న్యూఢిల్లీ: సాధారణంగా గర్భిణులు డెలివరీ డేట్ దగ్గరకొస్తోందంటే సిజేరియన్ చేయించుకోవాల్సి ఉంటుందనీ, లేదా పురిటి నొప్పులు భరించాల్సి ఉంటుందని ఎంతో ఆందోళన చెందుతుంటారు. అయితే నీటి జననాలు (వాటర్ బర్త్స్)ను ఎంచుకుంటే నొప్పులు పెద్దగా ఉండవనీ, ప్రశాంతంగా కాన్పు అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మన దేశంలో చాలా మందికి ఇంకా అవగాహన కూడా లేని ఈ విధానాన్ని పాశ్యాత్య దేశాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.
నీటి జననాల పద్ధతిలో గర్భిణిని ఒక పెద్ద నీటితొట్టెలో కూర్చోబెట్టి ప్రసవం అయ్యేలా చూస్తారు. అయితే సిజేరియన్ కచ్చితంగా అవసరమైన వారు, ఇంతకుముందు సిజేరియన్ చేయించుకున్నవారు, కవల పిల్లలు పుట్టేవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భందాల్చి 37 వారాలు నిండకముందే నొప్పులు వచ్చిన వారికి ఈ విధానం శ్రేయస్కరం కాదు.
Comments
Please login to add a commentAdd a comment