No 1
-
ప్రపంచంలోనే నంబర్‌వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా?
ముంబై: హోటల్స్ ర్యాంకింగ్‌కు సంబంధించిన ట్రావెలర్స్ చాయిస్ అవార్డ్స్ (2023)లో జైపూర్‌కి చెందిన రాంబాగ్ ప్యాలెస్ ప్రపంచంలోనే నంబర్ వన్ హోటల్‌గా నిల్చింది. 1835 నాటి ఈ ప్యాలెస్‌ను ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) హోటల్‌గా తీర్చిదిద్ది, నిర్వహిస్తోంది. దీన్ని ’జ్యుయల్ ఆఫ్ జైపూర్’గా కూడా వ్యవహరిస్తుంటారు. ట్రావెల్ సైట్ ట్రిప్అడ్వైజర్ వార్షికంగా ప్రకటించే.. పర్యాటకులు మెచ్చిన హోటల్స్ జాబితాలో మాల్దీవులకు చెందిన ఓజెన్ రిజర్వ్ బాలిఫుషి, బ్రెజిల్‌లోని హోటల్ కోలీన్ డి ఫ్రాన్స్ రెండు, మూడో స్థానాల్లో నిల్చాయి. తమ పోర్టల్‌లో నమోదైన 12 నెలల డేటా (2022 జనవరి 1 నుంచి – డిసెంబర్ 31 వరకు) విశ్లేషణ ఆధారంగా ట్రిప్అడ్వైజర్ ఈ ర్యాంకులు ఇచ్చింది. భారత్‌లోని టాప్ 10 హోటల్స్ ఇవే.. రాంబాగ్ ప్యాలెస్ - జైపూర్ తాజ్ కృష్ణ - హైదరాబాద్ వెస్టిన్ గోవా - గోవా బ్లాంకెట్ హోటల్ అండ్ స్పా - పల్లివాసల్ చండీస్ విండీ వుడ్స్ - చితిరపురం జేడబ్ల్యూ మారియట్ హోటల్ పూణే - పూణే షెరటన్ గ్రాండ్ చెన్నై రిసార్ట్ అండ్ స్పా - చెన్నై కోర్ట్ యార్డ్ అమృత్సర్ - అమృత్సర్ జేడబ్ల్యూ మారియట్ హోటల్ బెంగళూరు - బెంగళూరు లీలా ప్యాలెస్ ఉదయపూర్ - ఉదయపూర్ ఇదీ చదవండి: ఎల్ఐసీకి మంచి రోజులు.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులకు పెరిగిన విలువ -
నెంబర్‌వన్ బ్రాండ్‌గా ఫ్రీడమ్ రిఫైండ్
హైదరాబాద్: సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగం అమ్మకాల్లో ‘ఫ్రీడమ్’ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దేశంలోనే అగ్రగామి బ్రాండ్‌గా నిలిచింది. రాజీలేని నాణ్యత, ఉత్పత్తిలో స్థిరత్వం, విస్తృతస్థాయి పంపిణీ నెట్వర్క్, ఫ్రీడమ్ బ్రాండ్ల పట్ల కస్టమర్లకు ఉన్న నమ్మకంతోనే ఈ ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. ‘‘సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగపు మార్కెట్లో 20.5శాతం వాటాను సొంతం చేసుకొని దేశంలోనే నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలువడం సంతోషంగా ఉంది’’ అని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ చౌదరి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఫ్రీడమ్ బ్రాండ్‌ను దేశమంతా విస్తరించేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గత దశాబ్ద కాలంగా కస్టమర్లు చూపుతున్న విశ్వాసం, అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ శ్రీ పీ చంద్రశేఖర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
స్త్రీల హక్కులు, భద్రతలో డెన్మార్ నం.1
డిసెంబర్ 10 ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా ఐక్యరాజ్య సమితి లింగవివక్ష లేని, సమాన అవకాశాలు కలిగిన ప్రపంచమే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా నవంబర్ 25ని ‘మహిళలపై హింసావ్యతిరేక దినోత్సవం’గా గుర్తించింది. అప్పటి నుంచి డిసెంబర్ 10 వరకు స్త్రీపురుష సమానత్వాన్ని చాటుతూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్త్రీల హక్కులూ మానవహక్కులుగా గుర్తించమని చెప్పడమే ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం. స్త్రీల హక్కులు మానవ హక్కులే స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో ఎందుకు భాగం కాదు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. నిజానికి వారి శారీరక, మానసిక, భౌతిక అవసరాల రీత్యా స్త్రీలకు కొన్ని ప్రత్యేక హక్కులుండాలని ఐక్యరాజ్యసమితి గుర్తించి వాటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మలిచింది. అయితే వాటికిప్పటికింకా సమాజంలో ఆమోదముద్ర పడలేదన్నది కాదనలేని సత్యం. ఇప్పటికీ అది చేరుకోవాల్సిన లక్ష్యం. స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో భాగమేనని గుర్తించిన దేశాలు బహు తక్కువని 2019 లింగ సమానత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 129 దేశాల్లో జరిపిన అధ్యయనంలో సంపూర్ణంగా లింగ సమానత్వాన్ని సాధించిన దేశాలు లేనేలేవన్న విషయం వెల్లడయ్యింది. అయితే స్త్రీపురుష సమానత్వం కోసం కృషి చేస్తోన్న దేశాల్లో కొంతలో కొంత మెరుగైన ఫలితాలను సాధించడం గమనించాల్సిన విషయం. కొన్ని దేశాల్లో కొంత మెరుగు... 2019లో జరిగిన సర్వే ప్రకారం లింగ సమానత్వం వైపు పురోగమిస్తోన్న టాప్ టెన్ దేశాల్లో డెన్మార్క్‌ది తొలిస్థానం. ఫిన్లాండ్ ద్వితీయస్థానంలో; స్వీడన్ మూడవ స్థానంలో ఉన్నాయి. నార్వే నాలుగు, నెదర్లాండ్స్ ఐదు, స్లోవేనియా ఆరు, జెర్మనీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. కెనడా ఎనిమిదవ స్థానంలో ఉండగా, ఐర్లాండ్ తొమ్మిదవ స్థానాన్ని, ఆస్ట్రేలియా పదో స్థానాన్ని దక్కించుకున్నాయి. సమానత్వంలో టాప్ డెన్మార్క్... స్త్రీల విషయంలో టాప్ వన్ స్థానంలో నిలిచిన డెన్మార్క్ గురించి ఇప్పుడు మిగిలిన దేశాలు దృష్టి పెట్టాయి. డెన్మార్క్‌లో నాలుగ్గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. అంటే డెన్మార్క్‌లో దీర్ఘరాత్రులుంటాయి. అయితే అక్కడ చీకటి అభద్రతకు చిహ్నం కాదు. ఆ దేశంలో మహిళలు పగలే కాదు రాత్రిళ్ళు కూడా అత్యంత సురక్షితంగా ఉంటారు. స్త్రీ పురుష సమానత్వాన్ని సా«ధించేందుకు ఆ దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు సంక్షేమ రాజ్యంగా కూడా డెన్మార్క్‌ని పేర్కొంటారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో స్త్రీపురుష సమానత్వాన్ని విస్తృతంగా ముందుకు తెచ్చింది డెన్మార్క్ ప్రభుత్వం. డెన్మార్క్‌లో ఉపాధిరంగంలో ఉన్న మహిళలు అత్యధికంగా ఉన్నారు. స్త్రీ అయినా పురుషులు అయినా ఒకే విధమైన వేతన విధానాన్ని అనుసరించారు. ఆర్థిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నిర్ణయాత్మక పాత్రలో మహిళలకూ సమ ప్రాధాన్యముంది. 2014 ఎన్నికల అనంతరం 30 శాతం మంది మంత్రులూ, 37 శాతం మంది పార్టీ నాయకులూ స్త్రీలే ఉన్నారు. వివిధ కంపెనీల్లో బోర్డు మెంబర్లుగా ఉన్న స్త్రీల శాతం పెరిగింది. ఇక్కడ స్త్రీలు 61 ఏళ్ళకు రిటైర్ అయితే, పురుషులకది 63 ఏళ్ళు. పునరుత్పత్తి హక్కులు... వివాహ వయస్సు, పునరుత్పత్తి హక్కుల విషయంలో డెన్మార్క్ ముందుంది. 2012లో ఇక్కడ స్త్రీలు తొలి బిడ్డను కనే వయస్సు 29. 52 వారాల పేరెంటల్ లీవ్ అమలుచేస్తున్నారు. అత్యధిక శాతం తల్లులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. భర్తలకు ఇచ్చే పిల్లల పెంపకానికి సంబంధించిన సెలవుని సైతం పెంచారు. పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత... మహిళా ఉద్యోగుల పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాల్లో సైతం డెన్మార్క్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వమే పిల్లల సంరక్షణ బాధ్యతను వహిస్తోంది. వాటి పర్యవేక్షణకు సరిపడే అధికారులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 2013లో 0–2 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లల్లో 67.9 శాతం మందిని ప్రభుత్వం నిర్వహించే చైల్డ్ కేర్ సెంటర్లలో చేర్పించారు. అదే ఏడాది 3–5 ఏళ్ళ మధ్యవయస్సు పిల్లల్లో 97.2 శాతం మందిని చేర్పించారు. మానవ అక్రమ రవాణానిషేధంపై డెన్మార్క్ ప్రత్యేక దృష్టి సారించింది. –అరుణ అత్తలూరి -
నంబర్1 బ్రాండ్ హెచ్డీఎఫ్సీ బ్యాంకే
ముంబై: దేశంలోని గొప్ప బ్రాండ్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నంబర్ 1 గా తన స్థానాన్ని కాపాడుకుంది. దేశంలో అత్యంత విలువైన మొదటి 50 బ్రాండ్ల వివరాలను ‘బ్రాండ్జ్ ఇండియా టాప్ 50’ పేరుతో ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ, పరిశోధనా సంస్థ కంటార్ మిల్వర్డ్ బ్రౌన్ సంస్థలు బుధవారం ముంబైలో ప్రకటించాయి. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నంబర్ 1 స్థానంలో కొనసాగడం వరుసగా నాలుగో ఏడాది. 2014 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన బ్రాండ్ విలువను 9.4 బిలియన్ డాలర్ల నుంచి 18 బిలియన్ డాలర్లకు పెంచుకుంది. కొత్తగా జాబితాలో 7 సంస్థలకు చోటు దక్కింది. టెలికంలోకి కొత్తగా ప్రవేశం చేసిన రిలయన్స్ జియో 11వ స్థానం సంపాదించింది. ఇంకా డీమార్ట్, వర్ల్‌పూల్, బజాజ్ అలియాంజ్, కెనరా బ్యాంకు, సన్ డైరెక్ట్, డిష్‌టీవీలు కొత్తగా జాబితాలోకి వచ్చిన వాటిలో ఉన్నాయి. భారత కస్టమర్లు కచ్చితత్వంతోపాటు డబ్బుకు తగ్గ విలువను చూస్తున్నారని పరిశోధనా సంస్థ కంటార్ మిల్వర్డ్ బ్రౌన్ తెలిపింది. భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ల విలువ గత ఏడాదిలో 21% పెరిగి 109.3 బిలియన్ డాలర్లకు చేరినట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
చైనాను బీట్ చేసి మరీ నెం.1గా భారత్
టూ వీలర్ మార్కెట్లో భారత్ చైనాను బీట్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్ వ్యవస్థగా నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి చైనా విక్రయించిన 16.8 మిలియన్ యూనిట్లతో పోలిస్తే, 2016 నాటికి 17.7 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ విషయంలో చైనాను అధిగమించిందని నివేదికలు వెల్లడించాయి. డీమానిటైజేషన్, బీఎస్ -3 వాహనాల నిషేధం, బీఎస్ -4 నిబంధనల ప్రభావం ఉన్నప్పటికీ భారత్ మార్కెట్ నెంబర్ 1గా స్థానాన్ని నిలిచిందని సియామ్ వెల్లడించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్ (ఎస్ఐఎఎమ్) అందించిన నివేదిక ప్రకారం ఇప్పటివరకూ ద్విచక్ర వాహన మార్కెట్ లో నెం. 1స్థానంలో ఉన్న చైనాను వెనక్కినెట్టిన ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ మార్కెట్‌గా అవతరించింది. గత నాలుగేళ్లుగా ఈ సెగ్మెంట్లో భారీ డిమాండ్ నెలకొందని తెలిపింది. 2011-12 లో 13 మిలియన్ల వాహనాలను అమ్ముడు బోతే 2016-15లొ 16మిలియన్లకు, 2016-17 నాటికి 17 మిలియన్లకు డిమాండ్ పెరిగిందని రిపోర్ట్ చేసింది. మార్చి 30, 31, 2017 లో ద్విచక్ర పరిశ్రమ రూ. 600 కోట్ల రూపాయలని అంచనా వేశామని ఇక్రా సీనియర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా రే తన నివేదికలో తెలిపారు. చైనా మార్కెట్లో గత కొన్నాళ్లుగా వివిధకారణాల రీత్యా టూ వీలర్స్ డిమాండ్ క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా దేశంలో కార్ల డిమాండ్ పెరగడం, ద్విచక్ర వాహనాలపై అధిక దిగుమతుల ఖర్చు పెరగడం ద్విచక్ర వాహన తయారీదారులకి కష్టంగా మారింది. దీంతో చైనా ఈ సెగ్మెంట్లో రెండవ స్థానానికి పడిపోయింది. కాగా ఏప్రిల్ అమ్మకాల్లో హీరో ను వెనక్కి నెట్టిన బజాజ్ ఆటో రెండవ అతిపెద్ద బైక్స్-మేకర్ గా నిలిచింది. అంతేకాదు దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థగా హీరోనిఅధిగమించే దిశగా దూసుకుపోతోంది. గత ఏడాది 1,50,711 యూనిట్లతో పోలిస్తే, ఈ నెలలోనే 22 శాతం వృద్ధితో 1,83,266 యూనిట్లను విక్రయించినట్లు బజాజ్ ప్రతినిధి గులెరియా తెలిపారు. మొత్తం వాల్యూమ్స్ లో 34 శాతం వృద్ధితో మార్కెట్ లో రెండవ స్థానంలో నిలిచామన్నారు. ఏప్రిల్ నెలలో బజాజ్ ఆటో అమ్మకాలు 19 శాతం పెరిగి 1,61,930 యూనిట్లు విక్రయించాయి. జపాన్ ద్విచక్ర వాహన కంపెనీ 21,336 యూనిట్లు విక్రయించగా, మార్కెట్ లీడర్ హీరో మోటో కార్ప్‌తో 12,377 యూనిట్లు మాత్రమే. అలాగే మార్చి 31 తో ముగిసిన నాల్గవ త్రైమాసికానికి రూ. 1,888 కోట్ల ఆదాయంతో రాయల్ ఎన్ఫీల్డ్ అత్యధిక త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించింది.