నాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడైందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇవి శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్లను కలిగిస్తాయని తెలిపింది. చిన్నపిల్లల ఆస్తమా కేసుల్లో దాదాపు 12 శాతం గ్యాస్ స్టవ్‌ల వాటా ఉందని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు చేసింది. గ్యాస్ స్టవ్‌ను ఆఫ్ చేసినప్పటికీ వెలువడే మీథేన్ లీకేజీలు పర్యావరణానికి కీడు చేస్తాయని ఇప్పటివరకు పలు నివేదికలు వెల్లడించగా తాజాగా వాటి వినియోగం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలియడం గమనార్హం. దేశవ్యాప్తంగా గ్యాస్ స్టవ్‌ల వినియోగంపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. (చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన) -
కనిపించని శత్రువు.. ముందే గుర్తిస్తే మందులతో నయం!
ఎలా సోకుతుంది....? వంశపారంపర్యంగా... దుమ్ము,ధూళిలో ఎక్కువగా ఉండేవారికి పని ప్రదేశాలలో శుభ్రత లేకపోతే ఎలర్జీ, జీవన విధానం లక్షణాలు శరీరంలో గాలిగొట్టాలు ముడుచుకుపోవడం పిల్లికూతలు ఊపిరి ఆడనంతగా ఆయాసం ఎడతెరపిలేకుండా దగ్గు రావడం పెదవాల్తేరు (విశాఖతూర్పు): ప్రపంచంలో పూర్తిగా నయమయ్యే వ్యాధులలో ఆస్తమా ఒకటి. చైనాలో క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గు, ఆయాసంతో బాధపడడంతో తరువాతి కాలంలో ఇది ఆస్తమా అని వైద్యనిపుణులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇచ్చిన పిలుపు మేరకు 1993 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏటా మే 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో దాదాపుగా 500 మంది ఆస్తమా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్యశాఖ ఆస్తమా దినోత్సవాన్ని ‘క్లోజింగ్ గేప్స్ ఇన్ ఆస్తమా కేర్’ నినాదంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఆస్తమా వ్యాధి సాధారణంగా రెండేళ్ల వయసు నుంచి 78 సంవత్సరాల వయసు గల వ్యక్తులలో కనిపిస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం వుంటే వెంటనే పల్మనాలజిస్టును సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో 10 నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో మొత్తం 288 పడకలు వుండగా, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నలుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్, పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 45మంది పీజీలు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి గిరిజనులకు ఎక్కువగా సోకుతుండడం విచారకరం. చికిత్స ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండునుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్హేలర్, కొన్నిరకాల మాత్రలు వాడాల్సి వుంటుంది. ఆస్తమా సోకితే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్ ఆర్గానిక్స్, కిడ్నీపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా వుంటుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్హీలర్థెరపీ, నిబ్యులైజేషన్ చికిత్సలతో రోగులకు ఇట్టే నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలనుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉండడం విశేషం. చాలాకాలంగా ఆస్తమా రోగుల్లో మరణాలు నమోదు కాకపోవడం సంతోషకరం. ఓపీలో సేవలు స్థానిక ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో రోజూ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గతనెలనుంచి ఛాతీ ఆస్పత్రిలో మళ్లీ సాధారణ వైద్యసేవలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఓపీ విభాగంలో రోజూ 120 మంది వరకు రోగులు వైద్యం పొందుతున్నారు. అవగాహన సదస్సు ప్రపంచ ఆస్తమా దినోత్సవం పురస్కరించుకుని ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి అవగాహన సదస్సు జరుగింది. వైద్యనిపుణులు ఆస్తమాపై అవగాహన కల్పించి, రోగుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఎయిర్‌కూలర్లు, ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆస్తమాని త్వరగా గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం అవుతుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుల సూచనలతో ఆధునిక చికిత్స చేస్తున్నాం. –డాక్టర్ ఆర్.సునీల్‌కుమార్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, చినవాల్తేరు -
99 శాతం ప్రజలు పీల్చేది కలుషిత గాలే!
జెనీవా: ప్రపంచంలోని 99 శాతం జనాభా కలుషిత గాలి పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు జనాభా మొత్తం ప్రమాణాలకు తగినట్లుగా లేని గాలినే పీలుస్తున్నారని, దీన్ని నివారించాలంటే వెంటనే శిలాజ ఇంధన వాడకాన్ని తగ్గించాలని సూచించింది. ఈ ఇంధన వాడకాలతో వాయుకాలుష్యం ఏర్పడుతోందని, దీనివల్ల రక్త సంబంధ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు ప్రబలి ఏటా 70 లక్షల మరణాలు జరుగుతున్నాయని తెలిపింది. గాల్లో పీఎం 2.5, పీఎం10 అనే పర్టిక్యులేట్ మేటర్‌ను ఆధారంగా చేసుకొని వాయునాణ్యతను సంస్థ నిర్ధారిస్తుంది. భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్షణమే కర్బన ఉద్గారాల స్థాయిల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని, పర్యావరణహిత ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలంది. -
ఊపిరి ఆడట్లేదు!
ఈ ఏడాది ఇప్పటివరకు 1,712 డెంగీ కేసులు, 694 మలేరియా కేసులు నమోదయ్యాయి. అలాగే 252 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. న్యుమోనియా కేసులు 1,239, స్వైన్‌ఫ్లూ కేసులు 550 నమోదయ్యాయి. టైఫాయిడ్ జ్వరాలు వచ్చినవారు 8,206 ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 4,230 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. ఇవిగాక ఈ ఏడాది ఇప్పటివరకు 1,14,167 డయేరియా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 13,483 డయేరియా కేసులు వచ్చాయి. హైదరాబాద్‌లో వరదలు వచ్చినందున డయేరియా కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11,599 కేసులు, ఖమ్మంలో 6,365 కేసులు నమోదయ్యాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 2,02,001 మందికి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీరు సరిగా ఊపిరి తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారికి కరోనా ప్రమాదం కూడా ఎక్కువే. పైగా ఇప్పుడు చలికాలం ప్రారంభం కానుంది. ఈ కాలంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు నమోదైన తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 49,182 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలో 13,851, భూపాలపల్లి జిల్లాలో 13,602, ఆదిలాబాద్‌లో 11,817, నిజామాబాద్ జిల్లాలో 10,553 కేసులు నమోదయ్యాయి. లక్ష మందికి జ్వరాలు... తీవ్రమైన వర్షాలు కురిసి ఆగిపోవడంతో జ్వరం, అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంది. కరోనాతో పాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు కలిసి వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,02,452 జ్వరం కేసులు నమోదయ్యాయి. వీటిని కారణాలు గుర్తించని జ్వరాలుగా పేర్కొంది. ఇక కరోనా అనుమానంతో వచ్చిన జ్వరం కేసులు 45,102 ఉంటాయని అంచనా వేశారు. మొత్తంగా చూసుకుంటే సాధారణ జ్వరాలు, కరోనా పాజిటివ్ వచ్చినవారిలో జ్వరాలు, నిర్దారణ పరీక్షల సందర్భంగా నెగెటివ్ వచ్చినవారికి జ్వరాలను కలుపుకుంటే దాదాపు 2 లక్షల జ్వరం కేసులు నమోదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఒక్క నెలలోనే 15,201 జ్వరం కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా చేస్తే సరి... ♦ఇన్‌ఫ్లూయెంజా టీకాలు వేయించుకోవాలి ♦శీతాకాలం సమీపిస్తున్నందున ఫ్లూ కేసులు పెరుగుతాయి. కోవిడ్‌తో కలిపి ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ♦కోవిడ్ ఉన్నవారికి ఇతర అంటు వ్యాధులూ వస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా, ప్యుడోమోనాస్ ఏరో జినోసా, హిమోఫిలస్ ఇన్ఫ్లూ యెంజా, క్లేబ్సిఎల్లా న్యుమోనియా వంటివి సాధారణంగా వచ్చే వ్యాధులు. ♦డెంగీ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధులకు వైద్యం చేయడంతోపాటు కోవిడ్ కేసులను పర్యవేక్షణను అవసరమైన వైద్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. ♦భౌతికదూరం, చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్‌లు తప్పనిసరి. ♦డెంగీ, మలేరియా, చికున్‌గున్యాలను నియంత్రించడానికి దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలి. ♦కాలానుగుణ ఇన్‌ఫ్లూయెంజా టీకాలు వేయడంలో వేగం పెంచాలి. -
‘శ్వాస’ వ్యవస్థ బాగుంటే వైరస్ భయం లేనట్టే!
‘శ్వాసనాళ, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇప్పటికే బాధపడుతున్న వారు తాము వాడుతున్న మందులను కొనసాగించాలి. ఆస్తమా, సీఓపీడీ, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలుంటే కరోనాకు గురయ్యే అవకాశాలెక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఇవి రాకుండా చూసుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే వైరస్ వ్యాపించదనేది అపోహ మాత్రమే. కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మరో ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించడమొక్కటే మార్గం’అని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీకే పరంజ్యోతి సూచించారు. శ్వాసనాళ, శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్సపొందేవారు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వివరాలు డాక్టర్ మాటల్లోనే.. స్టెరాయిడ్ ఇన్హేలర్ను వాడండి ఆస్తమా రోగులు స్టెరాయిడ్ ఇన్హేలర్ను వాడుతూనే ఉండాలి. దీని వాడకం కరోనాను కొంతమేర నిరోధిస్తుందని చైనీయుల అనుభవాలు చెబుతున్నాయి. లేదంటే ఆస్తమా ముదిరి కరోనా లక్షణాలు పెరగొచ్చు. ఆస్తమా రోగులు కరోనా ద్వారా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారనే దానికి ఎలాంటి ఆధారాల్లేవు. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలామందికి గతంలో ఎలాంటి శ్వాస సంబ«ంధ సమస్యలు లేవు. ఆస్తమాతో బాధపడుతూ కరోనా బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు స్వల్పంగానే ఉన్నా, చికిత్స తర్వాత వీరు రికవరీ అవుతున్నట్టే నివేదికలు చెబుతున్నాయి. కరోనాకు భయపడి ఆస్తమా కోసం తీసుకుంటున్న చికిత్సను అశ్రద్ద చేయొద్దు. హృద్రోగ, శ్వాసకోశ వ్యాధులతో జాగ్రత్త కరోనా బారినపడిన చాలామందిలో కొద్దిగా అస్వస్థతతో పాటు జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్ర హృద్రోగ, శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వారిపై కరోనా ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిపై ఇది ప్రభావం చూపుతుంది. శ్వాసనాళం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. శ్వాసనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఊపిరితిత్తుల నుంచి తెమడను బయటకు పంపి కరోనా బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది. ఒకవేళ దగ్గు, జ్వరం వచ్చినా శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా పెట్టుకోవడంతో పాటు, జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వాడాలి. బ్రాంకియెక్టసిస్ (శ్వాసనాళం, దాని శాఖలు ఉబ్బడం) తీవ్రంగా ఉన్నా, దీర్ఘకాలంగా ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నా, శ్వాససంబంధ సమస్యలకు దీర్ఘకాలంగా యాంటీ బయోటిక్స్ వాడుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి సామాజిక దూరం పాటిస్తూ, కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. వైరస్‌ను తట్టుకోలేని ‘సీఓపీడీ’ ఎంఫిసిమా, క్రానిక్ బ్రాంకైటిస్ తదితర ఊపిరితిత్తుల సమస్యలు సీఓపీడీ (శ్వాస మార్గం మూసుకుపోయి ఊపిరి తీసుకోలేకపోవడం)కి దారితీస్తాయి. సీఓపీడీతో బాధపడుతున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. వీరి ఊపిరితిత్తులు కొంతమేర దెబ్బతిని ఉంటాయి కాబట్టి కరోనా వైరస్‌ను తట్టుకునే శక్తి తక్కువుంటుంది. వాస్తవానికి కరోనా బారినపడే వారిలో సుమారు 50 శాతం మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. కొందరిలో స్పల్పంగా జలుబు, ముక్కు కారడం, కండరాల నొప్పి, జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటాయి. మరికొందరిలో ‘ఫ్లూ’తరహాలో జలుబు, కండరాల నొప్పి, అలసట ఉంటుంది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండే వారిలో న్యూమోనియా, శ్వాస ఆడకపోవడం, దగ్గు అదనపు లక్షణాలుగా ఉంటాయి. సీఓపీడీ రోగులకు ఊపిరితిత్తులతో సమస్య మొదలై కరోనా బారినపడితే ఊపిరాడని పరిస్థితికి చేరుకుంటారు. అయితే చాలామంది సీఓపీడీ రోగుల్లో కరోనా సోకినా లక్షణాలు బయట పడకుండానే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఆ ఔషధాలు వాడే వారిలో రిస్క్ ఎక్కువ గతంలో ఏవైనా ఇతర వ్యాధుల బారిన పడ్డవారికి కరోనా సోకే అవకాశాలెక్కువనేది నిజం కాదు. అయితే హృద్రోగ, శ్వాస సంబంధ, డయాబెటిస్ లేదా రోగ నిరోధకశక్తిని తగ్గించే ఔషధాలు వాడే వారిలో కరోనా రిస్క్ ఎక్కువ. ఇతరులతో పోలిస్తే టీబీ వ్యాధిగ్రస్తులు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు ఒకవేళ కరోనా బారినపడినా లక్షణాలు కొద్దిగా బయటపడవచ్చు లేదా అసలు కనిపించకపోవచ్చు. టీబీ చికిత్స తీసుకుంటున్న వారు వైద్యుల సూచనతో మందులు వాడుతూ సామాజిక దూరం పాటించాలి. గతంలో ఊపిరితిత్తుల్లో కొంత భాగం తొలగించినా, ఊపిరితిత్తులు చిన్నవి (స్కోలియోసిస్)గా ఉన్నా కరోనా సోకుతుందనేది అపోహ మాత్రమే. న్యూమోథొరాక్స్‌తో భయం లేదు ఇతర అనారోగ్యంతో బాధపడేవారు లేదా ఆరోగ్యవంతుల్లోనూ న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల ఛాతీ గోడ నడుమ గ్యాస్) సంభవించినా కరోనా ప్రమాదం అంతగా ఉండకపోవచ్చు. అయితే న్యూమోథొరాక్స్‌తో పాటు సీఓపీడీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇతర ఊపిరితిత్తి సంబంధ సమస్యలు రిస్క్‌ను పెంచే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా న్యూమోథొరాక్స్ సంభవించడం అనేది చాలా అరుదు. గతంలో ఈ వ్యాధికి గురై కోలుకున్న వారు ఇతరుల కంటే కరోనా ప్రభావానికి ఎక్కువ గురవుతారనే దానికి దాఖలాల్లేవు. కరోనా బారినపడే వారిలో కొద్దిమందిలో మాత్రమే పల్మనరీ పైబ్రోసిస్ (ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం) సంభవిస్తుంది. దీనినెలా నివారించాలనే దానిపై పరిశోధనలు జరగాలి. ముందు జాగ్రత్తలే మందు కరోనాను అరికట్టేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వ్యాక్సిన్ ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రావచ్చు. కరోనా కట్టడికి ఇప్పటివరకు ప్రత్యేక చికిత్సంటూ ఏమీలేదు. విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, జింక్ ప్రొటెక్టివ్ సప్లిమెంట్లు తీసుకోవాలి. కరోనా గాలి ద్వారా వ్యాపించదు. దగ్గు, తుమ్ముల నుంచి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. బయటకు వెళ్లేటపుడు మాస్కులు ధరించాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సంబంధిత మందులను యథావిధిగా వాడాలి. ‘కరోనా’ అనుమానాలు ఉంటే వైద్యులను సంప్ర దించాలి. -
ఒకవైపు ధూళి.. మరోవైపు పొగ..
సాక్షి, హైదరాబాద్: దేశంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయట.. అవి పెరిగాయంటే అర్థం.. వాయు కాలుష్యం కూడా బాగా పెరిగినట్లే.. ఎందుకంటే.. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి బంధం ఫెవికాల్ అంత గట్టిది. మన నగరం పరిస్థితీ ఇంతే.. ఈ కాలుష్యం వల్ల ఆస్తమా, సైనస్, బ్రాంకెటీస్ వంటి వ్యాధులతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిమితికి మించిన కాలుష్యం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలు ఇలాంటి కారణాలు అనేకం. అసలు కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) ప్రమాణాల ప్రకారం పరిమితి ఎంత ఉండాలి.. నగరంలో వాయు కాలుష్యం ఎంత ఉంది అన్నది తెలియాలా.. ఓసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. -
మొగ్గలోనే తుంచేద్దాం
అరె... చాలా బాగుండేవాడే అని ఆ తర్వాత అనుకుని ప్రయోజనం లేదు.అలాంటి సింప్టమ్స్ ఏవీ కనిపించలేదండీ అని అనుకున్నా లాభం లేదు.ముందే తెలిసుంటే బాగుండేది అని ఆ తర్వాత పశ్చాత్తాపం పడితే ఏంటి ప్రయోజనం?డిప్రెషన్ అనేది ఉంది.అది ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది... భారతదేశాన్ని మరింతగా! కనిపెడదాం. నయం చేసుకుందాం.మైల్డ్ మాడరేట్ దశలో... అంటే... మొగ్గలోనే తుంచేద్దాం డిప్రెషన్ నుంచి విముక్తం అవుదాం! ఒంటరిగా జీవించాల్సి రావడం, విడాకులు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉండటం, తల్లి/తండ్రిని లేదా బాగా ప్రేమిస్తున్న వారిని కోల్పోవడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం వంటివి కూడా సివియర్ డిప్రెషన్‌కు కారణమవుతాయి. ప్రపంచంలో డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే అత్యధికం అని మీకు తెలుసా? మన దగ్గర ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక స్థాయి డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు మీకు అవగాహన ఉందా?భౌతికపరమైన వ్యాధులకు సింప్టమ్స్ కనిపిస్తాయి. కాని డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులకు ఎంతో అప్రమత్తంగా గమనిస్తే తప్ప ఆ వ్యాధి మనకు ఉన్నట్టు తెలియదు. గత వారం ఆత్మహత్యలకు కూడా పురిగొల్పే తీవ్రస్థాయి డిప్రెషన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్వల్పమైన (మైల్డ్), ఒక మోస్తరు (మాడరేట్) స్థాయి డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. భారంగా పరిణమించే ఐదో అతిపెద్ద వ్యాధి ఇది... ప్రపంచంలో అత్యధికుల్ని బాధిస్తున్న మొదటి ఐదు వ్యాధులను లెక్కవేస్తే డిప్రెషన్ ఆ వరుసలో ఐదవ స్థానంలో ఉంది (మొదటి నాలుగు – శ్వాసకోశ వ్యాధులు, హెచ్ఐవీ–ఎయిడ్స్, కాన్పు సమయంలో కలిగే సమస్యలు, నీళ్ల విరేచనాలు). అంటే ఇది ఎంత ముఖ్యంగా పట్టించుకోవాల్సిన వ్యాధో మనకు అర్థమవుతోంది. 2020 నాటికి అన్ని వ్యాధులను అధిగమించి ఇది కనీసం రెండో స్థానానికి చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తున్నదంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది చాలా మానసిక వ్యాధులతో బాధపడుతుంటారు. కాని ఎక్కువమందిని బాధిస్తున్న మానసిక వ్యాధులలో మొదటి స్థానంలో ఉన్నది మాత్రం నిస్సందేహంగా డిప్రెషనే. దిగులుగా మారకండి... డిప్రెషన్‌కు లోనుకాకండి... జీవితం అంటేనే సవాళ్ల మయం. అవి ఎదురైనప్పుడు స్వీకరించి పోరాడాలి కాని డిప్రెషన్‌కు లోను కాకూడదని మానసిక వ్యాధి నిపుణులు అంటున్నారు. మైల్డ్ లేదా మాడరేట్ డిప్రెషన్‌కు మొదటి కారణాలు సాధారణంగా ఆశాభంగాలు అని చెప్పవచ్చు. పరీక్షలో మంచి ఫలితాలు రాకపోవడం, ఇంటర్వ్యూ తర్వాత ఉద్యోగం రాకపోవడం, లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అవతలి వారు కాదనడం వంటి అంశాల్లో ఆశాభంగం ఎదురవుతుంది. దాంతో డిప్రెషన్‌కు వెళ్తారు. అదే పెరిగి పెద్దదై సివియర్ డిప్రెషన్‌గా మారవచ్చు. ఒంటరిగా జీవించాల్సి రావడం, విడాకులు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉండటం, తల్లి/తండ్రిని లేదా బాగా ప్రేమిస్తున్న వారిని కోల్పోవడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం వంటివి సివియర్ డిప్రెషన్‌కు కారణమవుతాయి. ఇటీవల టీవీ రంలో ఉన్నవారు తమ షోల టెలికాస్ట్, రేటింగ్‌ల వంటి వాటి విషయంలో కూడా డిప్రెషన్లోకి వెళుతున్నారనడానికి ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ఉదంతం ఒక ఉదాహరణ. శరీరంలో ఉండే కెమికల్ ఇన్బేలెన్స్ డిప్రెషన్‌కు లోపలి కారణమైతే ఈ బాహ్యపరిస్థితులు మరో కారణం. కనుక ఈ లోపలి, బయటి విషయలాను సమన్వయం చేసుకుంటూ సమర్థంగా డిప్రెషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘ట్రీట్మెంట్ గ్యాప్’ చాలా ఎక్కువ... మైల్డ్ లేదా ఒక మోస్తరు (మాడరేట్) డిప్రెషన్ వ్యాధి గ్రస్తులలో దాదాపు 50 శాతం మందికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియదు. అలాంటప్పుడు వారు డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకునే అవకాశమే ఉండదు. ఇక మిగతా 50 శాతం మంది డాక్టరును కలిసినా వారు తాము ఎదుర్కొంటున్న శారీరక లక్షణాలను డాక్టర్లకు వివరిస్తారు. దాంతో డాక్టర్లు రోగులు పేర్కొన్న శారీరక లక్షణాలకు మాత్రమే వైద్యం చేస్తారు. ఎప్పటికీ నయం కానప్పుడు ఆ డాక్టర్లు తమ రోగుల్లో దాదాపు సగం మందిని మాత్రమే సైకియాట్రిస్ట్ దగ్గరకు పంపుతారు. అంటే ప్రస్తుతం కేవలం 25 శాతం మంది మాత్రమే డిప్రెషన్కోసం సైకియాట్రిస్ట్‌లను కలుస్తున్నారన్నమాట. అందులో దాదాపు సగం మంది... అంటే 12 శాతం మాత్రమే సైకియాట్రిస్ట్ చెప్పినట్లుగా పూర్తి కాల చికిత్స తీసుకుంటూ ఉంటారు. అందునా ఇక ఇప్పుడు పూర్తి సైకియాట్రీ చికిత్స అంది నయమయ్యే వారు కేవలం 5 నుంచి 8 శాతం మంది మాత్రమే. అంటే వంద మందిలో కేవలం ఐదుగురి నుంచి ఎనిమిది మందికి మాత్రమే డిప్రెషన్ తగ్గించగలుగుతున్నారు. దీన్నే ‘ట్రీట్మెంట్ గ్యాప్’ అని డాక్టర్లు వ్యవహరిస్తుంటారు. ఇదంతా అవగాహన లేమి వల్ల జరిగే ప్రక్రియ. కాబట్టి తగిన మందులు తీసుకుంటే ఈ కొద్ది మందికి మాత్రమేగాక... అందరికీ డిప్రెషన్ తగ్గుతుంది. అలా జరగాలంటే ‘ట్రీట్మెంట్ గ్యాప్’ ఉండకూడదనేది సైకియాట్రిస్ట్‌లు చెబుతున్న మాట. డిప్రెషన్ కారణంగా జరిగే ప్రతి ఆత్మహత్యనూ నివారించవచ్చనే మరో మాటనూ వారు నమ్మకంగా చెబుతున్నారు. డిప్రెషన్ చికిత్స : మందులు, సైకోథెరపీ వంటి ప్రక్రియలు, మరికొన్ని ఆధునిక చికిత్సల ద్వారా డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో మందులు వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే డిప్రెషన్‌నుంచి బయటపడేందుకూ, అది నయం అయ్యేందుకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీగా పేర్కొన షాక్ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది. ఇక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇది ఒక మ్యాజిక్ లా పనిచేసి డిప్రెషన్‌ను రూపుమాపుతుంది. మీరు ఆరోగ్యవంతులేనా? ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే అతణ్ణి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఆ.. డిప్రషనే కదా తక్కినదంతా బాగానే ఉంది కదా అనుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాదు. డిప్రెషన్– అనగా దిగులూ వ్యాకులతా కుంగుబాటూ మనలో ఉంటే అందుకు కారణమైన అంశాలను దూరం చేసుకోకపోతే లేదా నిర్లక్ష్యం చేస్తే... మైల్డ్ డిప్రెషన్ మాడరేట్కూ... ఆ తర్వాత సివియర్కూ చేరవచ్చు. డిప్రెషన్ – శరీరంపై ప్రభావం మైల్డ్ లేదా మాడరేట్ డిప్రెషన్ల ప్రభావం మన రోగనిరోధక శక్తిపై ఉంటుంది. దాని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అనేక శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెజబ్బులు ఉన్నవారికి డిప్రెషన్ ఉంటే వాళ్లలో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువ. డిప్రెషన్ ఉన్నవారికి డయాబెటిస్ చికిత్స మామూలు వారికంటే కఠినమవుతుంది. డిప్రెషన్‌కు తగిన చికిత్స లభించకపోతే మతిమరుపు (డిమెన్షియా) రావచ్చు. డిప్రెషన్ ఉన్నవారికి థైరాయిడ్, ఇతర హార్మోన్ సమస్యలు రావడం ఎక్కువ. అంటే డిప్రెషన్‌కు కారణమయ్యే కెమికల్ ఇన్బేలెన్స్ ఇతర రసాయనాలను కూడా ప్రభావితం చేసి వ్యాధులను కలిగిస్తుందన్న మాట. పక్షవాతం, పార్కిన్సన్ డిసీజ్, తలకు గాయం, మెదడులో కణుతులు, మూర్ఛ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారిలో డిప్రెషన్ చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. డిప్రెషన్ ఉన్నవారిలో ఎముకల అరుగుదల, అస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలు ఎక్కువగా రావచ్చు. మనం సాధారణంగా వాడే నొప్పి నివారణ మందులు (ఎన్ఎస్ఏఐడీ), బీపీ మందులు, గర్భనిరోధక మందులు, రక్తంలో కొవ్వుపాళ్లను తగ్గించే స్టాటిన్స్‌తో పాటు సల్ఫానమైడ్స్, స్టెరాయిడ్స్ వంటివి డిప్రెషన్‌ను కలగజేస్తాయి. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఇలాంటివి సొంతంగా వాడకూడదు. మీకు మీరే చేసుకోదగ్గవి... డిప్రెషన్లో ఉన్న లక్షణాలైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వ్యక్తులు తమకు తామే ఈ కండిషన్ నుంచి బయటికి రావడాన్ని ప్రయత్నించవచ్చు. అందుకోసం అనుసరించదగిన మార్గాల్లో కొన్ని ఇవి... తొలుత తాము ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలవడాన్ని ప్రయత్నించాలి. పదిమంది వస్తూపోతూ ఉండే ప్రదేశాలకు తప్పక వెళ్తుండాలి. ప్రతివారూ ఎన్నో కొన్ని సంతోషభరిత క్షణాలు గడిపే ఉంటారు. వాటిని తలచుకోవాలి. అంతేకాదు... ప్రతికూల క్షణాలు గడిచిపోయాక... తాము అనుభవించిన తరహా క్షణాలు మళ్లీ వస్తాయని మనసుకు చెప్పుకోవాలి. తమకు ఇంతకుముందు చాలా సంతోషాన్ని ఇచ్చిన ఇష్టమైన హాబీలు ఏవైనా ఉంటే వాటిలో మళ్లీ నిమగ్నం అయి, మునుపటి స్థితిని పొందేందుకు ప్రయత్నించాలి. తమ నైపుణ్యాలను ప్రదర్శించాలి. గతంలో తాము చేసిన మంచి పనులు, సాధించిన అంశాలు ఏవైనా ఉంటే వాటిని మాటిమాటికీ తలచుకుంటూ... ‘అవి చేసింది నేను కదా. మరి ఇప్పుడూ అలాంటిది చేయగలను కదా. సరే చేద్దాం’ అంటూ ప్రయత్నించాలి. ∙ వ్యాయామం మీద దృష్టి పెట్టాలి. వ్యాయామంతో మెదడులో కొన్ని సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ∙ వీటన్నింటికీ తోడు మంచి సమతులాహారం కూడా తీసుకోవాలి. ∙ అన్నిటికంటే ముఖ్యంగా తమ మనసులోని మాటనూ, తమ నిరాశ, నిస్పృహలను తాము నమ్మే వారితో నిస్సంకోచంగా మనసు విప్పి చెప్పాలి. ఇతరులు చేయగలిగినవి... డిప్రెషన్లో ఉన్న వ్యక్తి చెప్పకపోయినా... సన్నిహితులు, బంధువులు తమకు బాగా పరిచయం ఉన్న వ్యక్తినీ, తమ కుటుంబ సభ్యుడిని దగ్గరిగా గమనిస్తుంటారు. తమ తోటి వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు వచ్చినా వారు చేయాల్సినవి ఇవి... ∙ వీలైనంతగా ఎక్కువగా వారితో సంభాషిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనను తప్పు పట్టకుండా... వారి బాధను తాము అర్థం చేసుకున్నామనే ధోరణిలో సన్నిహితుల మాట తీరు ఉండాలి. వాళ్లకు నైతిక స్థైర్యం అందించడానికి తామెప్పుడూ సంసిద్ధంగా ఉంటామనే మాటలను తరచూ చెబుతుండాలి. ఆ మేరకు వాళ్ల వ్యవహార శైలి కూడా అలాగే ఉండాలి. ఒకరు డిప్రెషన్‌కు లోనైనట్లు గుర్తిస్తే వారిని ఎప్పుడూ ఒంటరిగా ఉంచకూడదు. కొన్నిసార్లు అది ఆత్మహత్య వంటి అనర్థాలకు కారణం కావచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా... ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడని అనుమానించినప్పుడు... అతడిని అనునయపూర్వకంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. కనుగొనడం ఒకింత కష్టమే గానీ... ఒక వ్యక్తి విచారంగా నిరాశ నిస్పృహలతో కూడిన మాటలు మాట్లాడటం జరుగుతుంటే డిప్రెషన్ ఉన్నట్లు నిర్థారణ చేయడం చాలా సులభం. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే డిప్రెషన్ ఉంటుంది. ఇలా లక్షణాలు లేకుండా డిప్రెషన్ ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘ఎటిపికల్ సింప్టమ్స్’గా డాక్టర్లు చెబుతుంటారు. లక్షణాలేమీ కనిపించవు కాబట్టి దీన్ని గుర్తించడం చాలా అనుభవజ్ఞులైన డాక్టర్లకూ కష్టమవుతుంది. అందుకే ఇటీవల ఒకరిద్దరు డాక్టర్లు సాక్షాత్తూ న్యూరో విభాగంలో పని చేస్తూ కూడా డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు వెలుగుచూసి, సంచలనం సృష్టిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తుల్లో డిప్రెషన్ ఒక్కోసారి చిరాకు, కోపం రూపంలో కనిపించవచ్చు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తులకు కేవలం తమ జీవితంలోని ప్రతికూలతలూ, నెగెటివ్ అంశాలు మాత్రమే పదేపదే గుర్తుకొస్తుంటాయి. వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. మన చుట్టుపక్కల అలాంటి ప్రవర్తనతో కనిపిస్తున్నవారిని కూడా డిప్రెషన్ గురించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఎంత సామాన్యుడిలోనైనా ఏదో ఒక పాజిటివ్ సంఘటన ఉంటుంది. సంతోషంగా గడిపిన క్షణాలూ ఉంటాయి. డిప్రెషన్లో ఉన్నవారు ఆ క్షణాలను ఏమాత్రం స్మరించరు. ఇలా తమ సంతోష క్షణాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ప్రతికూలతలను గురించే ప్రస్తావించడాన్ని బట్టి మైల్డ్, మాడరేట్ డిప్రెషన్లను కనుగొనవచ్చు. అలా గుర్తించగలిగితే మనం మన ఆప్తులను రక్షించుకోవచ్చు. ►డిప్రెషన్‌ను కనుగొని చికిత్స అందిస్తే... సమాజానికి పనికి వచ్చే చాలా మంది విలువైన వారితోపాటు... ఎంతో కాలాన్నీ, శ్రమనూ, అధ్యయనాన్నీ, ధనాన్ని వెచ్చిస్తే గానీ తయారు కాని డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర సునిశిత వ ృత్తివిద్యానైపుణ్యాలు ఉన్న విలువైన మానవ వనరులను మనం కాపాడుకోవచ్చు. ఇన్పుట్స్: డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ -
చనిపోయిన పాప కదిలిందంటూ..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ప్రాణముండగానే.. బాలిక మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారనే ప్రచారం శనివారం నగరంలో కలకలం రేపింది. విజ యవాడ న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోతిన సాయిదుర్గ (14) పదిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఈ నెల 25న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక తీవ్ర శ్వాసకోశవ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు నిర్ధారించి తొలుత అక్యుట్ మెడికేర్ (ఏఎంసీ)లో, అనంతరం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సచేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30కు బాలిక మృతి చెందడంతో బంధువులకు అప్పగించారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా.. శనివారం మధ్యాహ్నంఅంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుండగా బాలిక కదిలిందని బంధువుల్లో ఒకరికి అనుమానం వచ్చింది. ఆర్ఎంపీని తీసుకురాగా ఆయన నాడికొట్టుకుంటోందని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. దీంతో తమ బిడ్డను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లినా వారంతా పాప చనిపోయిందని నిర్ధారించారు. అయినప్పటికీ పాప బతుకుతుందనే ఆశతో మళ్లీ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసుల సమక్షంలో ఈసీజీ తీసిన వైద్యులు బాలిక మరణించిందని తేల్చారు. -
ఎన్పీసీడీసీఎస్లోకి కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులు
దీర్ఘకాలిక వ్యాధుల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం కేన్సర్, డయాబెటిస్, బీపీల సరసన చేరుస్తూ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేన్సర్, గుండె, షుగర్ వ్యాధుల జాతీయ నియంత్రణ, నిర్మూలన కార్యక్రమం (ఎన్‌పీసీడీసీఎస్)లో కిడ్నీ, శ్వాస కోశ సంబంధిత వ్యాధులనూ చేరుస్తూ తాజా గా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులనూ ఇకపై దీర్ఘకాలిక లేదా జీవనశైలి వ్యాధులుగా గుర్తిస్తారు. కేన్సర్, గుండె, షుగర్ వ్యాధులు ఎంత సర్వసాధారణ మయ్యాయో.. కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులూ అదే స్థారుులో జనాన్ని పట్టి పీడిస్తున్నారుు. ఈ వ్యాధులన్నింటినీ వివిధ పరీక్షల ద్వారా ముందుగానే గుర్తించి నియంత్రించడమే ఎన్‌పీసీడీసీఎస్ ప్రధాన లక్ష్యం. రెండేళ్ల క్రితం 3 ప్రధాన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కోసం ఎన్‌పీసీడీసీఎస్ ఏర్పడగా.. తాజాగా కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను చేర్చారు. ఆరోగ్యశ్రీలో రెండో స్థానం కిడ్నీ వ్యాధులదే 2015-16లో ఆరోగ్యశ్రీ కింద తెలంగాణలో చేసిన చికిత్సల్లో అత్యధికంగా 24.04 శాతం కేన్సర్‌కు సంబంధించినవే ఉన్నారుు. రెండో స్థానం కిడ్నీ వ్యాధులకు సంబంధించిన చికిత్సలదే. కిడ్నీ చికిత్సలు 17.80 శాతం, గుండె చికిత్సలు 10.92 శాతం ఉన్నారుు. 2015-16లో మొత్తం అన్ని రకాల వ్యాధులకు 2,60,110 చికిత్సలు జరిగితే అందులో కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు చెందిన చికిత్సలు 1,37,286 జరిగారుు. మరోవైపు అన్ని వ్యాధుల చికిత్సలకు కలిపి ప్రభుత్వం రూ. 682.99 కోట్లు కేటారుుస్తే.. అందులో రూ. 326.91 కోట్లు ఈ మూడింటికే ఖర్చు చేశారు. శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి 1,553 శస్త్రచికిత్సలు జరిగారుు. ఎన్పీసీడీసీఎస్లో చేర్చితే ప్రయోజనమేంటి? దీర్ఘకాలిక వ్యాధులుగా కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను గుర్తించి.. ఎన్పీసీడీసీఎస్లో చేర్చడం వల్ల ఆ వ్యాధుల నియంత్రణ, నిర్మూలనపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ముందస్తుగానే కిడ్నీ, శ్వాసకోశ వ్యాధులను గుర్తించి మొదట్లోనే నయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రచించాలి. అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ యూనిట్లు పెంచడం, వైద్య నిపుణుల సంఖ్యను అధికం చేయడం.. ఊపిరితిత్తులకు సంబంధించి ప్రత్యేక వార్డులను జిల్లా, ఏరియా కేంద్రాల్లో ఏర్పాటు వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఎన్‌పీసీడీసీఎస్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చుతాయి. -
నెల్లూరులో మంత్రి vs మేయర్
► మేయర్ కలల ప్రాజెక్టుకు మంత్రి ప్రారంభోత్సవం ► అజీజ్ లేని సమయంలో ప్రారంభోత్సవం ► మేయర్ మద్దతుదారుల అసహనం నెల్లూరు: నెల్లూరు నగరంలోని ప్రధాన వీధులన్నీ దుమ్ములేకుండా శుభ్రం చేసే కార్యక్రమాన్ని తన ఖాతాలో వేసుకోవాలనుకున్న మేయర్ అబ్దుల్ అజీజ్‌కు గొంతులో వెలక్కాయపడ్డట్లయింది. ఆయన దేశంలో లేని సమయంలో మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ సోమవారం రోడ్లను శుభ్రం చేసే యంత్రాన్ని ప్రారంభించి నగరంలోని దుమ్ము దులిపేసే మంచి పని తన వల్లే జరిగిందని చెప్పకనే చెప్పారు. అజీజ్ కలల ప్రాజెక్టును మంత్రి ఇలా చడీ చప్పుడు లేకుండా ప్రారంభించి మేయర్‌ను అవమానించారని ఆయన మద్దతుదారులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ దుమ్ముతో నిండిపోయి వాహన చోదకులకు తీవ్ర అసౌకర్యగా ఉంది. దీంతో పాటు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనమే కాకుండా స్థానికులు సైతం దుమ్ముకొట్టుకుని ఉన్న రోడ్ల విషయంలో కార్పొరేషన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నగరంలోని సందులు, గొందుల రోడ్లు కాకపోయినా కనీసం ప్రధాన రహదారులైనా దుమ్ములేకుండా శుభ్రం గా ఉంచి జనంలో మార్కులు కొట్టేయాలని మేయర్ అజీజ్ ఆశపడ్డారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని అధికారులతో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్లు శుభ్రం చేసే యంత్రాలు ఉన్నాయనీ, అలాంటివి ఇక్కడకు కూడా తీసుకుని వస్తే రాత్రి పూట ప్రధాన రోడ్లన్నీ శుభ్రం చేయొచ్చని అధికారులు సలహా ఇచ్చారు. సుమారు రెండు, మూడు నెలల ప్రయత్నం అనంతరం నెల్లూరుకు ఇలాంటి యంత్రాన్ని తెప్పించారు. ఏడాదికి రూ.1.67 కోట్లు చెల్లించే విధంగా ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గంటకు 8 కిలో మీటర్ల దూరం రోడ్డును శుభ్రం చేసే ఈ యంత్రాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాలని మేయర్ అజీజ్ ఆశపడ్డారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఈ యంత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కార్పొరేషన్ అధికారులకు సూచించారు. వనంతోపు సెంటర్లో యంత్రం ప్రారంభం: సోమవారం నెల్లూరులో ఉన్న మంత్రి నారాయణ వనంతోపు సెంటర్లో రోడ్డు శుభ్రపరిచే యంత్రాన్ని ప్రారంభించారు. కార్పొరేషన్ అధికారులు హడావుడిగా ఈ ఏర్పాట్లు చేశారు. ఈ యంత్రాన్ని మేయర్ ప్రారంభించాలని అనుకున్నారనీ, ఆయన దేశంలో లేని సమయంలో హడావుడిగా మంత్రి ప్రారంభించడం ఆయన్ను అవమానించినట్లేనని అజీజ్ మద్దతుదారుడు షంషుద్దీన్ ప్రారంభ సమయంలోనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది మేయర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన లేని సమయంలో ప్రారంభించడం సరైంది కాదన్నారు. కమిషనర్ వెంకటేశ్వర్లు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇది చాలా చిన్న విషయం కాబట్టి సీరియస్‌గా తీసుకోవద్దని మంత్రి ఆ నాయకుడికి చెప్పి వెళ్లిపోయారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలు అజీజ్‌ను ఏ మాత్రం గౌరవించడం లేదనీ, అసలు ఆయన్ను అధికార పార్టీ నాయకుడిగానే పరిగణించడం లేదని ఆయన మద్దతుదారులు రగిలిపోతున్నారు. తమ నాయకుడిని ప్రతి విషయంలో అవమానకరంగానే చూస్తున్నారని మండిపడుతున్నారు. అయితే మంత్రి మద్దతుదారులు మాత్రం అజీజ్‌కు అంత సీన్ లేదని వ్యాఖ్యానిస్తున్నారు. -
వాయుకాలుష్యంతో చిన్నారులకు ముప్పు
పరిపరి శోధన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాయుకాలుష్యం వల్ల ఉబ్బసం సహా పలు శ్వాసకోశ వ్యాధులు వస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, వాయుకాలుష్యం కారణంగా చిన్నారులకు మరింత ముప్పు ఉందని లండన్‌లోని క్వీన్ మేరీ కాలేజ్ పరిశోధకులు హెచ్చరిస్తు న్నారు. వాయుకాలుష్యానికి కారణమవుతున్న నైట్రోజన్ డయాక్సైడ్, ధూళి కణాలు, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వంటి వాటి వల్ల చిన్నారులకు ఉబ్బసం వంటి ఇబ్బందులు తలెత్తడం మాత్రమే కాకుండా, మెదడు కణాలు దెబ్బతిని వారి అధ్యయన సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు. -
సిక్కోలు @12 డిగ్రీలు
* చలిగాలులతో వణికిపోతున్న ప్రజలు * ప్రత్యామ్నాయాల వైపు పరుగులు * అవస్థలు పడుతున్న గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు శ్రీకాకుళం కల్చరల్: వణికిస్తున్న చలి గాలులు.. ఉదయం , రాత్రి వేళల్లో దట్టంగా కురుస్తున్న మంచు.. భారీగా తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు.. వెరసి చలి పంజాకు చిక్కి శ్రీకాకుళం జిల్లా విలవిల్లాడుతోంది. జిల్లాలో ఈ సీజనులో తొలిసారి శుక్రవారం 12 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు మంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. తొమ్మిది గంటలైనా మంచు తెరలను చీల్చుకొని సూరీడు బయటకు రాలేకపోతున్నాడు. అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి చలిగాలలు మొదలవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు చలికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇళ్లలోనే ఉంటున్నా స్వెటర్లు, ఇతర ఉన్ని దుస్తులు ధరిస్తే తప్ప చలి నుంచి తప్పించుకోలేని పరిస్థితి. చలి తీవ్రత పెరగడంతో అస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్న రోగుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. చిన్నారులు అనారోగ్యానికి గురవుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు.