
ఓ వైపు కరోనా మహమ్మారి రోజు రోజుకీ తన పంజా విసురుతోంది. లాక్‌డౌన్ వల్ల ఇప్పటికే సినిమా థియేటర్లు మూతపడ్డాయి.. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో, థియేటర్లు తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి. అయినా నాలుగు పెద్ద సినిమాల హక్కులు కొన్నారు నైజాం ఏరియా పంపిణీదారుడు వరంగల్ శ్రీనివాస్. రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’, గోపీచంద్ ‘సీటీమార్’, శర్వానంద్ ‘శ్రీకారం’, రానా ‘విరాటపర్వం’ చిత్రాల నైజాం హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. పంపిణీ రంగంలో ఉన్న శ్రీనివాస్ నిర్మిస్తోన్న మొదటి చిత్రం షూటింగ్ సగం పూర్తయింది. ఈ చిత్రంతో పాటు మరో రెండు కొత్త సినిమాలు నిర్మించేందుకు శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment