Nizam Nawab Rule
-
ఏడో నిజాం వాహనంపై బాంబు దాడి.. ఆర్య సమాజ్‌కు సంబంధమేంటి.. అసలు ఆ కథేంటీ?
నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్య సమాజ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించింది. పౌరుల ప్రాథమిక హక్కులకోసం సత్యాగ్రహం చేసి వేల సంఖ్యలో ఆర్య సమాజ్ నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. కొందరు యువకులు ఏడో నిజాం వాహనంపై బాంబు దాడికి ప్రయత్నించారు. ఈ నిరసన కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రంగానే జరిగాయి. చదవండి: నిజాం నవాబుకు పటేల్ 3 నెలలు గడువు ఎందుకిచ్చారు?.. దీని వెనుక కారణాలేమిటంటే.. హిందూ మతంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘన చరిత్ర ఆర్య సమాజ్‌ది. అయితే కేవలం ఇది మతానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది యోధులకు కూడా ఆర్యసమాజే స్ఫూర్తినిచ్చింది. వేద విలువలే పునాదిగా దాదాపు 150 సంవత్సరాల క్రితం స్వామి దయానంద సరస్వతి ప్రారంభించిన ఈ సమాజ్.. హైదరాబాద్ నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ కీలకపాత్ర పోషించింది. అందులోనూ సుల్తాన్ బజార్ లోని దేవిదీన్ బాగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్య సమాజ్ మందిరాలు అనగానే హైదరాబాద్‌లోని కాచిగూడ, పాతబస్తీలోని శాలిబండ ఆర్య సమాజ్ మందిరాలే ముందుగా గుర్తొస్తాయి. కానీ సుల్తాన్ బజార్ ప్రాంతంలోని దేవిదీన్ బాగ్ ప్రాంగణం గురించి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది సుల్తాన్‌బజార్ ఆర్యసమాజ్ ఆధ్వర్యంలోనే నడిచేది. ఎంతో మంది ఆర్య సమాజ్ నాయకులకు ఇది సమావేశాల వేదికగా ఉండేది. నిజాం వ్యతిరేక పోరాటానికి తమ కార్యకర్తలను ఇక్కడ నుంచే దిశానిర్దేశం చేసేవారు నాయకులు. ఈ ప్రాంగణంలో ఇప్పుడు ఆర్య కన్య స్కూల్ నడుస్తోంది. దీన్ని ఆర్య సమాజమే నిర్వహిస్తోంది. అప్పుట్లో ఆర్య సమాజ్‌లో క్రియశీల పాత్ర పోషించిన స్వాతంత్ర సమరయోధుడు గంగారామ్. నిజాం నిరంకుశ వ్యతిరేక పాలనలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొనడంతో ఆయన చదువును మధ్యలోనే ఆపేశారు. నిజాం పాలనలోని దారుణాలకు వ్యతిరేకంగా ఏడో నిజాం వాహనంపై బాంబుదాడికి ప్రయత్నించిన ఆర్య సమాజ్‌కు చెందిన నారాయణ్‌రావు పవార్, జగదీశ్ ఆర్య, గండయ్యలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు వారిని గుండెల్లో దాచుకున్నారు. నిజాం ప్రభుత్వం ఆ ముగ్గురికీ మరణశిక్ష విధించింది. అయితే అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ .. భారత్‌లో విలీనం కావడంతో ఆ ముగ్గురు విడుదలయ్యారు. 1938-39 మధ్య కాలంలో సుమారు 13 నెలలపాటు ఆర్య సమాజ్ కార్యకర్తలు ప్రాథమిక హక్కులకోసం చేసిన సత్యాగ్రహం కీలకంగా మారింది. ఆ సమయంలో 13 వేల మంది ఆర్యసమాజ నాయకులు, కార్యకర్తలు అరెస్టయ్యారు. ఎంతో మంది జైళ్లలోనే ప్రాణాలు వదిలారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్య సమాజ్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్య సమాజ్ కార్యకర్తల అడ్రస్‌లు తీసుకొని.. వారి క్షేమ సమాచారాలను వారి తల్లిదండ్రులకు ఉత్తరాల ద్వారా తెలిపేవారు నాటి ఆర్య స్టూడియో ఫోటోగ్రాఫర్ సత్యనారాయణ ముల్కీ. అలా తెర ముందు కొందరు, తెర వెనక మరెందరో ఆనాటి ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. -
నాటి ఆజ్కల్.. నేటి అజ్జకొల్లు.. 200ఏళ్ల క్రితం నామకరణం
సాక్షి, మహబూబ్‌నగర్: కొన్ని ప్రాంతాలకు అక్కడి పరిస్థితులను భట్టి పేర్లు నామకరణం చేస్తారు. గతంలో నగరాలు, పల్లెలకు మంచి నాయకుల పెట్టారు. నేటికి అవే పేర్లతో గ్రామాలు పిలువడుతున్నాయి. అలాంటిదే నాటి ఆజ్కల్ నేటి అజ్జకొల్లుగా మారింది. ఈ గ్రామ నామకరణంపై ప్రత్యేక కథనం.. మదనాపురం మండలంలోని అజ్జకొల్లు మండలంలోనే ప్రస్తుతం పెద్ద గ్రామంగా పేరుంది. విభిన్న రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. ప్రజలంతా నాటి నుంచి వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. 200 ఏళ్ల క్రితం నామకరణం నిజాం నవాబు కాలంలో వనపర్తి సంస్థానంలో ఈ గ్రామం ఉండేది. ఈ గ్రామంలో వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు వంశీయుల ఆధీనంలో ఉన్నది. 1900 సంవత్సరం వరకు గ్రామాన్ని ఆజ్కల్గా పిలిచేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ పేరు కాస్త (అజ్కోల్)గా మారింది. నిజాం నవాబు భారత సైన్యాన్నికి లొంగిపోయిన అనంతరం కాలక్రమేణా అజ్జకొల్లుగా మారింది. ప్రస్తుతం గ్రామం చుట్టూ రాజవంశీయుల వారి భూములు ఉన్నాయి. గామంలో 80 శాతం మంది రైతులే. రామన్‌పాడు బ్యాకువాటర్తో పాటు ప్రధాన కాల్వల ద్వారా గ్రామానికి సాగునీరు అందుతుంది. ఏటా రెండు, పంటలు అధికంగా వరి పండుతుంది. పంచాయతీ కార్యాలయం సర్పంచ్‌లుగా కొనసాగిన వారు.. బాలయ్య, చెన్నారెడ్డి, తిరుపతన్నగౌడ్, బాలగౌడ్, కుర్వ నారాయణ, రాజవర్దన్‌రెడ్డి, బాలమణెమ్మ, పద్మమ్మ, కుర్వ బుచ్చన్న, విజయేందర్‌రెడ్డి, ప్రస్తుత సర్పంచ్ బ్రహ్మమ్మ. ఒకరు ఎంపీపీ ఇద్దరు జెడ్పీటీసీలుగా.. ఉమ్మడి కొత్తకోట మండలానికి ఎంపీపీ బాలగౌడ్, జెడ్పీటీసీ బాల మణెమ్మ చేశారు. ప్రస్తుతం మదనాపురం జెడ్పిటీసీగా కృష్ణయ్య యాదవ్ అజ్జకొల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. ‘ఆజ్కల్’గా పిలిచేవారంటా.. మా గ్రామాన్ని నిజాం కాలంలో ఆజ్కల్గా పేరు నామకరణం చేశారని మా పెద్దలు చెప్పెవారు. అ పేరు కాల క్రమేణ అజ్జకొల్లుగా ప్రస్తుతం పిలుస్తున్నారు. ఈ విషయం ఇప్పటితరం పిల్లలకు తెలియదు. – కోట్లరాంరెడ్డి, అజ్జకొల్లు చరిత్ర పుటలు తెలియాలి అజ్జకొల్లు అనే పేరు ఎలా వచ్చిందో మా వయస్సున్న యువకులకు ఎవరికీ తెలియదు. మా తరం వాళ్లు ఈవిషయాన్ని ఎప్పుడు ఆలోచించలేదు. ప్రస్తుతం మా గ్రామానికి గా అప్పట్లో నామకరణం చేశారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. – మొగిలి, అజ్జకొల్లు -
హైదరాబాద్‌లో రగల్ జెండా
* తొట్టతొలి ఎన్నికల్లో కమ్యూనిస్టు, సోషలిస్టులకు బ్రహ్మరథం * తెలంగాణలోని మెజారిటీ స్థానాల్లో ఉద్యమ పార్టీలదే హవా * ఔరంగాబాద్, గుల్బర్గా మద్దతుతో పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి: ‘బాంచన్ దొరా..నీ కాల్మొక్తం’ అంటూ రెండున్నర శతాబ్దాల పాటు నిజాం రాజుల పరిపాలనలో స్వేచ్ఛ, సమానత్వానికి పూర్తిగా దూరమైన తెలంగాణ జనం.. తాము ఓటేసిన తొట్ట తొలి ఎన్నికల్లో తమదైన ముద్ర వేశారు. 1947 ఆగస్టు 15 తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాలు, 1948 అనంతరం భారతదేశంలో విలీమైన సంస్థానాల్లోనూ 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూదిన కాంగ్రెస్‌ను ఓటర్లు అందలం ఎక్కించారు. అయితే హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణలో ప్రజలు మాత్రం దోపిడీ, పీడనకు వ్యతిరేకంగా నిజాం నవాబుపై సాయుధ సమరాన్ని నడిపిన రైతు, కూలీ ప్రతినిధులకు అటు లోక్‌సభ, ఇటు రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా పట్టం కట్టారు. 1952లో జరిగిన తొట్టతొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పీఠం దక్కినా... తెలంగాణలో మాత్రం ఉద్యమ పార్టీలకే అప్పటి ఓటర్లు పట్టం కట్టారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డివిజన్, కర్ణాటకలోని గుల్బర్గా డివిజన్‌తో పాటు తెలంగాణ ప్రాంతంలో మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరిపితే.. గుల్బర్గా, ఔరంగాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కవుూ్యనిస్టులు బలపరిచిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) జెండాలు రెపరెపలాడాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోషలిస్టు పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 173 స్థానాల్లో పోటీ చేసి 93 స్థానాలు కైవసం చేసుకోగా, కవుూ్యనిస్టుల సారథ్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 77 స్థానాల్లో పోటీ చేసి 42 స్థానాలను చేజిక్కించుకుంది. మొత్తం స్థానాల్లో 100 శాసనసభ స్థానాలు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే(తెలంగాణ) ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల విజయం సాధిస్తే, తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపిన ఉద్యమకారులతో బరిలోకి దిగిన పీడీఎఫ్ 35 స్థానాల్లో, సమ సమాజం పేరుతో రంగంలోకి దిగిన సోషలిస్ట్ పార్టీ పదకొండు చోట్ల విజయం సాధించాయి. మరో పది చోట్ల స్వతంత్ర, షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీలు గెలుపొందాయి. అంటే తెలంగాణలో వంద స్థానాల్లో 66 స్థానాల్లో ప్రతిపక్ష పార్టీల సభ్యులే ఎన్నిక కావడం విశేషం. మొట్టమొదటి ఎన్నికల్లో విశేషాలివి... * హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 109 శాసనసభ స్థానాలతో పాటు మరో 33 ద్విసభ స్థానాలున్నాయి. * మొత్తం 564 మంది అభ్యర్థులు పోటీ పడగా, కేవలం 42.32 పోలింగ్ శాతమే నమోదు అయింది. * కాంగ్రెస్ పార్టీ 173 స్థానాలకు పోటీ చేసి 42.32 శాతం ఓట్లతో 93 స్థానాల్లో విజయం సాధించింది. * పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షాజహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, షాపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి విరుపాక్షప్ప 88.49 శాతం ఓట్లు పొంది ఎస్పీ అభ్యర్థి భీంసేన్రావుపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. * అత్యధికంగా హింగోలి స్థానం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. * 77 స్థానాల్లో పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 39.59 శాతం ఓట్లతో 42 స్థానాల్లో విజయం సాధించింది. అందులో 35 స్థానాలు తెలంగాణలోనివే. * 97 స్థానాల్లో పోటీ చేసిన సోషలిస్ట్ పార్టీ 11 స్థానాలు గెలుచుకోగా ఆ 11 స్థానాలు తెలంగాణలోనివే. * షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ (ఎస్సీఎఫ్) ఐదు స్థానాల్లో విజయం సాధిస్తే తెలంగాణలో సిరిసిల్ల, జగిత్యాల, మహబూబాబాద్(ద్విసభ స్థానాల్లో ఒక్కొక్కటి) మూడింటా విజయకేతనం ఎగరేసింది. * హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తే, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పీడీఎఫ్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. * హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 54.34 శాతం ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి ఎల్.ల క్ష్మారెడ్డిపై గెలుపొందారు. * తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి భువనగిరి శాసనసభ స్థానం నుంచి 55.12 శాతం ఓట్లు సాధించి తన సమీప బంధువు, ప్రథమ భూ దాత, తన బావ వెదిరె రామచంద్రారెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. * ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు వివిధ సమయాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వికారాబాద్ స్థానం నుంచి మర్రి చెన్నారెడ్డి, అలంద్ నుంచి వీరేంద్రపాటిల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయం సాధించారు. * వనపర్తి నుంచి సురవరం ప్రతాపరెడ్డి (కాంగ్రెస్) గెలుపొందగా, షాబాద్ నుంచి కొండా వెంకట రంగారెడ్డి 77.62 శాతం ఓట్లతో విజయం సాధించారు. నెహ్రూను మించిన... రావి మెజారిటీ తొట్టతొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజానీకం హైదరాబాద్ రాష్ట్ర ఫలితాలను ఆసక్తిగా గమనించింది. 25 లోక్‌సభ (4 ద్విసభతో కలిపి) స్థానాలున్న రాష్ట్రంలో 13 స్థానాల్లో కాంగ్రెస్, ఏడు స్థానాల్లో పీడీఎఫ్, రెండు స్థానాల్లో సోషలిస్ట్లు మరో మూడు స్థానాల్లో ఇతరులు గెలి చారు. ఈ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక ఓట్లను పొందారు. ఆ ఎన్నికల్లో ఆలహాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన జవహర్లాల్ నెహ్రూ 2,33,571ఓట్లు పొందగా, రావి నారాయణరెడ్డికి 3,09,162(పీడీఎఫ్) ఓట్లు పోల్ కావడం ఓ రికార్డ్. అలాగే గుల్బర్గా స్థానం నుంచి రామానందతీర్థ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికవ్వగా, హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆహ్మద్ మోహినోద్దిన్ చేతిలో పీడీఎఫ్ అభ్యర్థి ముగ్దూం మోహియుద్దిన్ ఓటమి పాలయ్యారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ప్రజాకవి కాళోజి నారాయణరావు మూడున్నర వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో పరాజయం పాలయ్యారు. -
హ్యాట్రిక్ వీరులు
కొనసాగిన హవా..! టంగుటూరి అంజయ్య, సలావుద్దీన్ ఒవైసీల వరుస విజయూలు హైదరాబాద్‌లో ఐదోసారి సార్వత్రిక ఎన్నికలు 1972లో జరిగాయి. నగరంలో నాడు నియోజకవర్గాల సంఖ్య 11. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది. 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మిగిలిన మూడు స్థానాల్లో స్వతంత్రుల హవా కొనసాగింది. గరీబోళ్ల బిడ్డ అంజయ్య, సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీలు ఈ ఎన్నికల్లో కూడా విజయదుందుభి మోగించారు. చాలా నియోజకవర్గాల్లో సంపూర్ణ తెలంగాణా ప్రజా సమితి(ఎస్టీపీఎస్) ద్వితీయ స్థానాల్లో నిలిచింది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా యాకుత్‌పురా నియోజకవర్గంలో 63.44 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో 33.48 శాతం పోలింగ్ జరిగింది. - సాక్షి,సిటీబ్యూరో ముషీరాబాద్ ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కార్మికోద్యమ నేత టి.అంజయ్య 29,198 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన సీపీఐ అభ్యర్థి ఎం.ఏ. రజాక్ 8,834 ఓట్లు మాత్రమే సాధించారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి బి.పుల్లారెడ్డికి 6,091 ఓట్లు మాత్రమే దక్కాయి. స్వతంత్ర అభ్యర్థి ఎం.నరసింహకు 740, మరో స్వతంత్ర అభ్యర్థివెంకట నర్సింగరావుకు 302 ఓట్లు లభించాయి. నమోదైన పోలింగ్ 48.56 శాతం. గగన్‌మహల్ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతాబాయ్ తాల్పాలికర్ 14,721 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి జి.నారాయణరావు 9,028 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. భారతీయ జనసంఘ్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రావు 4,983 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి మీర్జా జమీల్ అహ్మద్ బేగ్‌కు 2,720 ఓట్లు లభించాయి. పోలింగ్ శాతం 50.82. మహరాజ్‌గంజ్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్.లక్ష్మీనారాయణ 16,562 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి పార్టీ అభ్యర్థి బద్రీ విశాల్ పిట్టి 15,424 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి పి.రామస్వామికి 4,235 ఓట్లు లభించాయి. మరో స్వతంత్ర అభ్యర్థి కె.ఎం.అన్సారీకి 1182 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 52.88 శాతం ఓట్లు పోలయ్యాయి. సీతారాంబాగ్ ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి షాఫియూర్ రహమాన్ 16,844 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థి సోమ యాదవరెడ్డి 14,898 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బిదా బిల్ గ్రామి 10,059 ఓట్లతో తృతీయస్థానానికి పరిమితమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి అహ్మద్ హుస్సేన్ 3554 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో 50.34 శాతం పోలింగ్ జరిగింది. మలక్‌పేట్ కాంగ్రెస్ అభ్యర్థిని బి.సరోజినీ పుల్లారెడ్డి 23,164 ఓట్లు సాధించి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి గురులింగం సత్తయ్య 11,230 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. మరో స్వతంత్ర అభ్యర్థి ఖాజా అబు సయిద్ 8,355 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. పోలింగ్ శాతం 60.68. యాకుత్‌పురా ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ 26,621 ఓట్లు సాధించి గెలుపొందారు. భారతీయ జనసంఘ్ పార్టీ అభ్యర్థి ఆర్. అంజయ్య 10,082 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.ఎం.ఖాన్ 8,667 ఓట్లతో తృతీయ స్థానానికే పరిమితమయ్యారు. మొత్తంగా 63.44 శాతం ఓట్లు పోలయ్యాయి. చార్మినార్ ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సయిద్ హసన్ 15,341 ఓట్లు సాధించి విజయం సొంతం చేసుకున్నారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి ఎస్.రఘువీర్‌రావు 5,591 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవాబ్ తాహర్ అలీఖాన్ 5,368 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి లాయక్ అలీఖాన్ 5,169 ఓట్లు సాధించారు. పోలింగ్ శాతం 52.41. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎల్.నారాయణ 17,856 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణా ప్రజా సమితి అభ్యర్థి జి.ఎం. అంజయ్య 8,885 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి సుదర్శనరావుకు 2,492 ఓట్లు దక్కాయి. నమోదైన పోలింగ్ శాతం 48.12. ఖైరతాబాద్ ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగం కృష్ణారావు 18,392 ఓట్లతో గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి ఇ.వి.పద్మనాభన్ 10,970 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. సీపీఐ అభ్యర్థి పి.నాగేశ్వరరావు 3,260 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. మొత్తంగా 45.49 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆసిఫ్‌నగర్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ రహ్మత్ అలీ 15,074 ఓట్లతో గెలుపొందారు. ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఇస్మాయిల్ జరీ 12,364 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అభ్యర్థి జి.సత్యనారాయణకు 5,566 ఓట్లు దక్కాయి. పోలింగ్ శాతం 50.34. కంటోన్మెంట్ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని వి.మంకమ్మ 18,891 ఓట్లు సాధించి గెలుపొందారు. సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి బి.ఎం.నర్సింహ 11,187 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి ఎస్.జగన్నాథ ం 1,976 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచారు. 33.48 శాతం పోలింగ్ జరిగింది. నిత్య వార్త సత్యవాక్కు ముస్లింలకు మేలు చేసింది వైఎస్సే: అసదుద్దీన్ తపనంతా ప్రజాశ్రేయస్సు తన పర భేదం లేని మనస్సు అందరికీ ఆప్తుడైన మేరునగధీరుడాయన... అండగా ఉండే పాలనకు ‘మేలు’కొలుపాయన... రాజన్నంటే... యుగానికొక్కడు... రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు... తను లేడంటే నమ్మలేం... తలవకుండా ఉండలేం... చంద్రబాబు అభివృద్ధి చేసింది జూబ్లీహిల్స్ మాత్రమే... చిరంజీవి అన్నపూర్ణ వగైరా స్టూడియోలు... అపోలో వంటి ఆసుపత్రులు... సింగారాల కొండలు... సినీ ప్రపంచపు సందళ్లు... చిన్నబోతాయి... చిరాకుపడతాయి... గుట్టల్ని చదును చేసి కొండల్ని పిండి చేసి రూపమిచ్చి... ఊపునిస్తే... ఎవరయ్యా ఆ బాబు... ఏమిటాయన తెచ్చిన డాబు? అంటూ కళ్లెర్రజేస్తాయి... 18 మురికివాడల ఫిలింనగరి... పత్తాలేని అభివృద్ధికి ఏ బాబు... జవాబుదారి? - ఎస్. సత్యబాబు -
'నిజాం120 కేజీల బంగారం ఇచ్చారు'
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై టీడీపీ అనుసరిస్తున్న విధానాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. చంద్రబాబు ఇద్దరు కొడుకుల సిద్ధాంతం ఏంటని ఆయన ప్రశ్నించారు. విభజనపై చంద్రబాబు డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు. సమన్యాయం అంటే ఏమిటో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు ప్రాంతాలకు ఎలాంటి న్యాయం కోరుతున్నారో ఎందుకు వెల్లడించరని ప్రశ్నించారు. విభజనపై మీ విధానం ఏమిటని చంద్రబాబును అడిగితే మీకు ఎంతమంది పిల్లలు అని ఎదురు ప్రశ్న వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో చేతులు కలపబోమని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నరేంద్ర మోడీతో ఎందుకు చేతులు కలిపారని నిలదీశారు. నిజాం పాలనపై అసెంబ్లీలో మంత్రి శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజనకు కారకులైన వారిని వదిలేసి నిజాం నవాబులను నిందించడం తగదన్నారు. రాష్ట్ర విభజనకు నిజాం కారకుడా అని ప్రశ్నించారు. నిజాంలు సమర్థుడైన పాలకులని కితాబిచ్చారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో నిజాం నవాబులు 120 కేజీల బంగారాన్ని భారత సైన్యానికి ఇచ్చారని గుర్తు చేశారు. పాత గాయాలజోలికి పోవద్దని, వాటిని రేపితే అన్ని ప్రాంతాల ప్రజలు గాయపడతారని అక్బరుద్దీన్ అన్నారు.