స్కూలుకు పుస్తకాలు అక్కర్లేదు!
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మహారాష్ట్రలో విద్యార్థులకు ఓ మంచి వరం ప్రకటించారు. విద్యార్థులెవరూ గురువారం ఒక్క రో్జు ఇళ్ల నుంచి పుస్తకాల సంచులు తేనక్కర్లేదని, స్కూళ్లలో కూడా క్లాసుకు సంబంధంలేని మామూలు పుస్తకాలు చదవాలని చెప్పారు. కలాం జయంతి సందర్భంగా మహారాష్ట్రలో ప్రతియేటా అక్టోబర్ 15వ తేదీని 'రీడర్స్ డే'గా జరుపుకొంటున్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్లలో 'గిఫ్ట్ ఎ బుక్' కార్యక్రమాన్ని అమలుచేయాలని, పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వచన్ ప్రేరణా దిన్ సందర్భంగా మంత్రి తావ్డే ఓ జిల్లా పరిషత్ హైస్కూలును సందర్శించి, అక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రీడింగ్ హబ్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాల బాక్సును బహూకరించారు.