ఓటింగ్ నేడే
డీపీసీ ఎన్నికలకు సిద్ధం
ఏకగ్రీవమైన రూరల్ స్థానాలు
అర్బన్ పరిధిలో తీవ్రంగా పోటీ
5 పదవులకు రంగంలో 18 మంది
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఇందూరు: జిల్లా ప్రణాళికా కమిటీ (డీపీసీ) ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. ఇందుకోసం అధికారులు జడ్పీలో అన్ని ఏర్పాట్లు చేశారు. రూరల్ స్థానాలు ఏకగ్రీవం కాగా, అర్బన్ పరిధిలోని ఐదు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. రూరల్‌లో 23 మంది నామినేషన్లు వేయగా, ఒకదానిని అధికారులు తిరస్కరించారు. పుప్పాల శోభ, నిమ్మ మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రంగంలో మిగిలిన 19 మంది ఏకగ్రీవమయ్యా రు.
ఇందులో 18 స్థానాలు టీఆర్ఎస్కు దక్కగా, కాంగ్రెస్ ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. అర్బన్‌లో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. 24 నామినేషన్లు రాగా, ఐదు తిరస్కరణకు గురయ్యా యి. సుదం లక్ష్మి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మిగిలిన 18 మంది ఐదు స్థానాల కోసం తలపడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు మంగళవారం విడుదల చేశారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆరు గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. 141 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రూరల్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైంది వీరే
సామెల్ చిన్నబాలి, నాగుల శ్రీలత, కిషన్ నేనావత్, లక్ష్మీ బదావత్, రమేశ్ నంద, తానాజీరావు, మాధవరావు, విజయ జం గం, లక్ష్మీ దాసరి, విమల వెల్మల, అమిత ఎనుగందుల, గడ్డం సుమనారెడ్డి, లత కున్యోత్, సావిత్రి మద్ది, జొన్న ప్రతాప్‌రెడ్డి, పడిగెల రాజేశ్వర్‌రావు, మధుసూదన్‌రావు, శంకర్ పుప్పాల. (వీరంతా టీఆర్ఎస్కు చెందినవారు) కాంగ్రెస్ నుంచి సుజ అయిత ఎన్నియ్యారు.
అర్బన్ స్థానాలకు పోటీలో ఉన్నది వీరే!
బీసీ మహిళ (ఒక స్థానం) బోండ్ల సుజాత, బోగడమీది శ్రీదేవి. బీసీ జనరల్ (ఒక స్థానం) ఖాజా షరీఫుద్దీన్, దారం సాయిలు, జొన్నల నర్సింహులు, మహ్మద్ అబ్దుల్ గఫార్, మహ్మద్ నసీర్, మహ్మద్ షకీల్ అహ్మద్, బి. రామస్వామి, శేక్ అజీముద్దీన్. జనరల్ మహిళ (రెండు స్థానాలు) బి.లత, పి. లావణ్య, విశాలినీ రెడ్డి. జనరల్ (ఒక స్థానం) అంకు దామోదర్, కోగుల నర్సయ్య, దామోదర్‌రెడ్డి, మ్లలన్న గారి భూంరెడ్డి, ముస్తాబ్ అహ్మద్.