no pain
-
నీటిలో జననం... పురిటి నొప్పులు దూరం
న్యూఢిల్లీ: సాధారణంగా గర్భిణులు డెలివరీ డేట్ దగ్గరకొస్తోందంటే సిజేరియన్ చేయించుకోవాల్సి ఉంటుందనీ, లేదా పురిటి నొప్పులు భరించాల్సి ఉంటుందని ఎంతో ఆందోళన చెందుతుంటారు. అయితే నీటి జననాలు (వాటర్ బర్త్స్)ను ఎంచుకుంటే నొప్పులు పెద్దగా ఉండవనీ, ప్రశాంతంగా కాన్పు అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మన దేశంలో చాలా మందికి ఇంకా అవగాహన కూడా లేని ఈ విధానాన్ని పాశ్యాత్య దేశాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. నీటి జననాల పద్ధతిలో గర్భిణిని ఒక పెద్ద నీటితొట్టెలో కూర్చోబెట్టి ప్రసవం అయ్యేలా చూస్తారు. అయితే సిజేరియన్ కచ్చితంగా అవసరమైన వారు, ఇంతకుముందు సిజేరియన్ చేయించుకున్నవారు, కవల పిల్లలు పుట్టేవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భందాల్చి 37 వారాలు నిండకముందే నొప్పులు వచ్చిన వారికి ఈ విధానం శ్రేయస్కరం కాదు. -
అప్పుడు దెబ్బతగిలినా నొప్పి ఉండదు!
లండన్: నడిచేటప్పుడు కాలికి చిన్న రాయి తగిలినా భరించలేనంత నొప్పి కలుగుతుంది. అయితే నిద్రలో నడిచేటప్పుడు మాత్రం ఎంత పెద్ద గాయం అయినా, భవనంపై నుంచి పడి కాలు విరిగినా ఏ మాత్రం నొప్పి ఉండదంట!. అయితే తలనొప్పి, పార్శ్వపునొప్పి(ఒకపక్క తలనొప్పి) ప్రమాదం మాత్రం ఎక్కువగా ఉంటుందంట. ఈ మేరకు లండన్లో నిద్రలో నడిచే వారిపై జరిపిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 79 శాతం మంది తాము నిద్రలో నడిచేటప్పుడు గాయం అయినా నొప్పి తెలియదని చెప్పారు. అయితే మెలుకువ వచ్చినప్పడు మాత్రం ఈ బాధేంటో బాగా తెలుస్తోందంట. ముప్పై ఏళ్ల వయసున్న వారిపై జరిపిన ఈ సర్వేలో 55 మంది పురుషులు, 45 మంది మహిళలు పాల్గొన్నారు. నిద్రలో నడిచిన ప్రతిసారీ తమకు కనీసం ఒక గాయం అయ్యిందని 47 మంది వెల్లడించారు. వీరిలో కేవలం పది మందికి మాత్రమే గాయం అయిన వెంటనే నొప్పి తెలిసిందంట. మిగతా 37 మందికి మాత్రం ఉదయాన్నో లేదా మేల్కొన్న తర్వాత నొప్పి కలిగిందంట. ఉదహారణకు నిద్రలో నడిచే వ్యక్తి మూడో అంతస్తులో ఉంటున్నాడనుకోండి. నిద్రలో నడుస్తూ కిటికిలోంచి కిందకు పడి తీవ్ర గాయాలు అయినా, అప్పుడు నొప్పి తెలియదు. మేల్కొన్న తర్వాత గాయాలు తాలుకూ నొప్పి తెలుస్తుంది. మరో వ్యక్తి తన ఇంటిపై నుంచి పడి కాలు విరిగినా ఉదయం వరకు నిద్రలేవడంట.