Delivery Date
-
రామ్ చరణ్ కి అసలయిన గేమ్ ఛేంజెర్ వస్తున్నాడా..
-
లోకాన్ని చూపించకుండానే..!
సాక్షి, నిర్మల్ : కళ్లు తెరిచి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడదామని 9 నెలలపాటు తల్లి కడుపులో తలదాచుకున్న ఆ పసికందు బయటకు రాకముందే కన్నుమూసింది. కన్నబిడ్డను కళ్లారా చూసి 9 నెలలు పడిన కష్టం మరిచిపోదామనుకున్న ఆ తల్లి కూడా తన ఆశ నెరవేరకుండానే తనువు చాలించింది. ఈ విషాద ఘటన మండలంలోని ప్యారమూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమా..? విధి వంచించిందో.. తెలియదుగాని ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. ప్యారమూర్‌కు చెందిన మమత(21) అదేగ్రామానికి చెందిన క్యాతం సంతోష్‌ను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. మమత గర్భం దాల్చినప్పటినుంచి ప్రతినెలా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటోంది. మమతకు నెలలు నిండడంతో రెండురోజుల క్రితం బంధువుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పురుడుకు ఇంకా సమయం ఉందని చెప్పడంతో అదే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అదేరోజు సాయంత్రం వైద్యురాలు వచ్చి మమతను పరీక్షించి ప్రసవం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కడుపులోనే పాప మృతిచెందినట్లు గుర్తించారు. మమత పరిస్థితి విషమంగా మారడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ కూడా సరైన వైద్యం అందించలేదని, అడ్వాన్సు చెల్లించేవరకూ వైద్యులు రాలేదని మమత భర్త సంతోష్ తెలిపారు. డబ్బులు చెల్లించాక.. పరీక్షించి.. వైద్యం అందించేలోపే పరిస్థితి విషమించి మమత ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారని బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. సమయానికి వైద్యం అంది ఉంటే.. మమతకు సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతోనే తన భార్య మృతి చెందినట్లు సంతోష్ ఆరోపించారు. నిర్మల్‌లోని ఆసుపత్రికి సకాలంలో వెళ్లామని, వైద్యులు ఆలస్యంగా స్పందించడంతోనే పాపతోపాటు తల్లి కూడా ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య మృతికి కారణమైన రెండు ఆసుపత్రుల వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
నీటిలో జననం... పురిటి నొప్పులు దూరం
న్యూఢిల్లీ: సాధారణంగా గర్భిణులు డెలివరీ డేట్ దగ్గరకొస్తోందంటే సిజేరియన్ చేయించుకోవాల్సి ఉంటుందనీ, లేదా పురిటి నొప్పులు భరించాల్సి ఉంటుందని ఎంతో ఆందోళన చెందుతుంటారు. అయితే నీటి జననాలు (వాటర్ బర్త్స్)ను ఎంచుకుంటే నొప్పులు పెద్దగా ఉండవనీ, ప్రశాంతంగా కాన్పు అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. మన దేశంలో చాలా మందికి ఇంకా అవగాహన కూడా లేని ఈ విధానాన్ని పాశ్యాత్య దేశాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. నీటి జననాల పద్ధతిలో గర్భిణిని ఒక పెద్ద నీటితొట్టెలో కూర్చోబెట్టి ప్రసవం అయ్యేలా చూస్తారు. అయితే సిజేరియన్ కచ్చితంగా అవసరమైన వారు, ఇంతకుముందు సిజేరియన్ చేయించుకున్నవారు, కవల పిల్లలు పుట్టేవారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భందాల్చి 37 వారాలు నిండకముందే నొప్పులు వచ్చిన వారికి ఈ విధానం శ్రేయస్కరం కాదు. -
ప్రాణం తీసిన ముద్దు!
విధివిలాపం ఎంతో ఆరోగ్యంగా పుట్టిన బిడ్డ 24 రోజులకే కన్ను మూస్తే ఆ తల్లిదండ్రుల బాధను వర్ణించగలమా? ఈ విషాద ఉదంతం ఓ ఆస్ట్రేలియన్ దంపతులది. డెలివరీ డేట్ వచ్చినా ఇంకా నొప్పులు రాకపోవడంతో తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసీ 28 ఏళ్ల సరా పగ్ సిజేరియన్ చేయించుకొని మరీ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ పాపకు ఎల్లాయిస్ లాంప్టన్ అని పేరు పెట్టారు. తమకు గారాల పట్టి పుట్టిందని క్వీన్స్లాండ్ సిటీలో అందరికీ చెప్పడం కోసం పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడు ఆ పసికందు తండ్రి డగ్లస్ లాంప్టన్. అదే తాను చేసిన పెద్ద పొరపాటని తర్వాత తెలుసుకున్నాడు. పార్టీకి వచ్చిన ఎంతోమంది పసిబిడ్డను చూసి మురిసిపోయారు. ముద్దుల మీద ముద్దులు పెట్టారు. లాంప్టన్ దంపతులకు పూల బొకేలు ఇచ్చి విషెస్ చెప్పి డిన్నర్ చేసి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు నుంచి పాప పాలు తాగడం మానేసింది. అలా రోజురోజుకు బరువు తగ్గడం మొదలైంది. ఓరోజు పాప మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఉండడం గమనించిన పగ్ ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. కంగారు పడిన తండ్రి వెంటనే బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. గంటలో పాపను పరీక్షించి రిపోర్టును తీసుకొచ్చింది నర్సు. పాపకు ఏదో వైరస్ సోకిందని, పరిస్థితి విషమంగా మారిందని చెప్పిన డాక్టర్ల మాటతో పాప తల్లి పగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ‘‘మీ పాపను జలుబుతో ఉన్న వారెవరో ముద్దు పెట్టుకున్నారు. దాంతో హెర్ప్స్ అనే వైరస్ పాప శరీరంలోకి చేరి బ్లడ్ ఇన్ఫెక్ట్ అయింది’’ అని చెప్పాడు డాక్టర్. ఇదంతా జరిగిన కొద్ది నిమిషాల్లోనే తల్లిదండ్రుల చేతుల్లో ఉన్న 24 రోజుల చిన్నారి శాశ్వతంగా కన్ను మూసింది. ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లలో జలుబుతో ఉన్న వారెవరో పాపను ముద్దు పెట్టుకొని పెద్ద తప్పు చేశారు. వారెవరో ఆ తల్లిదండ్రులకు తెలీదు. తెలిసినా ఏం చేస్తారు? ఆ మరుసటి రోజే పాప తండ్రి డగ్లస్ ఓ ఇంగ్లిష్ టీవీని కలసి తన గోడును చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు. ఇకనైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరూ చిన్న పిల్లల దగ్గరకు వెళ్లడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయకుండా ఉండేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరాడు డగ్లస్.