Nizam rights
-
సలార్ టికెట్ల ధరలు పెంపు.. టికెట్ ఎంతో తెలుసా?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సలార్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటకే విడుదలైన సలార్ టీజర్, ట్రైలర్లోనూ ప్రభాస్ ఎలివేషన్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రం కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. సలార్ రన్‌టైమ్ 2గంటల 55నిమిషాలు ఉన్న ఈ మూవీ టికెట్ రేట్లు పెరగనున్నట్లు తెలుస్తోంది. సలార్ చిత్రానికి సంబంధించి తెలంగాణ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో టికెట్ రేట్లు పెంచుకునేందుకే కాకుండా అదనపు షోస్ అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని మైత్రి మేకర్స్ రిక్వెస్ట్ చేసిందట.. అంతే కాకుండా సలార్ విడుదల రోజున సింగిల్ థియేటర్లో 6 షోస్‌లు ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లకు మరో రూ. 100 పెంచుకునేందుకు అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ స్క్రీన్లోనే ఒక టికెట్ ధర సుమారు రూ. 300 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అదే మల్టీప్లెక్స్‌ల్లో అయితే రూ. 400 పైగానే ఉండనుంది. సలార్ విడుదల రోజున అంటే (డిసెంబర్ 22న) కొన్ని థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంటకే (1:00 AM) మొదటి షో పడనుంది. మిగిలిన అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు మొదటి షో ప్రారంభం కానుంది. డిసెంబర్ 15న సలార్ టికెట్ల అమ్మకాలు ప్రారంభం అవుతాయని గతంలోనే ఆ చిత్ర మేకర్స్ ప్రకటించారు. కానీ తెలంగాణలోని నైజాం రైట్స్ కొనుగోలు చేసిన మైత్రి మేకర్స్ అభ్యర్థనపై ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనను బట్టి ఆన్లైన్లో టికెట్ల ఓపెన్ అవుతాయని సమాచారం. ప్రభుత్వం నుంచి సలార్‌కు అనుకూలంగా ప్రకటన వస్తే RRR సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రికార్డును బీట్ చేయడం దాదాపు ఖాయం అని చెప్పవచ్చు. RRR సినిమాకు మొదటిరోజు రూ. 240 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఓవర్సీస్లలో ఇప్పటికే సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అమెరికా, యూకే వంటి నగరాల్లో సలార్ దూసుకుపోతుంది. ఇప్పటికే అక్కడ దాదాపు 25 వేలకు పైగానే టికెట్లు అమ్ముడబోయాయి. దీంతో సినిమా విడుదలకు ముందే సుమారు రూ. 9 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. #Salaar Nizam: Mythri has applied for a ticket price hike of Rs 100 in both single screens and multiplexes, along with 6th show screening permission. Prices for #SalaarCeaseFire , if the government approves Rs 100/- hike requested by Mythri: - Multiplexes: Max 413/-… pic.twitter.com/ywUpbrXRpp — Movies4u Official (@Movies4u_Officl) December 14, 2023 #SalaarCeaseFire 𝐊𝐞𝐫𝐚𝐥𝐚 Bookings Open From Today at 6:49 PM💥 Be the first to reserve your seats!#SalaarCeaseFireOnDec22 ⚡️#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur… pic.twitter.com/ywCepDNoZf — Hombale Films (@hombalefilms) December 15, 2023 The gates of ‘Khansaar’ are about to open! 7 DAYS to go for #SalaarCeaseFire 💥#SalaarCeaseFireOnDec22 Nizam Release by @MythriOfficial#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/tR4XsOnR6A — Mythri Movie Makers (@MythriOfficial) December 15, 2023 -
అయినా కొన్నారు
ఓ వైపు కరోనా మహమ్మారి రోజు రోజుకీ తన పంజా విసురుతోంది. లాక్డౌన్ వల్ల ఇప్పటికే సినిమా థియేటర్లు మూతపడ్డాయి.. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో, థియేటర్లు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి. అయినా నాలుగు పెద్ద సినిమాల హక్కులు కొన్నారు నైజాం ఏరియా పంపిణీదారుడు వరంగల్ శ్రీనివాస్. రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’, గోపీచంద్ ‘సీటీమార్’, శర్వానంద్ ‘శ్రీకారం’, రానా ‘విరాటపర్వం’ చిత్రాల నైజాం హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. పంపిణీ రంగంలో ఉన్న శ్రీనివాస్ నిర్మిస్తోన్న మొదటి చిత్రం షూటింగ్ సగం పూర్తయింది. ఈ చిత్రంతో పాటు మరో రెండు కొత్త సినిమాలు నిర్మించేందుకు శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు. -
భారీ రేటుకు పవన్ సినిమా నైజాం రైట్స్
సాక్షి, హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థలో రాధాకృష్ణ, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతం టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టినరోజున కోలవెరీ ఢీ ఫేమ్ అనిరుథ్ రవిచంద్రన్ విడుదల చేసిన చిన్న సాంగ్ బిట్ పవన్ అభిమానులను కట్టిపడేసింది. టాలీవుడ్లో హిట్ ఫ్లాపులతో సంబంధం లేని ఇమేజ్ పవర్ స్టార్ సొంతం.. ఈ విషయాన్ని పవర్ స్టార్ మరో సారి నిరూపించాడు. గత రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను నిరాశ పరిచినా వాటి ప్రభావం తాజా చిత్రంపై ఏమాత్రం లేదు. ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. నైజాం హక్కులు, నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిందని టాలీవుడ్ టాక్. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు 29 కోట్లకు నైజాం రైట్స్‌ను సొంతం చేసుకున్నారట. అలాగే శాటిలైట్ హక్కులను ప్రమఖ చానెల్ 19.5 కోట్లకు దక్కించుకుందని తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. అలాగే ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
బాహుబలి-2 రైట్స్ ఎవరికి దక్కాయో తెలుసా?
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా.. బాహుబలి -2. మొదటి భాగానికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో రెండో భాగం ఎప్పుడు బయటకు వస్తుందా, దాన్ని ఎలా పంపిణీ చేసి మంచి లాభాలు ఆర్జిద్దామా అని అంతా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటుండటంతో బిజినెస్ కూడా మొదలైపోయింది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా హక్కుల అమ్మకాలు కూడా జరిగిపోయాయి. ఎంతకు వెళ్లాయన్న విషయం బయటకు రాలేదు గానీ.. ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ ఈ హక్కులను కొనుగోలు చేశారని మాత్రం తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా బాహుబలి సినిమా తన అధికారిక ట్విట్టర్ పేజి ద్వారా వెల్లడించింది. We are pleased to confirm that Narayan Das Narang and Sunil Narang of Asian Enterprises have acquired the Nizam rights for #Baahubali2. — Baahubali (@BaahubaliMovie) 11 October 2016 -
రికార్డు ధరకు బాహుబలి హక్కుల్ని దక్కించుకున్న దిల్ రాజు
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి-1' చిత్రం అనేక సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అరుదైన రికార్డును బహుబలి చిత్రం సొంతం చేసుకుంది. బాహుబలి పంపిణీ హక్కులను నైజాంతోపాటు ఇతర ఏరియాలను అత్యధిక రేటుకు సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. కేవలం నైజాం హక్కుల్ని భారీ స్థాయిలో సుమారు 25 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'బహుబలి' ఒకటవ భాగాన్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఓ ప్రాంత హక్కుల కోసం టాలీవుడ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి. బహుబలి హక్కుల్ని సొంతం చేసుకున్న దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ ఊహించని విధంగా తెరకెక్కుతున్న బహుబలి చిత్ర విజయంపై దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారట. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు నటిస్తున్న 'బాహుబలి-1' 2015లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. Follow @sakshinews