no profit
-
బంగారంలో తగ్గిన ఆదాయాలు
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2022 లో బంగారం ఇన్వెస్టర్లకు రాబడులను ఇవ్వ లేకపోయింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం తదితర అనిశ్చితులు బంగారం ధరలకు కీలకంగా మారాయి. ఈ ఏడాది డిసెంబర్ 22 వరకు నికరంగా బంగారం ధరలు 2 శాతం క్షీణించాయి. డాలర్‌తో రూపాయి సుమారు 11.5 శాతం క్షీణించడం వల్ల ఎంసీఎక్స్ గోల్డ్ ధరలు 13 శాతం పెరిగాయి. ఒక సాధనంగా బంగారంపై ఎన్నో అంశాలు ప్రభావం చూపిస్తాయని బంగారం ధరల్లో అస్థిరతలు తెలియజేస్తున్నాయి. ఈ అస్థిరతలకు దారితీసిన వివిద అంశాలు ఏంటి? 2023లో బంగారంలో పెట్టుబుడులు పెట్టే ఇన్వెస్టర్లకు రాబడుల అంచనాలను పరిశీలిస్తే.. ద్రవ్య విధాన కఠినతరం ప్రతికూలం యూఎస్ ఫెడ్ 2022లో ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడం మరింత సంక్లిష్టంగా మారింది. డాలర్ పరంగా బంగారం పనితీరు తగ్గడానికి ప్రధాన కారణం సెంట్రల్ బ్యాంకు దవ్య్ర పరపతి విధానాన్ని కఠినతరం చేయమే. అలాగే, బంగారం డిమాండ్‌ను ఆభరణాల డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల నుంచి కొనుగోలు డిమాండ్, గోల్డ్ ఈటీఎఫ్ లు, బంగారం బార్లు, నాణేలు నిర్ణయిస్తుంటాయి. నిల్వలు పెంచుకోవడం.. సెంట్రల్ బ్యాంకులు ఏటా తమ బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతున్నాయి. 2022 కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 2022 మూడో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 400 టన్నుల వరకు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా డేటా పేర్కొంది. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ సెంట్రల్ బ్యాంకులు నికరంగా కొనుగోళ్లు చేశాయి. దీంతో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి 673 టన్నుల కొనుగోలుకు దారితీసింది. 1967 తర్వాత మరే సంవత్సంతో పోల్చినా ఈ ఏడాదే అత్యధిక కొనుగోళ్లు జరిగాయి. ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు 2022 నవంబర్‌లో వరుసగా ఏడో నెల నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి నికరంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి 83 టన్నులకు సమానమైన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. కాయిన్లు, ఆభరణాల డిమాండ్ కరోనా సమయంలో నిలిచిపోయిన డిమాండ్ కూడా డోడు కావడంతో, మొదటి మూడు నెలల కాలంలో బంగారం బార్లు, కాయిన్లు, ఆభరణాల స్థిరమైన కొనుగోళ్లకు దారితీసింది. ఒకవైపు ఈ కొనుగోళ్లు, మరోవైపు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్‌ల పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావాన్ని కొంత భర్తీ చేసింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా నెలక్నొ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరలకు సరైన ప్రోత్సాహం లేదు. 2023పై అంచనాలు అధిక వడ్డీ రేట్లు, అధిక ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రష్యా, చైనాల్లో తిరోగమన పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఉత్పత్తి తగ్గింది. ఐరోపాలో క్షీణిస్తున్న వృద్ధి నేపథ్యంలో మాంద్యంపై చర్చకు దారితీసింది. చైనా వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంటుందన్న జూన్ అంచనాలను ప్రపంచబ్యాంకు 2.7 శాతానికి తగ్గించేసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో తగ్గడం అన్నది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ క్షీణతకు కారణమవుతుంది. డాలర్‌కు, కమోడిటీల మధ్య విలోమ సహ సంబంధం ఉంటుంది. రెండేళ్ల పాటు వరుసగా పెరిగిన డాలర్ ఇండెక్స్ ఇటీవల కొంత వరకు తగ్గింది. 2023లోనూ డాలర్ క్షీణత కొనసాగితే.. సహ విలోమ సంబంధం వల్ల బంగారం, వెండి లాభపడనున్నాయి. మరోవైపు మాంద్యం సమయాల్లో సహజంగా బంగారం మంచి పనితీరు రూపంలో రక్షణనిస్తుంది. గత ఏడు మాంద్యం సమయాల్లో ఐదు సందర్భాల్లో బంగారం సానుకూల రాబడులను ఇచ్చింది. కనుక 2023లో బంగారం రెండంకెల రాబడులను ఇస్తుందని అంచనా వేస్తున్నాం. బంగారం ధరలు 10 గ్రాములు రూ.58,000 వరకు పెరగొచ్చు. రూ.48,000–50,000 మధ్య కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతి పతనంలోనూ బంగారాన్ని సమకూర్చుకోవచ్చన్నది మా సూచన. ప్రథమేష్ మాల్య, ఏవీపీ – రీసెర్చ్, ఏంజెల్ వన్ లిమిటెడ్ -
ఎవరికీ ఆదాయం రాకుండా ప్రభుత్వ నిబంధనలు
ముంబై: చెల్లింపుల సర్వీసులు అందించే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం ఆర్జించేందుకు వీలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. దీని వల్ల చిన్న సంస్థలు బతికి బట్టకట్టడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ‘పేమెంట్స్ విభాగంలో మేము ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని వేరే దగ్గరెక్కడో డబ్బు సంపాదించుకోవాలే తప్ప పేమెంట్స్ విభాగంలో ఏ సంస్థా సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది‘ అని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి చెప్పరు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ సర్వీసులు ఉచితంగానే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలు సదరు సంస్థలకు సమస్యగా మారాయి. యూపీఐ సేవలకూ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు.. ఫ్రీచార్జ్ అనే పేమెంట్స్ కంపెనీని నిర్వహిస్తోంది. ‘ఆదాయం రాని సేవలు అందించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మాకు ఇతరత్రా అవకాశాలు కల్పించాలన్న సంగతి అర్థం చేసుకున్నా కూడా నియంత్రణ సంస్థలు పైసా రాని పనులెన్నో చేయాలంటూ బ్యాంకులను ఆదేశిస్తుంటాయి‘ అని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో బడా టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
ఆస్తుల జప్తుతో ప్రయోజనం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధులపై నమోదు చేస్తున్న కేసుల్లో ఆస్తుల జప్తుతో ప్రయోజనం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ, ఈడీ సంస్థల దర్యాప్తులు నత్తనడక సాగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తు జాప్యానికి తగిన కారణాలు తెలపడం లేదని పేర్కొంది. ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులు త్వరితగతిన విచారించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. పది పదిహేనేళ్లు గడిచినా ఛార్జిషీటు దాఖలు చేయనందుకు దర్యాప్తు సంస్థలు తగిన కారణాలు చెప్పడం లేదని పేర్కొంది. ‘‘మాజీలు సహా 51 మంది ఎంపీలు మనీల్యాండలింగ్ కేసులో నిందితులు. 28 కేసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నాయి. ఆయా కేసులు సుమారు ఎనిమిది పదేళ్ల నాటివి. 121 సీబీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 58 కేసులు ఉరి లేదా జీవితఖైదు శిక్ష విధించతగినవి. 2010 నుంచి కూడా కేసు పెండింగ్ ఉంది. 37 కేసుల్లో సీబీఐ ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. దర్యాప్తు సంస్థలను నిలదీయాలని మా ఉద్దేశం కాదు. దర్యాప్తు సంస్థల తీరుపై మేము ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదు. అలాచేస్తే వారి నైతికస్థైర్యం దెబ్బతింటుంది. వారిపైనా న్యాయమూర్తుల మాదిరి భారం ఉంది. ఎంత సంయమనం పాటించినా నివేదికలు నిలదీస్తున్నాయి’’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఛార్జిషీట్లు దాఖలు చేయకుండా ఆస్తులు జప్తు చేసి ఏం ప్రయోజనం ఉంటుందని సీజేఐ ప్రశ్నించారు. చాలా ఈడీ కేసుల్లో విదేశాల నుంచి స్పందన అవసరమని, సమాచారం సమయానికి అందడం లేదని, తద్వారా దర్యాప్తు జాప్యం అవుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దర్యాప్తు... కేసుల విచారణ వేగవంతం చేయండని చెప్పడం చాలా సులభమని, కానీ తగినంతగా న్యాయమూర్తులు లేరని సీజేఐ పేర్కొన్నారు. న్యాయమూర్తుల మాదిరే దర్యాప్తు సంస్థలు కూడా మానవ వనరులు లేక ఇబ్బందులు పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ సీబీఐ దర్యాప్తు కోరుతున్నారని సీజేఐ వ్యాఖ్యానించారు. దర్యాప్తులో జాప్యాన్ని తగ్గించడానికి ఓ పాలసీ రూపొందించాలని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు, మౌలిక సదుపాయాల ఏర్పాటు సమస్యగా ఉందన్న సీజేఐ దీని పరిష్కారం నిమిత్తం ప్రత్యేక కోర్టుల ఏర్పాటు దిశగా యోచిస్తామని పేర్కొన్నారు. దురుద్ధేశాలతో పెట్టిన కేసులను ఉపసంహరించే హక్కు రాష్ట్రాలకు ఉందని, అలాంటి కేసులను ఎత్తివేయవద్దని తాము చెప్పడం లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రజాప్రతినిధులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వాలు సంబంధిత హైకోర్టుకు తగిన కారణాలను వివరించాలంది. -
తక్కువ సమయం.. ఎక్కువ ఆదాయం
తుమ్మలపల్లి(నందివాడ): తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే వనామి(రొయ్య)సాగులో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్‌నాయక్ అన్నారు. గ్రామంలో సూర్యనారాయణరాజు సాగు చేస్తున్న వనామీని ఆయన బుధవారం పరిశీలించారు. రొయ్యల సాగు కత్తిమీద సాము వంటిదని తెలిపారు. పట్టుతప్పితే చేతులు తెగటం ఖాయమని పేర్కొన్నారు. నిపుణుల ఆధ్వర్యంలో సాగు చేస్తే ఫలితం పొందటానికి అవకాశం ఉంటుందని వివరించారు. సాగుకు అతి ముఖ్యమైనది విత్తనం అన్నారు. నాణ్యమైన పిల్లను ఎంచుకోవటంలో కొంచెం దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలోనే రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలన్నారు. అనుమతి లేని రొయ్యపిల్లల తయారీ సంస్థలపై దాడులు చేయనున్నట్లు వివరించారు. విజయవాడలో మూడు ప్రత్యేక బృందాలతో గురువారం సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరు అనుమతిలేని రొయ్య, చేపల పిల్లల తయారీ సంస్థలపై దాడులు చేస్తారని పేర్కొన్నారు. జంక్షన్‌కు చెందిన సూర్యనారాయణరాజు ఆరు ఎకరాల్లో రొయ్యల చెరువు సాగు ప్రారంభించి నేడు 500 ఎకరాల సాగుకు ఎదిగినట్లు పేర్కొన్నారు. నాణ్యమైన పిల్లలు, మేత, పరిశుభ్రమైన వాతావరణం చూసుకోవటమేనని ఇందుకు కారణమని వివరించారు. రైతులు ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న ఏరియేటర్లతో లబ్ధి పొందాలని సూచిం చారు. కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీఏలు కె.ఫణిప్రకాష్, గోపిరెడ్డి, రామ్మోహన్, ఎఫ్‌డీవో శ్రీనివాసరావు, రైతులు సూర్యనారాయణరాజు, గూడపాటి వెంకటేశ్వరరావు, ప్రసాద్‌రాజు, శివాజీరాజు, రాధాకృష్ణ, భాస్కరరాజు సిబ్బంది పాల్గొన్నారు. -
చిత్ర.. కళ తప్పుతోంది
కొత్త తరహాలో వస్తున్న ఫ్లెక్సీల ధాటికి సహజమైన చిత్రకళ ..కళ తప్పుతోంది. చిత్రకళపై ఆధారపడి జీవిస్తున్న ఎందరో కళాకారులు నిస్పృహలో ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా బొమ్మలు గీయటంలోనూ. అక్షరాలు తీర్చిదిద్దటంలో నైపుణ్యం సంపాదించి ఆ రంగంలో రాణిస్తున్న వారెందరో ఇప్పుడు ఆ రంగం నుంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -శ్రీకాకుళం టెక్నాలజీ పెరగటంతో ఆర్టిస్టులకు గ్రహణం జీవనోపాధి కోసం సున్నాలు వేసుకుంటున్న వైనం కడుపునింపని కళ పెయింటింగ్స్‌లో రకాలు పెయింటింగ్స్‌లో మాస్ పెయింటింగ్స్, కమర్షియల్ పెయింటింగ్స్, ఫైన్ ఆర్ట్స్ పెయింటింగ్ ఇలా అత్యంత ఆదరణ కలిగిన పెయింటింగ్స్ ఉన్నాయి. మాస్ పెయింటింగ్స్ అంటే గోడలపై పెద్ద పెద్ద బొమ్మలు, పేర్లు రాసేవారే ఈ పెయింటర్స్, కమర్షియల్ పెయింటింగ్ అంటే వ్యాపారాలకు సంబంధించి క్లాత్‌లపై, వాల్ పెయింటింగ్స్ వేసే వారిని ఈ పెయింటర్స్ అంటారు. ఇక చివరిది ఫైన్ ఆర్ట్స్. సినీ రంగంలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనికి ఈ మధ్యకాలంలో క్రమేపీ ఆదరణ తగ్గిపోయింది. దీనితో చిత్ర కళాకారులు కుటుంబాలతో బతకాలంటే ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. చిత్రకళాకారులు జీవనోపాధి లేక రోడ్డున పడినప్పటికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబందించిన పనులైనా చిత్రకళాకారులకి అప్పగించి జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు. కుంచె పట్టుకునే పరిస్థితి లేదు ప్రస్తుతం కాలంలో కళ ఉన్నా కుంచె పట్టుకుని బొమ్మలు గీసే పరిస్థితి లేదు. ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పార్టు టైమ్ డ్రాయింగ్ ఉపాధ్యాయులుగా, నూతన భవనాలకు సున్నాలు వేసుకునేందుకు, మరికొందరైతే ఆటోలు నడుపుకొంటూ, దుకాణాలు పెట్టుకుని కుటుంబాన్ని పోషించాల్సి వస్తుంది. -వి.నగేష్, చిత్రకళాకారుడు, చిన్నబరాటం వీధి చిత్రకళపై మక్కువ ఉన్నా ఉపాధి కరువే నేను బీటెక్ చదువుకున్నా బొమ్మలు గీయడమంటే నాకు చాలా ఇష్టం ప్రస్తుతం చిత్రకళకు ఆదరణ తగ్గిన విషయం తెలిసినప్పటికి ఈ వృత్తికి అలవాటు పడి వదులుకోలేకపోతున్నా. గతంలో అయితే నెలకు దాదాపుగా రూ. 20వేలు దాటి వచ్చేది. ప్రస్తుతం మాత్రం రూ. 5వేలు రావడం కష్టంగా మారింది. దీనితో షాపు అద్దె కరెంటు బిల్లుకూడా రావడం లేదు. ఇలా ఉండడంతో బతకాలన్నా కష్టంగా ఉన్నది కళనే నమ్ముకుని బతుకుతున్నా. ప్రభుత్వం ఆదుకుని ఏమైనా ఉపాధి అవకాశాలను కల్పిస్తే బాగుంటుంది. - బి.చంటి, చిత్ర కళాకారుడు, శ్రీకాకుళం