Nizamabad Division
-
కుక్క మెడకు తాడు కట్టి 5 కిలోమీటర్లు..
మాచారెడ్డి: పందుల కాపలా కోసం కొనుగోలు చేసిన కుక్క బైక్‌పై కూర్చోకపోవడంతో దాని మెడకు వైర్ తాడు కట్టి బైక్‌ను నడుపుతూ 5 కిలోమీటర్లు లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో కుక్క మెడకు గాయమైంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి వద్ద వెయ్యి రూపాయలువెచ్చించి కుక్కను కొనుగోలు చేశాడు. అనంతరం దాన్ని బైక్ వెనుక లాక్కెళ్లాడు. గమనించిన పలువురు జంతు ప్రేమికులు ఆ వ్యక్తిని వెంబడించి చివాట్లు పెట్టారు. ఎట్టకేలకు దాన్ని బైక్‌పై ఎక్కించి కొమురయ్యను హెచ్చరించి పంపించారు. -
బస్సుల పై రాళ్లతో దాడి
-
మరోసారి ఆశీర్వదించండి : ఎంపీ కవిత
కోరుట్ల: ‘‘టీఆర్ఎస్ మీ ఇంటి పార్టీ.. కోరుట్ల నాకు సెంటిమెంట్ ఊరు.. మరోసారి ఆశీర్వదించండి.. నిరంతరం అభివృద్ధికి పాటుపడతా’ అని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట కవిత పేర్కొన్నారు. బుధవారం కోరుట్లలోని పీబీ గార్డెన్స్‌లో టీఆర్ఎస్లో మున్నూరు కాపు సంఘాల చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘాలతో పాటు బీడీ టేకేదార్లు టీఆర్ఎస్కు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీగా మొదటిసారి గెలిచిన తర్వాత మొట్టమొదటగా కోరుట్లలో ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి రూ. 36 లక్షలు కేటాయించానన్నారు. ఎంపీగా గెలిచినప్పటినుంచి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచకా సాగాయన్నారు. కోరుట్ల ప్రజల ఆకాంక్షల మేరకు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి, 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేలైన్ పూర్తి చేయించి కోరుట్లకు రైలు తెప్పించామన్నారు. తిరుపతి, ముంబయి రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయన్నారు. కోరుట్లలో ముంబయి రైలు ఆగేలా ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. కోరుట్ల మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం ఎన్నడూ లేని రీతిలో రూ. 50 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. మళ్లీ తనను గెలిపిస్తే రానున్న కాలంలో కోరుట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ చీటి వెంకట్ రావు, మున్సిపల్ చైర్మన్ గడ్డమీది పవన్, పట్టణ, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలి కోరుట్లరూరల్: రాష్ట్రంలో పేదప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ఎంపీ కవిత అన్నారు. అయిలాపూర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలోని పేదలకు డబుల్ బెడ్రూం నిర్మిస్తామని, మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ఇళ్లు లేవని దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 5లక్షలు ఇస్తామన్నారు. మన రాష్ట్రం నుంచి 16 మందిని లోక్‌సభకు పంపిస్తే మనకు రావాల్సిన నిధులు బాజాప్త తెచ్చుకోవచ్చని, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసేదేమీ లేదని, బీజేపీ అంటే భారతీయ జూట్ పార్టీ అని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని అన్నారు. -
అభ్యర్థి ఎవరైనా కార్యకర్తలు వారే..
ఆర్మూర్: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా సరే ర్యాలీ నిర్వహించినా.. ప్రచారం చేసిన అధిక సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు హాజరై ఆ ర్యాలీలను విజయవంతం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ, అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్న లేకుండా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాల్లో వీరే పాల్గొంటుండడంతో ఓటరు నాడి అర్థం కాక రాజకీయ పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా ఆయా పార్టీల నాయకులు ఇస్తున్న డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ బలనిరూపణ చేసుకోవడం కోసం ప్రచార కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళలు, యువజన సంఘాల సభ్యులను తరలిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏది, తమకు సేవ చేస్తున్న నాయకుడా, కాదా అనే అంశాలను పట్టించుకోకుండా కేవలం వారిచ్చే డబ్బుల కోసం వీరు తరలి రావడం అన్ని రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలకు రోజుకు రూ. రెండు వందల నుంచి రూ. మూడు వందల వరకు చెల్లిస్తున్నట్లు డబ్బులు పంపిణీ చేస్తున్న నాయకులే బహిరంగంగా సమాచారం ఇస్తున్నారు. ఇక మోటార్ సైకిల్ ర్యాలీల్లో పాల్గొనడానికి వస్తున్న యువతకు ఒక్కో మోటార్ సైకిల్‌కు ఐదు వందల రూపాయలు, కారుకు 15 వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువకులు, కుల సంఘాల సభ్యులు ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారో లేదో అర్థం కాని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున జన సమీకరణతో ప్రత్యర్థులకు దడ పుట్టించాలని తద్వారా తాము గెలుస్తున్నామన్న టాక్‌ను సృష్టించాలని వివిధ పార్టీల ఎంపీ అభ్యర్థులు పోటీ పడి మరీ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారానికి ఈ జన సమీకరణ చేసే విధానం కేవలం ఆర్మూర్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. అయితే అన్ని పార్టీల ప్రచారానికి వారే రావడాన్ని గుర్తించిన స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ పార్టీల మేనిఫెస్టోలతో పాటు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి చేయాలనుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తే సరిపోయేదానికి ఇలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించడం వల్ల అభాసుపాలు కావడం తప్ప ఒరిగేదేమీ లేదని ప్రజలు, ఓటర్లు చర్చించుకుంటున్నారు. -
ఆత్మ ఘోషిస్తోంది
కాలయాపనకే కమిటీలు నిధులున్నా.. నిష్ప్రయోజనం.. అవగాహన సదస్సులు లేవు.. పట్టింపులేని వ్యవసాయ శాఖ ఏడీఏల పనితీరుపై అసంతృప్తి నిధుల ఖర్చుకు మరో మూడు నెలలే గడువే.. సుభాష్‌నగర్ : జిల్లాలో ఈ ఏడాది త్రేమాసికంలో ఎన్నుకున్న వ్యవసాయ సాంకేతిక, యాజమాన్య సంస్థ ’ఆత్మ’ కమిటీలు కాలయాపనకే పరిమితమయ్యాయి. వ్యవసాయశాఖ ఏడీలు ప్రత్యేక చొరవ తీసుకొని ఆత్మ కమిటీల పనితీరును మెరుగుపరిస్తే రైతులకు కొంతమేరకైనా లాభం చేకూరుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏడీఏలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఏటా ‘ఆత్మ’ నిధులు వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా రైతులను చైతన్యపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2006 సంవత్సరంలో ‘ఆత్మ’ ను ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ అర్బన్ మినహా 8 డివిజన్లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా లో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద డివిజన్లలో ఆత్మ పనిచేస్తోంది. జిల్లాస్థాయిలో గవర్నింగ్ బోర్డు ఉంటుంది. ఈ బోర్డుకు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జిల్లా ’ఆత్మ’కు ప్రాజెక్టు డైరెక్టర్ ఉంటారు. ఇందులో వ్యవసాయ అనుబంధశాఖల జిల్లాస్థాయి అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రై తులు, ఇన్పుట్ డీలర్లు సభ్యులుగా ఉంటారు. మొత్తం 25 మందితో కమిటీ ఉంటుంది. డివిజన్ లెవల్లో బ్లాక్ ఫార్మర్ అడ్వయిజరీ కమిటీ ఉంటుంది. ఇందులో 25 మంది సభ్యులు ఉంటారు. అందరూ రైతులే ఉండి అందులో నుంచి ఒక రైతును చైర్మన్‌గా ఎన్నుకుంటారు. కన్వీనర్‌గా ఏడీఏ వ్యవహరిస్తారు. ఆత్మకు కేటాయించిన నిధులను కలెక్టర్ డివిజన్ లెవల్లో కమిటీలకు అందజేస్తారు. ఆ నిధులను ఏడీఏ, కమిటీ చైర్మన్ వివిధ శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శనల కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. నిధులతోపాటు కమిషనరేట్ నుంచి వచ్చిన యాక్షన్ ప్లాన్‌ను అప్పగిస్తారు. శిక్షణా కార్యక్రమాలు శూన్యం జిల్లాలో 61 శిక్షణా కార్యక్రమాల (రైతులకు పంటలపై అవగాహన) నిర్వహణకు రూ.9.80 లక్షలు, 134 ప్రదర్శనలకు (రైతులకు క్షేత్ర పర్యటనలకు తీసుకెళ్లటం) రూ. 5.37 లక్షలు, 19 యాత్రలకు(రైతులకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లడం) రూ.8.81లక్షలను కేటాయించారు. కాగా ఇప్పటివరకు 46 శిక్షణా కార్యక్రమాలు, 67 ప్రదర్శనలు, 18 యాత్రలను నిర్వహించా రు. వీటితోపాటు ఆత్మ పొలంబడులు, ఫార్మర్ అవా ర్డు, రైతులతో శాస్త్రవేత్తల ఇంటరాక్షన్ తదితర కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకురావాలి. అన్ని ప్రదర్శనలు కలిపి జిల్లావ్యాప్తంగా 377 కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు కేవలం 133 మాత్రమే నిర్వహించారు. వీటికోసం దాదాపు రూ.44 లక్షలు కేటాయించగా, కేవలం రూ.12.50 లక్ష ల వరకు ఖర్చు చేశారు. జిల్లాలో ఎనిమిది ఆత్మ డివిజ న్లు ఉన్నాయి. అందులో ఇటీవల కాలంలో 7 డివిజన్ల లో కమిటీలు పూర్తయ్యాయి. ఒక్క నిజామాబాద్ డివిజన్‌కు మాత్రం ఇంకా చైర్మన్‌ను ఎన్నుకోలేదు. కమిటీలో కేటగిరీలవారీగా 25 మంది డైరెక్టర్లను నియామకం చేస్తారు. అంతేగాకుండా కమిటీ చైర్మన్ ఎంపికలో రాజకీయ జోక్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారానే నిజామాబాద్ డివిజన్లో కమిటీ చైర్మన్ ఎన్నికలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఒక్కో కమిటీ రెండేళ్లపాటు కొనసాగుతుంది. ఇంతవరకు జిల్లాలో సగం కమిటీలు సైతం శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించలేదు. ఆత్మ డివిజన్ కమిటీలు వ్యవసాయశాఖ ఏడీఏ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఆయా డివిజన్ల పరిధిలో ఏఓలు, ఏఈఓలు, బీటీఎంలు, ఏటీఎంలు ఉంటారు. నిధులు వెనక్కి.. డివిజన్ స్థాయిలో ఆత్మ కమిటీలు కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఏటా ఎంతో కొంత నిధులు కేటాయించే ప్రభుత్వాలు ఈ యేడాది గతేడాది నిధులే ఖర్చుచేయాలని ఆదేశించాయి. గతేడాది మిగిలిపోయిన బడ్జెట్‌నే ఈసారి సర్దుబాటు చేశారు. అందులో కార్యక్రమాల కోసం రూ.51,81,800, సిబ్బంది జీతాల కోసం దాదాపు రూ.68.52 లక్షలు.. మొత్తంగా రూ.1,20,33,800 కేటాయించారు. వచ్చే మార్చి 31 లోపు కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే వెనక్కి తీసుకుంటామని ఇప్పటికే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కేటాయింపులు ఖర్చు చేసేందుకు మరో మూడునెలల గడువు ఉంది. ఇప్పటికైనా కమిటీలతో రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించేలా ఏడీఏలు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరముందని అంటున్నారు.