nizeria
-
బీఎండబ్ల్యూలో తండ్రి శవాన్ని ఉంచి..
లాగోస్ : ఎవరైనా మరణిస్తే వారి ఆచార వ్యవహారాలకు అనుగుణంగా భౌతికకాయాన్ని పాతిపెట్టడమో, దహన సంస్కారాలు నిర్వహించడమో చేస్తారు. కానీ నైజీరియాకు చెందిన అజుబుకి అనే వ్యక్తి తన తండ్రి శవాన్ని ఏకంగా బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ కారులో ఉంచి సమాధి చేశారు. నైజీరియాలోని మారుమూల గ్రామం ఎంబొసిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫోటో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బీఎండబ్ల్యూ కారులో ఉంచిన మృతదేహాన్ని సమాధి చేసేందుకు ఆరు అడుగుల లోతున గుంటను తవ్వారు. తాను ఎప్పటికైనా ఖరీదైన కారును కొంటానని అజుబుకి తరచూ తన తండ్రితో చెప్పేవారు. తండ్రి మరణంతో వెనువెంటనే బీఎండబ్ల్యూ కారును కొన్న అజుబుకి మృతదేహాన్ని కారులో ఉంచి సమాధి చేయడం చూపరులకు విస్తుగొలుపుతోంది. మరోవైపు తన తండ్రిని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సహకరించేలా కారులో శాటిలైట్ నావిగేషన్‌ను ఏర్పాటు చేసినట్టు ది సన్ పత్రిక పేర్కంది. మొత్తానికి అజుబుకి నిర్ణయం ఇంటర్నెట్ను ఊపేస్తోంది. దీనిపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. తండ్రిపై అజుబకి ప్రేమను కొందరు సమర్ధిస్తుండగా, దీనికి ఖర్చు చేసిన మొత్తం పేదలకు సాయపడేందుకు ఉపయోగిస్తే బావుండేదని మరికొందరు వ్యాఖ్యానించారు. -
నైజీరియాలో 69 మంది అగ్నికి ఆహుతి
లాగోస్: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ పెట్రోలు ట్యాంకర్ అదుపుతప్పి బస్‌స్టేషన్‌లోకి దూసుకుపోవడంతో మంటలు చెలరేగి 69 మంది అగ్నికి ఆహుతయ్యారు. అనంబ్రా రాష్ట్రంలోని ఒనిట్షాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో 12 బస్సులతోపాటు పలు వాహనాలు దెబ్బతిన్నాయి. చాలామంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రవాణాకు కాలం చెల్లిన వాహనాలను వినియోగించడం, రోడ్లు అత్యంత అధ్వానంగా ఉండడంతో నైజీరియాలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. -
నైజీరియాలో కాలేజీపై మిలిటెంట్ల దాడి 50 మంది మృతి
అబుజా: నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని ఒక కాలేజీపై ఆదివారం మిలిటెంట్లు జరిపిన దాడిలో 50 మంది మృతి చెందారు. యోబె రాష్ట్రంలోని గుజ్బాలో వ్యవసాయ కళాశాల హాస్టల్‌పై సాయుధ మిలి టెంట్లు కాల్పులకు తెగబడ్డారు. విద్యార్థులందరూ గాఢనిద్రలో ఉండగా ఈ దాడి జరిగింది. దాడిలో 50 మంది విద్యార్థులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. యోబె రాజధాని దమాతురులోని ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అకస్మాత్తుగా దాడి జరగడంతో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత మిలిటెంట్లు కళాశాలకు నిప్పుపెట్టారని సైనిక ప్రతినిధి లాజరస్ ఎలీ చెప్పారు. ఈ దాడి ‘బోకో హరామ్’ ఇస్లామిక్ మిలిటెంట్ల పనేనని అనుమానిస్తున్నారు