No power supply
-
ఆ ఊరిలో ఇప్పటి వరకు కరెంట్ లేదంట
-
పైసలిస్తేనే కరెంట్ ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసే దారులూ క్రమంగా మూసుకుపోతున్నాయి. తమకు రూ. 250 కోట్ల బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ను విక్రయించలేమని అనధికారికంగా పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్టీపీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్లకు కూడా తెలంగాణ డిస్కంలు భారీగా బకాయి పడ్డాయి. 15 రోజుల్లో బిల్లు చెల్లిస్తేనే తాము విద్యుత్ విక్రయిస్తామని ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తం సక్రమంగా రాకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. జూలై నుంచి బిల్లుల చెల్లింపులు నిల్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంల ఆర్థికపరిస్థితి కుంచించుకుపోతోంది. విద్యుత్‌కొనుగోలు, పంపిణీ ఖర్చు పెరిగినప్పటికీ చార్జీలు మాత్రం పెరగలేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తం రావడం లేదు. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో (ఉచిత విద్యుత్, గృహాలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసినందుకు) ప్రతినెలా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 393 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.208 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో డిస్కంలకు ఇప్పటివరకు 1,132 కోట్ల వరకు బకాయిపడింది. మరోవైపు వివిధ ప్రభుత్వశాఖలు, మునిసిపాలిటీలు, పంచాయతీలు కూడా విద్యుత్ బిల్లులను భారీగా చెల్లించాల్సి ఉంది. సబ్సిడీకి ఆర్థికశాఖ కొర్రీలు వేస్తోంది. రూ. 208 కోట్లకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది. దీంతో డిస్కంలకు విద్యుత్‌ను విక్రయించిన ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్టీపీసీ, టీ జెన్కోకు కూడా కలిపి మొత్తం 2 వేల కోట్ల బకాయిలున్నాయని అధికారులు అంటున్నారు. ఏపీలో బకాయిలు లేవు... ఏపీలో సెప్టెంబర్ 15 వరకు విద్యుత్ సరఫరా చేసిన అన్ని కంపెనీలకు ఏపీ డిస్కంలు బిల్లులు చెల్లించాయి. దీంతో ఏపీకే విద్యుత్ ఇచ్చేందుకు ఎన్టీపీసీతోపాటు అన్ని కంపెనీలు ముందు కొస్తున్నాయి. అందుకే ఏపీ 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొంటుంటే.. తెలంగాణకు కేవలం 3.5 ఎంయూల విద్యుత్తే దొరుకుతోంది. -
జిల్లా వ్యాప్తంగా నిలిచిన విద్యుత్ సరఫరా
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో వరుసగా నాలుగో రోజు బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ఉద్యోగులు ససేమిరా అంటుండడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. అయితే అధికారులకు, ఉద్యోగులకు కుదిరిన ఒప్పందం ప్రకారం రాత్రి పూట విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అంగీకరించడం కొంత ఊరటనిచ్చే అంశం. రాత్రి పూటే విద్యుత్.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు విద్యుత్ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పగలు కరెంట్ లేకపోవడంతో వ్యాపార వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఒంగోలు నగరంలో చిరువ్యాపారుల దగ్గర నుంచి బడా వ్యాపారుల వరకు విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లేకపోవడంతో జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోందనీ, ఆయిల్ ఖర్చు తడిసి మోపడవుతోందనీ విచారం వ్యక్తం చేస్తున్నారు. సెల్ టవర్లకూ తప్పని ఇబ్బంది రోజుల తరబడి విద్యుత్ లేకపోవడంతో కొన్ని చోట్ల సెల్ టవర్లు పనిచేయక ఫోన్లు, ఇంటర్నెట్లు మూగబోతున్నాయి. ఈ-సేవ కేంద్రాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. కరెంట్ లేక సర్వర్లు పనిచేయకపోవడంతో బిల్లులు కట్టించుకోలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ... జిల్లాలో ఈ సీజన్లో అధికంగా బోర్లపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ప్రస్తుత సీజన్లో పొగాకు నారు మడులు, ఇటు వరి నారుమడులను విస్తృతంగా సాగు చేస్తున్నారు. పొగాకు రైతులు అధికంగా బోర్లపైనే ఆధారపడ్డారు. పగటి పూట పూర్తిగా విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరా లేక కొన్ని చోట్ల నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆక్వా రైతులకు ఈ కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమలకూ తప్పని తిప్పలు: జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు, పాలింగ్ యూనిట్లతో పాటు, చిన్న తరహా పరిశ్రమలు వేల సంఖ్యలో ఉన్నాయి. పగటి పూట కరెంట్ లేకపోవడంతో ఈ పరిశ్రమలన్నీ పూర్తిగా మూతపడుతున్నాయి. పని లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం రాత్రిపూటే కరెంట్‌తో పరిశ్రమలు నిర్వహించడం కష్టమని కూలీలు, పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.