హెచ్సీయూ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో విద్యార్థులకు నిత్యవసరాలైన ఆహారం, నీరు, విద్యుత్తు అందకుండా చేయడం ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మానవవనరుల మంత్రిత్వశాఖ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లకు నోటీసులు జారీ చేసింది.
ఆ ఘటనపై వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థుల వ్యవహారంలో పోలీసులు, పాలకమండలి వైకరిపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం చెందింది. విద్యార్థులకు ఆహారం, నీరు, విద్యుత్తు అందకుండా చేయడంపై కమిషన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసరి పరిస్థితి తలెత్తిందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది.