నైజీరియాలో కాలేజీపై మిలిటెంట్ల దాడి 50 మంది మృతి | 50 students died in nizeria ,attacked by militants | Sakshi
Sakshi News home page

నైజీరియాలో కాలేజీపై మిలిటెంట్ల దాడి 50 మంది మృతి

Published Mon, Sep 30 2013 3:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

నైజీరియాలో కాలేజీపై మిలిటెంట్ల దాడి  50 మంది మృతి - Sakshi

నైజీరియాలో కాలేజీపై మిలిటెంట్ల దాడి 50 మంది మృతి

 అబుజా: నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని ఒక కాలేజీపై ఆదివారం మిలిటెంట్లు జరిపిన దాడిలో 50 మంది మృతి చెందారు. యోబె రాష్ట్రంలోని గుజ్బాలో వ్యవసాయ కళాశాల హాస్టల్‌పై సాయుధ మిలి టెంట్లు కాల్పులకు తెగబడ్డారు. విద్యార్థులందరూ గాఢనిద్రలో ఉండగా ఈ దాడి జరిగింది. దాడిలో 50 మంది విద్యార్థులు మృతి చెందినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. యోబె రాజధాని దమాతురులోని ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అకస్మాత్తుగా దాడి జరగడంతో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు కళాశాల ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ తర్వాత మిలిటెంట్లు కళాశాలకు నిప్పుపెట్టారని సైనిక ప్రతినిధి లాజరస్ ఎలీ చెప్పారు. ఈ దాడి ‘బోకో హరామ్’ ఇస్లామిక్ మిలిటెంట్ల పనేనని అనుమానిస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement