కౌలు..దిగాలు
ఏలూరు (మెట్రో) :కౌలు రైతులకు రుణాలు అందని ద్రాక్షగానే మారాయి. జిల్లాలో ఐదు లక్షల మందికి పైగా రైతులు ఉండగా, వారిలో 70 శాతం కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 3.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో 3.25 లక్షల మందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారిలో 70వేల మందికి రుణాలిచ్చామని బ్యాంకర్లు చెబుతున్నారు. అంటే 2.55 లక్షల మంది రుణాలకు దూర మయ్యారు. వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రకారం ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.3,700 కోట్లను పంట రుణాలుగా ఇస్తామని బ్యాంకర్లు ప్రకటించారు. ఇందులో కౌలు రైతులకు ఇచ్చింది రూ.100 కోట్లు మాత్రమే. దీంతో వారెవరూ పంటకు బీమా చేయించుకోలేకపోయారు. కలెక్టర్ చీవాట్లు పెట్టినా బ్యాంకర్లలో మార్పు రావడం లేదు.
రుణం అందలేదు
బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా. అధిక వడ్డీలకు
అప్పు తెచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాం. పంట పండి లాభం వస్తే అప్పులు తీరుస్తాం. లేదంటే వడ్డీలు కట్టుకోవడమే. – గురజాల బాలాజీ, కురెళ్లగూడెం
సగం మందికైనా ఇవ్వలేదు
జిల్లాలోని 70 శాతం భూముల్లో కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. వీరిలో సగం మందికి కూడా రుణాలు ఇవ్వలేదు. కౌలుదారుల చట్టానికి తూట్లు పొడుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. – కె.శ్రీనివాస్, కార్యదర్శి, జిల్లా కౌలు రైతుల సంఘం
లక్ష్యానికి మించి రుణాలిచ్చాం
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష్యానికి మించి రుణాలిచ్చాం. వార్షిక ప్రణాళికతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తున్నాం. రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఎటువంటి ఇబ్బందులూ పెట్టడం లేదు.– ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్
– కె.శ్రీనివాస్, కార్యదర్శి, జిల్లా కౌలు రైతుల సంఘం
లక్ష్యానికి మించి రుణాలిచ్చాం
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో లక్ష్యానికి మించి రుణాలిచ్చాం. వార్షిక ప్రణాళికతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తున్నాం. రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు ఎటువంటి ఇబ్బందులూ పెట్టడం లేదు.– ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్